కెనాన్ ఈ ఓ ఎస్ 3000ఎన్

కెనాన్ ఈ ఓ ఎస్ 3000 ఎన్ (ఆంగ్లం: Canon EOS 3000N) ఒక 35mm ఎస్ ఎల్ ఆర్ కెమెరా. ఈ కెమెరా రెండు CR123 లేదా CR123A బ్యాటరీలపైన పనిచేస్తుంది.

కెనాన్ ఈ ఓ ఎస్ 3000ఎన్
రకంఎస్ ఎల్ ఆర్ కెమెరా
ఫోకస్ రీతులుManual
తయారీ చేసిన దేశంజపాన్

పని తీరు

మార్చు

ఈ కెమెరా పనితీరు మూడు విభాగాలుగా విభజించబడినవి. అవి:

  • Basic Zone (ప్రాథమిక మండలం)
  • Creative Zone (సృజనాత్మక మండలం)
  • Function Set Zone

ప్రాథమిక మండలం

మార్చు

ఈ మండలంలో అమరికలు అన్నీ పూర్తిగా స్వయంచాలితం. తీయవలసిన ఛాయాచిత్రాన్ని బట్టి డయలు మారిస్తే మిగతా అమరికలు కెమెరా దానంతట అదే అమర్చుకొంటుంది.

  • Portrait: మనుషుల ముఖచిత్రాలను తీయటానికి ఉపయోగపడుతుంది. క్షేత్ర అగాథం తగ్గించటం వలన, నేపథ్యం మసకబారి, మనిషి ముఖం పై దృష్టి కేంద్రీకృతమౌతుంది.
  • Landscape: ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించటానికి
  • Close-up Mode: అతి సమీప ఛాయాచిత్రకళతో కీటకాలను, పుష్పాలను అందంగా చిత్రీకరించటానికి
  • Sports Mode: క్రీడావిన్యాసాలను/వేగంగా కదులుతున్న వాటిని స్తంభించినట్లుగా చిత్రీకరించటానికి.
  • Night Scene Portrait Mode: ఉదయం, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఛాయాచిత్రాలు తీయటానికి. నేపథ్యాన్ని సహజంగా చిత్రీకరిస్తూ, ఫ్ల్యాష్ వెలుగులో దగ్గర ఉన్న వస్తువు/మనిషిని చిత్రీకరించటానికి

సృజనాత్మక మండలం

మార్చు
  • Program AE: షట్టరు వేగాన్ని, సూక్ష్మరంధ్రాన్ని కెమెరా స్వయంచాలితంగా నిర్ధారించుకొంటుంది. బహిర్గతాన్ని ఏ మాత్రం మార్చకుండా కెమెరా నిర్ధారించిన షట్టరు వేగం, సూక్ష్మరంధ్రాలను కావలసిన విధంగా అమర్చుకొనవచ్చును.
  • Tv Shutter-Priority AE: షట్టరు వేగాన్ని కావలసినంతగా అమరిస్తే, దానిని బట్టి కెమెరాయే స్వయంచాలితంగా సూక్ష్మరంధ్రాన్ని నిర్ధారించుకొంటుంది.
  • Av Aperture-Priority AE: సూక్ష్మరంధ్రం కావలసినంతగా అమరిస్తే, దానిని బట్టి కెమెరాయే స్వయంచాలితంగా షట్టరు వేగాన్ని నిర్ధారించుకొంటుంది.
  • M Manual Exposure: సూక్షరంధ్రం, షట్టరువేగాన్ని ఫోటోగ్రఫర్ యే నిర్ధారించుకొనవచ్చును.

ఫోకస్

మార్చు

ఈ కెమెరాకు ఆటో ఫోకసింగ్, మ్యానువల్ ఫోకసింగ్ మోడ్ లు ఉన్నాయి. ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరించటానికి ఒకవేళ ఆటోఫోకసింగ్ మోడ్ పని చేయనిచో మ్యానువల్ గా ఫోకసింగ్ ను సరిచేసుకొనవచ్చును.

మీటరింగ్ మోడ్

మార్చు

ఈ కెమెరాకి మూడు మీటరింగ్ మోడ్ లు ఉన్నాయి.

  • Evaluative Metering: సాధారణంగా అన్ని పరిస్థితులలో ఉపయోగ పడే మీటరింగ్ మోడ్. ఫోటో తీయబడే అంశం, దాని చుట్టూ ఉండే కాంతి, నేపథ్యం వంటి వాటిని పరిగణలోకి తీసుకొని కెమెరా స్వయంచాలితంగా దానంతట అదే మీటరింగ్ చేసుకొంటుంది.
  • Partial Metering: అంశం యొక్క నేపథ్యం నుండి కాంతిని ప్రసరిస్తే, ఈ మీటరింగ్ మోడ్ ను ఉపయోగించాలి.
  • Centerweighted: మధ్యన మీటరింగు తీవ్రత ఎక్కువగా ఉండి చుట్టుప్రక్కల సరాసరిగా ఉంటుంది

ఇవి కూడా చూడండి

మార్చు