కె.ఆర్.కుమారస్వామి అయ్యర్

కె.ఆర్.కుమారస్వామి అయ్యర్ ఒక భారతీయ కర్ణాటక సంగీత గాత్ర సంగీత విద్వాంసుడు, వైణికుడు.

కె.ఆర్.కుమారస్వామి అయ్యర్
K.R.Kumaraswamy Iyer.png
జననం1913
తమిళనాడు రాష్ట్రం, కెత్తవరం పాలయం
వృత్తికర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు, స్వరకర్త

విశేషాలుసవరించు

ఇతడు తమిళనాడు రాష్ట్రంలో కెత్తవరం పాలయం గ్రామంలో జన్మించాడు. ఇతడు మెచ్చేరి సుందరరామ శాస్త్రుల వద్ద గాత్ర సంగీతం అభ్యసించాడు. ఇతని తమ్ముడు కె.ఆర్. కేదారనాథ అయ్యర్‌కూడా సంగీత విద్వాంసుడు. ఇతడు త్రివేండ్రంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో అనేక దశాబ్దాలు సంగీత ఉపాధ్యాయునిగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులను సంగీతవిద్వాంసులుగా తయారు చేశాడు. తరువాత ఇతడు త్రిపునితురలోని ఆర్.ఎల్.వి.మ్యూజిక్ అకాడమీకి ప్రిన్సిపాల్‌గా బాధ్యతను నెరవేర్చాడు. ఇతని శిష్యులలో కె. జె. ఏసుదాసు, తిరువిళ ఆర్. జయశంకర్, వెచూర్ హరిహరసుబ్రహ్మణ్య అయ్యర్, ఎస్. రుక్మిణి గోపాలకృష్ణన్, మంగద్ నటేశన్, పరస్సల బి పొన్నమ్మాళ్ మొదలైన వారున్నారు. ఇతడు కర్ణాటక గాత్ర సంగీతానికి చేసిన సేవలకు గుర్తింపుగా1992లో ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[1] ఇతనికి మలయాళీ క్లబ్, చెన్నై వారి నుండి "స్వాతి రత్న" అవార్డు లభించింది. మద్రాసు సంగీత అకాడమీ ఇతడిని 1978లో టి.టి.కె అవార్డుతో సత్కరించింది.[2]

మూలాలుసవరించు

  1. web master. "K. R. Kumaraswamy Iyer". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 19 February 2021.
  2. web master. "TTK Award Recipients". The Music Academy, Madras. The Music Academy, Madras. Retrieved 19 February 2021.