పరస్సల బి పొన్నమ్మాళ్
పరస్సల బి. పొన్నమ్మాళ్ (జ 29 నవంబర్ 1924) ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. తిరువనంతపురంలోని శ్రీ "అనంతపద్మనాభస్వామి దేవాలయం"లో నవరాత్రి ఉత్సవాలలో స్త్రీలు పాల్గొనడం నిషేధం. 300 సంవత్సరాలుగా ఉన్న ఈ అచారాన్ని ధిక్కరిస్తూ 2006 సెప్టెంబరు 23వ తేదీన తిరువాంకూరు రాజవంశానికి చెందిన రాజా రవివర్మ ప్రోద్బలంతో పొన్నమ్మాళ్ ఆలయంలోని నవరాత్రి మంటపంలో తన కచేరీ చేసింది.[1]
పరస్సల బి.పొన్నమ్మాళ్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 29 నవంబరు 1924 పరస్సల |
మూలం | తిరువనంతపురం |
సంగీత శైలి | భారతీయ శాస్త్రీయ సంగీతం |
వృత్తి | శాస్త్రీయ గాయకురాలు. |
ఆరంభ జీవితం
మార్చుఈమె కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా పరస్సల గ్రామంలో ఒక కేరళ అయ్యర్ కుటుంబంలో 1924లో మహదేవ అయ్యర్, భాగ్యవతి అమ్మాళ్ దంపతులకు జన్మించింది.
ఈమె బాల్యం నుండే కర్ణాటక సంగీతం నేర్చుకొనడం ప్రారంభించింది. తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశలలో ఈమె మొట్టమొదటి బాలికా విద్యార్థి. ఈమె ఆ కళాశాలనుండి "గాన భూషణం", "గాన ప్రవీణ" కోర్సులను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యింది.
ఈమె పాపనాశం శివన్, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, కె.ఆర్.కుమారస్వామి అయ్యర్ వంటి మహామహులైన సంగీత గురువుల శిష్యరికం చేసింది..[2]
వృత్తి
మార్చుఈమె తిరువనంతపురంలోని కాటన్ హిల్ బాలికల హైస్కూల్‌లో సంగీత ఉపాధ్యాయినిగా తన వృత్తిని ఆరంభించింది. [3] ఈమె త్రిపునితురలోని ఆర్.ఎల్.వి.సంగీత, లలితకళల కళాశాలకు మొట్టమొదటి మహిళా ప్రిన్సిపాల్‌గా పనిచేసింది.[4]
ఈమె గురువాయూర్ పురేశ సుప్రభాతం,[5] త్రిశివపురేశ సుప్రభాతం, ఉల్సవ ప్రభందం, నవరాత్రి కృతి, మీనాంబికా స్తోత్రం, ఇరాయిమ్మన్ తంపి స్వరపరచిన కీర్తనలు, కె.సి.కేశవపిళ్ళై స్వరపరచిన కృతులు ఈమె ఆలపించి ప్రచారంలోనికి తెచ్చింది..[6]
ఈమె దేశవిదేశాలలో అనేక కచేరీలు చేసింది.[7]
గుర్తింపు
మార్చుఈమెకు అనేక పురస్కారాలు, బిరుదులు లభించాయి.
వాటిలో కొన్ని:
- 2017లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం.[8]
- 2016లో ఎం.జి.రాధాకృష్ణన్ అవార్డు.[9]
- 2015 చెన్నై ఫైన్ ఆర్ట్స్ వారి జీవన సాఫల్య పురస్కారం.[10][11]
- 2012లో సంగీత ప్రభాకర అవార్డు.[12]
- 2009లో ఎస్.గణేశ శర్మ అవార్డు.[13]
- 2009లో సంగీత నాటక అకాడమీ అవార్డు.[14]
- 2009లో స్వాతి సంగీత పురస్కారం.[15]
- 2009లో శ్రీ గురువాయూరప్పన్ చెంబై పురస్కారం[16]
శిష్యులు
మార్చుఈమె అనేకమంది శిష్యులలో ఎన్.జె.నందిని, ఎం.జి.రాధాకృష్ణన్, కె.ఓమనకుట్టి, నెయ్యతింకర వాసుదేవన్, అర్పణామూర్తి మొదలైన వారున్నాఉ.
మూలాలు
మార్చు- ↑ Krishnaraj.S. "CARNATIC MUSIC :: Prince Rama Varma : A legend in the Making". www.carnaticindia.com. Archived from the original on 25 April 2016. Retrieved 2017-05-31.
- ↑ "Grace Notes From Travancore". outlookindia.com/. Retrieved 2017-11-29.
- ↑ Varma, Aswathi Thirunal Rama. "A rare gem of a musician". The Hindu. Retrieved 2017-05-31.
- ↑ Ranee Kumar. "A doyen in her own right". The Hindu. Retrieved 2017-05-31.
- ↑ "Parassala Ponnammal | S Mahadevan". S Mahadevan (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-06-06. Archived from the original on 2018-01-16. Retrieved 2018-01-16.
- ↑ "Ms. Parassala Ponnammal | Kerala Tourism". www.keralatourism.org (in ఇంగ్లీష్). Archived from the original on 2017-12-01. Retrieved 2017-11-29.
- ↑ "പൊന്നമ്മാളിന്റെ സംഗീത യാത്രയ്ക്ക് പത്മശീയുടെ തിളക്കം". Mathrubhumi. Archived from the original on 2017-06-12. Retrieved 2017-05-31.
- ↑ "Padma Awards". padmaawards.gov.in. Retrieved 2017-05-31.
- ↑ "Minister A K Balan Presenting M G Radhakrishnan Award To Musician Parassala B Ponnammal". World News. Retrieved 2017-06-13.
- ↑ "Honour for Parassala Ponnammal". article.wn.com. Retrieved 2017-05-31.
- ↑ "Honour for Parassala Ponnammal - Times of India". The Times of India. Retrieved 2017-11-27.
- ↑ "Award for Ponnammal". The Hindu. Retrieved 2017-06-13.
- ↑ "Awards for Vasudevan Potti, Parassala Ponnammal". The New Indian Express. Retrieved 2017-06-13.
- ↑ "Sangeet Natak Academy awards 2009". The Hindu. Retrieved 2017-06-13.
- ↑ "Swati Puraskaram announced". article.wn.com. Retrieved 2017-06-13.
- ↑ Adroit. "Sree Guruvayurappan Chembai Puraskaram for vocalist Parassala Ponnammal - Carnatic Music News - Darbar for claissical music / claissical dance". www.carnaticdarbar.com. Archived from the original on 10 September 2016. Retrieved 2017-06-13.