కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి

కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి ప్రముఖ రంగస్థల నటులు.

కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి
జననంఫిబ్రవరి 15, 1932
చినగాదెలవర్రు
ఇతర పేర్లుకె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి
వృత్తిరంగస్థల కళాకారులు
ప్రసిద్ధితెలుగు రంగస్థల నటుడు

కృష్ణమూర్తి చినగాదెలవర్రు లో 1932 ఫిబ్రవరి 15న జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

చిన్నవయసులోనే ప్రేమలీలలు, కృష్ణవిజయం, ఏది న్యాయం, కాంగ్రేస్ విజయం మొదలైన వాటిలో నటించారు. హైస్కూల్ లో చదువుతున్న సమయంలో తెలుగు పండితులు జాస్తి శ్రీరాములు ప్రోత్సాహంతో వారసత్వం నాటకంలో నటించారు. 1963లో బ్రాహ్మణ కోడూరులో నిర్వహించిన మాధవపెద్ది వెంకట్రామయ్య స్మారక కళాపరిషత్ లో గుమ్మడి వెంకటేశ్వరరావు చేతులమీదుగా ఉత్తమ నటనకు ప్రథమ బహుమతిని అందుకున్నారు.1968లో చదలవాడ గ్రామంలో జరిగిన నాటక పోటీలలో పాల్గొని ద్వితీయ బహుమతి పొందారు.

ప్రస్తుతం

మార్చు

పోస్టల్ శాఖ ఉద్యోగంలో రిటైరైన కృష్ణమూర్తి, ప్రస్తుతం కూచిపూడిలో ఉంటూ కళారంగంలో కృషి చేస్తున్నారు.

నటించిన నాటకాలు - పాత్రలు

మార్చు
  • దొంగవీరుడు - గురువయ్య శెట్టి
  • చిల్లరకొట్టు చిట్టెమ్మ – బంగారయ్య
  • అన్నా చెల్లెలు - పిచ్చయ్య తాత
  • ఛైర్మన్ - ముసలయ్య
  • బాలనాగమ్మ - మాయా బసవేశ్వరుడు
  • అల్లూరి సీతారామరాజు - అల్లూరి సీతారామరాజు
  • మహామంత్రి తిమ్మరుసు - మహామంత్రి తిమ్మరుసు

ఏకపాత్రాభినయాలు

మార్చు
  • శ్రీ రామభక్త రామదాసు
  • పాదుకాపట్టాభిషేకం - దశరుధుడు

మూలాలు

మార్చు
  • కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 158.