కె.ఎన్.చిన్నస్వామి అయ్యర్

వాయులీన విద్వాంసుడు, స్వరకర్త

కె.ఎన్.చిన్నస్వామి అయ్యర్ ఒక వాయులీన విద్వాంసుడు.[1]

కరూర్ ఎన్.చిన్నస్వామి అయ్యర్
వ్యక్తిగత సమాచారం
జననం1882
కరూర్, తమిళనాడు
మరణం1967
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

విశేషాలు మార్చు

ఇతడు 1888లో ఒక కర్ణాటక సంగీత విద్వాంసుల కుటుంబంలో నరస అయ్యర్, అఖిలాండామ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఇతడు వయోలిన్ వాదనను మొదట తన తండ్రి వద్ద, తరువాత తన సోదరుడు దేవుడు అయ్యర్ వద్ద నేర్చుకున్నాడు. ఇతడు సోలో ప్రదర్శనలతో పాటు అగ్రశ్రేణి సంగీత విద్వాంసుల కచేరీలకు ప్రక్క వాద్యం అందించాడు. ఇతడు భారతదేశంలోని అన్ని ముఖ్యపట్టణాలలో, మలయా, సిలోన్, బర్మా దేశాలలో తన కచేరీలను ఇచ్చాడు. 1904లో మైసూరు మహారాజు ఇతడిని సన్మానించాడు. 1950లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1964లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది.

శిష్యులు మార్చు

మూలాలు మార్చు

  1. web master. "K. N. Chinnaswamy Iyer". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 29 March 2021.[permanent dead link]

బయటి లింకులు మార్చు