గౌతంరాజు

సినీ ఎడిటర్
(గౌతమ్ రాజు నుండి దారిమార్పు చెందింది)

జి. రాజు, గౌతంరాజు లేదా గౌతమ్ రాజు సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ సినిమారంగాలలో సుమారు 800 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి ఆయన సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు.

గౌతంరాజు
గౌతంరాజు
జననం(1954-01-15)1954 జనవరి 15
మరణం2022 జూలై 6(2022-07-06) (వయసు 68)
మరణ కారణంఅనారోగ్య సమస్యలు
వృత్తిఎడిటర్
పిల్లలు2 అమ్మాయిలు (సంధ్య, సుమాంజలి)
తల్లిదండ్రులు
  • రంగయ్య (తండ్రి)
  • కోదనాయకి (తల్లి)

బాల్యం

మార్చు

ఆయన 1954 జనవరి 15న ఒంగోలులో రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం చెన్నైలో స్థిరపడింది.

ఎడిటర్ గా

మార్చు

1982లో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రంతో ఎడిటర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌతంరాజు, చట్టానికి కళ్లులేవు సినిమాతో ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2002లో వచ్చిన ఆది సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా నంది పురస్కారం అందుకున్నాడు. చివరగా 2022లో మోహన్ బాబు హీరోగా వచ్చిన సన్ ఆఫ్ ఇండియాకు ఎడిటర్‌గా చేశారు.

చిత్ర సమాహారం

మార్చు

68 ఏళ్ల గౌతంరాజు కిడ్నీ, శ్వాస సంబంధ సమస్యలతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2022. జూలై 6 తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.[5] ఆయనకు సంధ్య, సుమాంజలి ఇద్దరు పిల్లలున్నారు.

మూలాలు

మార్చు
  1. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]
  2. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
  3. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020.
  5. "Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు కన్నుమూత". web.archive.org. 2022-07-06. Archived from the original on 2022-07-06. Retrieved 2022-07-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గౌతంరాజు&oldid=4192623" నుండి వెలికితీశారు