కెనియా జయంతిలాల్

తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

హిర్జీ కెనియా జయంతిలాల్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. డిఫెన్స్, పుల్ షాట్ పట్ల మక్కువ ఉన్న కుడి చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. ఒకేఒక టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలో, ఆంధ్ర క్రికెట్ జట్టుపై 153 పరుగులు చేశాడు. 1971లో రిజర్వ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా వెస్టిండీస్‌పై కింగ్‌స్టన్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆడి, ఐదు పరుగులు చేశాడు.[1] సునీల్ గవాస్కర్ గాయపడటంతో అతనికి ప్రత్యామ్నాయంగా ఆడాడు. అతని కెరీర్‌లో ఇది ఏకైక టెస్టుగా మిగిలిపోయింది.[2]

కెనియా జయంతిలాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హిర్జీ కెనియా జయంతిలాల్
పుట్టిన తేదీ(1948-01-13)1948 జనవరి 13
హైదరాబాదు, తెలంగాణ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 126)1971 ఫిబ్రవరి 18 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1967–1979హైదరాబాదు క్రికెట్ టీం
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ ఫస్ట్-క్లాస్
మ్యాచ్‌లు 1 91
చేసిన పరుగులు 5 4,687
బ్యాటింగు సగటు 5.00 36.33
100లు/50లు 0/0 8/22
అత్యధిక స్కోరు 5 197
వేసిన బంతులు 606
వికెట్లు 6
బౌలింగు సగటు 51.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/47
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 66/–
మూలం: CricInfo, 2019 అక్టోబరు 1

కెనియా జయంతిలాల్ 1948, జనవరి 13న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

డొమెస్టిక్ సర్క్యూట్ మంచి ఆటతీరు కనబరిచిన జయంతిలాల్ భారత క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు. రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన అతను 1968-69లో ఆంధ్రపై 153 పరుగులు చేశాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. 2384 పరుగులు (41.10) చేశాడు.[2]

ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 91 మ్యాచ్‌లలో 154 ఇన్నింగ్స్ లో 36.33 యావరేజీతో 4,687 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 197. బౌలింగ్ లో 606 బాల్స్ వేసి, 311 రన్స్ ఇచ్చి, 6 వికెట్లు తీశాడు.

మూలాలు

మార్చు
  1. "Full Scorecard of India vs West Indies 1st Test 1970/71 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-10-17. Retrieved 2022-06-24.
  2. 2.0 2.1 "Kenia Jayantilal profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Archived from the original on 2022-04-01. Retrieved 2022-06-24.

బయటి లింకులు

మార్చు