కెర్ల వెంకటేశ్వరరావు

కెర్ల వెంకటేశ్వరరావు తెలుగు నాటకరంగ నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు.

కెర్ల వెంకటేశ్వరరావు
జననం1947, ఏప్రిల్ 9
విద్యఎం.బి.ఏ., ఎం.ఏ.బి.ఎల్., డిపిఎంఐఆర్
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు
జీవిత భాగస్వామిజయంతి
తల్లిదండ్రులుతలుపులరావు, రామాయమ్మ

జీవిత విషయాలు

మార్చు

వెంకటేశ్వరరావు 1947, ఏప్రిల్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలోని కొంకుదురు గ్రామంలో జన్మించాడు.

కళారంగం

మార్చు

తండ్రి తలుపులరావు రంగస్థల కళాకారుడు కావడంతో ఆయన స్పూర్తితో స్కూల్లోను, యూనివర్సిటీల్లోనూ వివిధ కార్యక్రమాలలో పాల్గొని స్వంతంగా స్క్రిప్టులు రాసుకుని నటుడిగా, గాయకునిగా పలు బహుమతులు అందుకున్నాడు. బుర్రకథలు కూడా తయారుచేసి ప్రదర్శించాడు.

తరువాత ఉద్యోగరీత్యా 1965లో విశాఖపట్టణం వచ్చి, జయవాణీ ఆర్కెస్ట్రాలో గాయకుడిగా పరిచయం అయి, ఆ సంస్థ ద్వారా ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. వాణీ ఆర్ట్స్ అసోసియేషన్ లో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఛైర్మన్, పుణ్యస్థలి, రెండురెళ్లు ఆరు, సిప్పొచ్చింది, ఉలిపికట్టె, రాజీవం, నీరుపొయ్, సాధన, ఎడ్రస్ లేని మనుషులు, కళ్ళు మొదలైన అనేక నాటికలలో నటించి ఉత్తమ నటుడిగా అనేక సార్లు బహుమతులను అందుకున్నారు . 'సిప్పొచ్చింది' అనే నాటికకు తొలిసారిగా దర్శకత్వం వహించి, జెసీస్ పరిషత్తులో ఉత్తమ రచన బహుమతిని పొందాడు.

జయ కళానికేతన్ స్థాపన

మార్చు

1984లో జయకళానికేతన్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థద్వారా ఎన్నో సాంఘిక, చారిత్రాత్మక, పౌరాణిక నాటకాలు వేయించి, 400 కు పైగా ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, ముంబాయి, ఢిల్లీ లోనూ యిచ్చివందకిపైగా బహుమతులను అందుకున్నాడు.

సాంఘిక నాటకాలకు 7 నంది అవార్డులు, పౌరాణిక/చారిత్రాత్మక నాటకాలకు 10కి పైగా గరుడ అవార్డులు, రెండు నంది అవార్డులు సాధించాడు. ఇతర పరిషత్తుల్లో ప్రదర్శించి 100కి పైగా ఉత్తమ ప్రదర్శన, ఇతర బహుమతులు పొందాడు. 50కి పైగా ఉత్తమ నటుడిగా బహుమతులు, 50కి పైగా ఉత్తమ దర్శకునిగా బహుమతులను అందుకున్నాడు.

1994లో వారు ప్రదర్శించిన 'అభినయవేదం' నాటకానికి కళాసాగర్, మదరాసు వారిచే ఉత్తమ దర్శకుడిగా సత్కారం, అవార్డు అందుకున్నారు. ఉత్తమ గాయకుడిగా శ్రీ వెంకటేశ్వర నాటక కళాపరిషత్తు, తిరుపతి వారి గరుడ అవార్డును కైవసం చేసుకున్నాడు.

నాటకాలు (సాంఘికం)

మార్చు
  • నటనాలయం
  • కాబూలీవాలా
  • అభినయవేదం
  • ఎన్నెల్లో ఎంకి
  • మేరా భారత్ మహాన్
  • మరో మొహెంజొదారో
  • భస్మ, సింహాసనం
  • పలుకే బంగారమాయే
  • అనంతరాగం
  • నిజం
  • రక్షాబంధనం
  • ఆరు పిశాచాలు
  • తాజి
  • హరిత
  • ట్రీట్మెంటు
  • జీవనవేదం
  • నరకం
  • సద్గతి
  • ఒంటికాలి పరుగు
చారిత్రాత్మక/పౌరాణిక నాటకాలు
మార్చు
  • నర్తనశాల
  • కీచకవధ
  • జరాసంధ
  • శ్రీకాంతకృష్ణమాచార్య
  • ఉత్తర రామాయణం

ఇతర రంగాలు

మార్చు

ఆకాశవాణి, దూరదర్శన్ లలో

మార్చు

ఆకాశవాణిలో బి-హై గ్రేడ్ లలితా సంగీత గాయకుడిగా 1976 నుండి ఎన్నో వందల లలిత సంగీత, జానపద గీతాల కార్యక్రమాలలో పాల్గొన్నాడు. దూరదర్శన్ లో బి-హై గ్రేడ్ కళాకారునిగా 7 పాటలు టెలికాస్ట్ అయ్యాయి. దూరదర్శన్ లో బి-హై గ్రేడ్ నటునిగా, ఆకాశవాణి లో ఎ-గ్రేడ్ నటునిగా అనేక నాటికలలో, కార్యక్రమాలలో పాల్గొన్నాడు. దూరదర్శన్ ద్వారా జయకళానికేతన్ సంస్థ తరపున ఆట, అక్షర విజయం, జీవనవేదం నాటికలు టెలికాస్ట్ అయ్యాయి.

టివీరంగం

మార్చు
  • ఈటివిలో ప్రసారమైన ప్రముఖ సీరియల్స్ 'సంఘర్షణ', 'మట్టి మనిషి' (అక్కినేని నాగేశ్వరరావుగారి తమ్ముడిగా) లలో ప్రముఖ పాత్రలు పోషించాడు.

సినీరంగం

మార్చు

సంగీత దర్శకుడిగా

మార్చు
  • రేడియో సంగీతరూపకం - ధృవ - చంద్రగుప్త , షిరిడీసాయి, నర్తనశాల, జరాసంధ, ఉత్తర రామాయణం, ముద్రా రాక్షసం, శ్రీకాంత కృష్ణమాచార్య, భలే పెళ్లి, అనంతరాగం, అభినయవేదం, ఎన్నెల్లో ఎంకి, మేరాభారత్ మహాన్, నటనాలయం, కాబూలీవాలా, హరిత , ట్రీట్మెంట్ మొదలగు నాటకాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

న్యాయ నిర్ణేతగా

మార్చు
  • పంతం పద్మనాభ కళా షరిషత్తు, కాకినాడ, కళాభారతి పరిషత్, అ.జో.వి.భో. పరిషత్, రావుగోపాలరావు పరిషత్ మొదలైన అనేక పరిషత్తులకే కాక, 2017లో నంది నాటకోత్సవాలలో తుది పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.

సన్మానాలు - సత్కారాలు

మార్చు
  • మదరాసు కళాసాగర్ వారిచే ఉత్తమ దర్శకుడిగా సత్కారం (చెన్నైలో)
  • అమ్మ సంస్కృతి సంస్థాన్ ట్రస్ట్ వారిచే 'బహుముఖ ప్రజ్ఞాశాలిగా' సత్కారం
  • విశాఖపట్నంలో విశాఖ జూనియర్ చాంబర్ వారి పురస్కారం ఉత్తమ నటునిగా
  • కళాజగతి నుండి ఉత్తమ దర్శకుని అవార్డు
  • దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారిచే 'విశాఖరత్న' బిరుదాంకిత సత్కారం
  • ఆల్ ఇండియా క్రిష్ణంరాజు ఫేన్స్, కల్చరల్ అసోసియేషన్ వారి ప్రతిభా పురస్కారం
  • రామవరం నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ లోఅత్యుత్తమ నటునిగా జవ్వాది రంగస్థల పురస్కారం
  • కళావాణి - ఉభయ గోదావరులు సంస్థ నుండి 'రసజ్ఞ' పురస్కారం
  • వేదిక్ సేవా ట్రస్ట్ వారిచే ఉత్తమనటునిగా ఉగాది పురస్కారం
  • మూర్తి కల్చరల్ అసోసియేషన్ - కాకినాడ వారిచే ఉత్తమ నటునిగా సత్కారం
  • కె.వి.ఆర్ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్, విశాఖపట్నం వారిచే 'ప్రతిభా పురస్కారం'
  • యువకళావాహని, హైదరాబాద్ వారి 'ప్రతిభా పురస్కారం'
  • నాట్య రవళి, విశాఖపట్నం వారి 'సర్వధారి ఉగాది పురస్కారం'
  • అరసం, విశాఖ వారి 'అభ్యుదయ స్పూర్తి' పురస్కారం
  • విశాఖనాటక కళాపరిషత్తు, విశాఖవారి 'దర్శక శిఖామణి' బిరుదు ప్రదానం
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే తెలుగు రంగస్థల దినోత్సవం సందర్భంగా రివార్డు
  • మందులు మెమోరియల్ ఆర్ట్స్ వారి 14వ వార్షికోత్సవ వేడుకలలో 'మందులు స్మారక రంగస్థల పురస్కారం'
  • శతవత్సర సంస్థ యంగ్మెన్స్ హేపీ క్లబ్, కాకినాడ వారిచే 'జీవిత సాఫల్య పురస్కారం'.
  • తెలుగు కళా సమితి, కువైట్ వారి 'ప్రతిభా పురస్కారం'
  • యువకళావాహిని వారి'ఎన్టీఆర్ శతజయంతి పురస్కారం'

మూలాలు

మార్చు

https://photomagic123.blogspot.com/2023/07/blog-post.html