కెనాన్ ఈఓఎస్ 1100డి

కెనాన్ ఈఓఎస్ 1100డి, కెనాన్ సంస్థచే 2011 ఫిబ్రవరి 7 న విడుదల చేయబడ్డ ఒక డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా. జపాన్లో దీనినే ఈఓఎస్ కిస్ ఎక్స్ 50 అనీ అమెరికాలో ఈఓఎస్ రెబెల్ టీ-3 అనీ వ్యవహరిస్తారు. కెనాన్ ప్రారంభ స్థాయి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా అయిన ఈ ఓ ఎస్ 1000డి స్థానాన్ని ఇది ఆక్రమించింది.ఈఓఎస్ రెబెల్ టీ 4ఐతో బాటు ఈ కెమెరా కూడా తైవాన్లో రూపొందించబడతాయి. కెనాన్ లో మిగతా అన్ని మోడళ్ళు జపాన్ లో తయారు చేయబడతాయి.

కెనాన్ ఈఓఎస్ 1100డి
రకంDigital single-lens reflex camera
కెమేరా సెన్సార్CMOS APS-C 22.2 × 14.7 mm (1.6x conversion factor)
గరిష్ఠ రిసల్యూషన్12.2 effective megapixels, 4,272 × 2,848
కటకంCanon EF lens mount, Canon EF-S lens mount
ఫ్లాష్E-TTL II automatic built-in pop-up, 13m ISO 100 guide number, 27mm (equivalent in 135 format) lens focal length coverage; compatible with Canon EX Series Speedlite external hotshoe-mount flashes
షట్టర్focal-plane
షట్టర్ అవధి1/4000 to 30 s and Bulb, 1/200 s X-sync
ఎక్స్‌ప్లోజర్ కొలమానంFull aperture TTL, 63 zone iFCL SPC
ఎక్స్‌ప్లోజర్ రీతులుFull Auto, Portrait, Landscape, Close-up, Sports, Night Portrait, No Flash, Program AE , Shutter-priority, Aperture-priority, Manual, Auto Depth-of-field, Creative Auto
మెటరింగ్ రీతులుEvaluative, Partial (approx. 10% at center of viewfinder), Center-weighted average
ఫోకస్ ప్రాంతాలు9 AF points
ఫోకస్ రీతులుAI Focus, One-Shot, AI Servo
నిరంతర చిత్రీకరణ3 fps for 830 JPEG frames or 2 fps for 5 RAW frames
వ్యూ ఫైండర్Eye-level pentamirror SLR, 95% coverage, 0.87x magnification
ఫిల్మ్‌ వేగం అవధిISO 100 to 6400
ఫ్లాష్ బ్రాకెటింగ్Yes
Custom WBAuto, Daylight, Shade, Cloudy, Tungsten Light, White Fluorescent Light, Flash, Manual, user-set
WB బ్రాకెటింగ్± 3 stops in 1-stop increments;
రేర్ ఎల్.సి.డి.మానిటర్2.7 in color TFT LCD, 230,000 pixels
నిల్వSecure Digital Card
Secure Digital High Capacity
Secure Digital Extended Capacity
బ్యాటరీLP-E10 Battery Pack
కొలతలు(డైమన్షన్స్)130 mm × 100 mm × 78 mm (5.11 in × 3.93 in × 3.07 in)
బరువు495 గ్రా. (1.091 పౌ.) (body only)
తయారీ చేసిన దేశంTaiwan

ఫుల్ ఆటో

మార్చు
  • ఫోకస్ లాక్: నిశ్చలన ఆబ్జెక్టులని చిత్రీకరించటానికి
  • ఏ ఐ సర్వో ఏ ఎఫ్: చలన ఆబ్జెక్టులని చిత్రీకరించటానికి
  • లైవ్ వ్యూ షూటింగ్: కెమెరా యొక్క ఎల్ సీ డీ మానిటర్ పై తీసే చిత్రం కనబడటానికి

ఆంబియెన్స్ సెలెక్షన్

మార్చు
  • స్టాండర్డ్ సెటింగ్
  • వివిడ్
  • సాఫ్ట్
  • వార్ం
  • ఇంటెన్స్
  • కూల్
  • బ్రైటర్
  • డార్కర్
  • మోనోక్రోం

డ్రైవ్ మోడ్

మార్చు
  • సింగిల్ షూటింగ్
  • కంటిన్యువస్ షూటింగ్
  • సెల్ఫ్ టైమర్:10 సెకన్లు
  • సెల్ఫ్ టైమర్:కంటిన్యువస్

క్విక్ కంట్రోల్

మార్చు

డ్రైవ్ మోడ్, సెల్ఫ్ టైమర్, ఫ్ల్యాష్ ఫైరింగ్, ఆంబియెన్స్ సెలెక్షన్, లైటింగ్ ఆర్ సీన్ టైప్, బ్యాక్ గ్రౌండ్ లని నిర్ధారించుకొనవచ్చును.

క్రియేటివ్ షూటింగ్

మార్చు

బేసిక్ జోన్ లో సెట్టింగులు మార్చటానికి కుదరదు. సెట్టింగులు సృజనాత్మకంగా ఈ జోన్ లో వినియోగించుకొనవచ్చును.

ప్రోగ్రాం ఏఈ

మార్చు

షట్టరు వేగం, సూక్ష్మరంధ్రం సెట్టింగులను కెమెరా స్వయంచాలితంగా నిర్ణయిస్తుంది.

ఐ ఎస్ ఓ వేగం

మార్చు
  • 100 - 400: సూర్యకాంతి విరివిగా లభ్యమయ్యే బయలు ప్రదేశాల కొరకు
  • 400 - 1600: సాయంత్రం వేళల్లో, ఆకాశం మేఘావృతమైన సమయాలలో
  • 1600 - 6400: చీకటిమయంగా ఉండే లోపలి ప్రదేశాలు, రాత్రి సమయాలు

ఐ ఎస్ ఓ (ఆటో)

మార్చు

సందర్భాన్ని బట్టి కెమెరా ఐ ఎస్ ఓని స్వయంచాలితంగా నిర్ధారించుకొంటుంది

షట్టర్ ప్రయారిటీ ఏఈ

మార్చు

షట్టరు వేగంని నియంత్రించటంతో కదులుతున్న ఆబ్జెక్టుల చలనాన్ని స్తంభించినట్టు చిత్రీకరించటానికి లేదా చలన కళంకం ద్వారా కదిలినట్టు చూపించటానికి ఉపయోగ పడుతుంది.

అపెర్చర్ ప్రయారిటీ ఏఈ

మార్చు

నేపథ్యం స్పష్టంగా రావటానికి, లేదా కావాలని నేపథ్యంలో అస్పష్టత తేవటానికి ఉపయోగపడుతుంది.

డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ప్రివ్యూ

మార్చు

క్షేత్ర అగాథం నియంత్రించిన తర్వాత దానిని చిత్రీకరించటానికి ముందే ఎల్ సీ డీ మానిటర్ పై ప్రివ్యూ చూసుకొని సరిగా వచ్చినది ఫోటో తీసుకొనవచ్చును.

మ్యానువల్ ఎక్స్పోజర్

మార్చు

షట్టరు వేగాన్ని సూక్ష్మరంధ్రాన్ని మానవీయంగా సరిచేసుకొనవచ్చును.

బల్బ్ ఎక్స్పోజరు

మార్చు

షట్టరు బటన్ ని నొక్కి పట్టి ఉంచినంతసేపూ షట్టరుని తెరిచే ఉంచుతుంది.

ఆటో డెప్త్ ఆఫ్ ఫీల్డ్

మార్చు

సూక్ష్మరంధ్హ్ర నిర్ధారణ కెమెరా స్వయంచాలితంగా చేసుకుంటుంది.

మీటరింగ్ మోడ్

మార్చు

మూడు రకాల మీటరింగ్ మోడ్ లు లభ్యం.

ఎవాల్యుయేటివ్ మీటరింగ్

మార్చు

సాధారణ పరిస్థితులలో అతి విరివిగా ఉపయోగించబడే మీటరింగ్ మోడ్. మనుషుల చిత్రాలు తీయటానికి, నేపథ్యం ప్రకాశవంతంగా ఉన్న పరిస్థితులలో చిత్రాలు తీయటానికి ఉపయోగించబడే మోడ్.

పార్షియల్ మీటరింగ్

మార్చు

సబ్జెక్టు కన్నా నేపథ్యం ప్రకాశవంతంగా ఉన్న పరిస్థితులలో ఉపయోగించబడే మీటరింగ్ మోడ్

సెంటర్ వెయిటెడ్ యావరేజ్ మీటరింగ్

మార్చు

ప్రకాశం మొత్తం మధ్యన మీటర్ అయ్యి, తర్వాత సీన్ మొత్తం పైన మీటర్ అవుతుంది. నైపుణ్య వాడుకరులకై ఉద్దేశించబడింది.

ఎక్స్పోజర్ కాంపెన్జేషన్

మార్చు

1/3 విలువ భేదంతో -5 నుండి +5 వరకూ లభ్యం.

ఫ్ల్యాష్ ఎక్స్పోజర్ కాంపెన్జేషన్

మార్చు

1/3 విలువ భేదంతో -2 నుండి +2 వరకూ లభ్యం.

ఆటో ఎక్స్పోజర్ బ్రాకెటింగ్

మార్చు

కెమెరా స్వయంచాలితంగా 1/3 విలువ భేదంతో -2 నుండి +2 వరకూ వివిధ ఎక్స్పోజర్ లలో దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది.

ఎక్స్పోజర్ లాకింగ్

మార్చు

ఫోకస్ చేయవలసిన ప్రదేశం మీటరింగ్ ప్రదేశానికి భిన్నంగా ఉన్న పరిస్థితులలో లేదా వివిధ చిత్రాలని ఒకే ఎక్స్పోజర్ సెట్టింగ్ లో చిత్రీకరించాలనుకొన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇది ప్రకాశవంతమైన నేపథ్యాలు ఉన్నప్పుడు ఉపయోగించబడుతుంది.ఆటో లైటింగ్ ఎక్స్పోజర్

బ్రైట్నెస్, కాంట్రాస్ట్ సరిగా లేనప్పుడు కెమెరా స్వయంచాలితంగా వాటిని సరి చేసుకొంటుంది.

ప్రతిబింబం మూలలు సరిచేయటం

మార్చు

కటక లక్షణాల వలన ప్రతిబింబం యొక్క మూలలు చీకటిమయమౌతుంటాయి. దీనిని సరి చేసుకునే సౌలభ్యం ఉంది.

షార్ప్ నెస్

మార్చు

0 నుండి 7 వరకు.

  • 0 - సాఫ్ట్ ఇమేజ్
  • 7 - షార్ప్ ఇమేజ్

కాంట్రాస్ట్

మార్చు
  • -: బ్ల్యాండ్ ఇమేజ్
  • +: క్రిస్ప్ ఇమేజ్

సాచ్యురేషన్

మార్చు
  • -: డైల్యూటెడ్ కలర్స్
  • +: బోల్డర్ కలర్స్

కలర్ టోన్

మార్చు
  • -: రెడ్ స్కిన్
  • +: యెల్లో స్కిన్

మోనోక్రోం అడ్జస్ట్ మెంట్

మార్చు

ఫిల్టర్ ఎఫెక్ట్

మార్చు
  • నన్: సాధారణ నలుపు తెలుపు

వైట్ బ్యాలెన్స్

మార్చు

శ్వేత సమతౌల్యాన్ని సరి చేసేందుకు రెండు విధాలైన సదుపాయాలు గలవు.

ఆటో వైట్ బ్యాలెన్స్

మార్చు

కెమెరా స్వయంచాలితంగా శ్వేత సమతౌల్యాన్ని సరి చేసుకొంటుంది.

కస్టం వైట్ బ్యాలెన్స్

మార్చు

శ్వేత సమతౌల్యాన్ని మానవీయంగా నిర్ధారించవచ్చును.

సౌకర్యాలు

మార్చు
  • ఫిలిం వేగం 100–6,400.
  • కెనాన్ ఈ ఎఫ్, ఈ ఎఫ్-ఎస్ కటకాలు.
  • ఫైల్ ఫార్మాట్ లు: JPEG, RAW
  • 720p హెచ్ డి వీడియో

మూలాలు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు