కుందన్ లాల్ సైగల్

బాలీవుడ్ తొలి సూపర్ స్టార్
(కె.ఎల్. సెహ్ గల్ నుండి దారిమార్పు చెందింది)

కుందన్ లాల్ సైగల్ (ఆంగ్లం : Kundan Lal (K.L.) Saigal) ( జ: ఏప్రిల్ 11, 1904 జమ్మూ – మ: జనవరి 18, 1947 ) జలంధర్ భారతీయ గాయకుడు, నటుడు. ఇతడు బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా పరిగణింపబడుతాడు. సైగల్ కాలంలో బాలీవుడ్ కు కలకత్తా కేంద్రంగా వుండేది, ప్రస్తుతం ముంబాయి కేంద్రంగా ఉంది.

కుందన్ లాల్ సైగల్
సైగల్ , జమున దేవదాస్ (1935) సినిమాలో
సైగల్ , జమున దేవదాస్ (1935) సినిమాలో
వ్యక్తిగత సమాచారం
జననం (1904-04-11)1904 ఏప్రిల్ 11
జమ్ము, జమ్మూ కాశ్మీరు
మరణం 1947 జనవరి 18(1947-01-18) (వయసు 42)
జలంధర్, పంజాబ్ (బ్రిటిష్ ఇండియా)
సంగీత రీతి నేపధ్య గాయకుడు
వృత్తి గాయకుడు, నటుడు
వాయిద్యం గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1932–1947

జీవితం

మార్చు

సైగల్ తన 42వ యేటనే మరణించాడు. మరణానికి ముందు అనేక హిట్ సినిమాలు అందించాడు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో నిర్మింపబడిన సినిమా షాజహాన్ ( 1946 ) సూపర్ హిట్ అయ్యింది. జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే క్యా కరేఁ హిందీ పాటల మకుటంలో మణి.

తన పదునైదు ఏండ్ల ప్రస్థానంలో సైగల్ 36 సినిమాలలో నటించాడు - 28 హిందీ/ఉర్దూ, 7 బెంగాలీ,, ఒక తమిళ సినిమా. ఇవే కాకుండా హిందీ/ఉర్దూ హాస్యభరిత సినిమా ఐన దులారీ బీబీ (3 రీళ్ళు) లో నటించాడు, ఈ సినిమా 1933లో విడుదల అయింది.

దేవదాస్‌లో కుందన్ లాల్ సైగల్, జమున, బారువా 1936 హిందీ వెర్షన్.

ఇవీ చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు