కె. ఎస్.సుదర్శన్ పూర్తి పేరు కుప్పహల్లి సీతారామయ్య సుదర్శన్. ఈయన 2000 - 2009 మధ్య కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఐదవ సర్ సంఘ్ చాలక్ గా పనిచేశారు.

కుప్పహల్లి సీతారామయ్య సుదర్శన్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
In office
2000–2009
అంతకు ముందు వారురాజేంద్రసింగ్
తరువాత వారుమోహన్ భగవత్
వ్యక్తిగత వివరాలు
జననం(1931-06-18)1931 జూన్ 18
రాయ్ పూర్, సెంట్రల్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా
మరణం2012 సెప్టెంబరు 15(2012-09-15) (వయసు 81)
రాయ్ పూర్, ఛత్తీస్‌గఢ్, భారత దేశం
కళాశాలజబల్పూర్ ఇంజనీర్ కాలేజ్

జీవిత చరిత్ర మార్చు

జననం మార్చు

సుదర్శన్ గారు రాయ్‌పూర్‌లోనీ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కర్ణాటకలోని మాండ్యా జిల్లా కుప్పహల్లి గ్రామానికి చెందినవారు.[1][2]

విద్య మార్చు

ఈయన జబల్పూర్ లోని జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి టెలికమ్యూనికేషన్స్ లో తన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు.

జనవరి 2009 లో, ఆయన జీవితకాల నిస్వార్థ సామాజిక సేవను , దేశ నిర్మాణంలో ఆయన చేసిన కృషిని గుర్తించి, ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లోని శోభిత్ విశ్వవిద్యాలయం అతనికి గౌరవ డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ ను ప్రదానం చేసింది.[3]

ఆర్ ఎస్ ఎస్ తో పరిచయం మార్చు

ఈయన 9 సంవత్సరాల వయస్సులోనే మొట్టమొదటి సారిగా ఆర్ ఎస్ ఎస్ శాఖ కు హాజరయ్యారు. 1954 లో మధ్యప్రదేశ్ లోని రాయగ్ జిల్లాలో ప్రచారక్‌గా నియమించబడ్డాడు. 1964 లో చాలా చిన్న వయస్సులోనే మధ్య భారత్ లో ప్రాంత ప్రచారక్ గా సేవ చేశారు. 1969 లో, అఖిల భారత సంస్థ అధిపతుల కన్వీనర్‌గా నియమితులయ్యారు. దీని తరువాత 1977 నార్త్-ఈస్ట్ లో సేవలు చేశారు, రెండు సంవత్సరాల తరువాత బౌద్ధిక్ సెల్ (ఆర్ఎస్ఎస్ థింక్-ట్యాంక్) చీఫ్ గా బాధ్యతలు స్వీకరించాడు. 1990 లో, సంస్థ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. శారీరక్ (శారీరక వ్యాయామాలు) , బౌద్ధిక్ ప్రముఖ్ గా రెండు పదవులను వేర్వేరు సందర్భాలలో నిర్వహించే అరుదైన నైపుణ్యం ఆయనకు ఉంది.[4][5]

సర్ సంఘ్ చాలక్ మార్చు

10 మార్చి 2000 సంవత్సరం లో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ గా నియమితులయ్యారు. తన అంగీకార ప్రసంగంలో, మధ్య భారత్ ప్రాంతానికి నాయకత్వం వహించడానికి తనను ఎలా ఎంచుకున్నారో సుదర్శన్ గుర్తు చేసుకున్నారు. మొదట్లో తాను బాధ్యతలు స్వీకరించడానికి సంశయించినప్పటికీ, అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ ఎం. ఎస్. గోల్‌వాల్కర్ తన మనసును చాటుకోవడానికి సహాయం చేసాడు. "నేను నా విధులను నిర్వర్తించగలిగాను, ఎందుకంటే నాకు సీనియర్ వ్యక్తులు నాతో పూర్తిగా సహకరించారు," అని ప్రసంగం లో చెప్పారు.[6][7]

చివరి రోజులు మార్చు

ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతను మార్చి 21, 2009 న సర్ సంఘ్ చాలక్ పదవి నుంచి తప్పుకున్నారు.[8] [9] [10]

మరణం మార్చు

కె ఎస్ సుదర్శన్ తీవ్ర అనారోగ్య కారణం తో సెప్టెంబర్ 15, 2012 న కన్నుమూశారు.

మూలాలు మార్చు

  1. "RSS turns heat on BJP as KS Sudarshan warns party of straying from its ideological moorings". India Today. Retrieved 25 April 2005.
  2. "KS Sudarshan, former RSS chief, passes away". The Times of India. Retrieved 15 September 2012.
  3. "Former RSS chief KS Sudarshan cremated in Nagpur". NDTV.com.
  4. "rediff.com:K S Sudarshan: Born into RSS". www.rediff.com.
  5. "RSS remembers 5th Sarasanghachalak, Social Engineer KS Sudarshanji on his 4th Punyatithi #EngineersDay". Vishwa Samvada Kendra. 15 September 2016. Archived from the original on 13 మే 2021. Retrieved 12 జూన్ 2021.
  6. "Sudarshan is new RSS chief". Rediff.com.
  7. "K S Sudarshan: Born into RSS". Rediff.com.
  8. "RSS chief K S Sudarshan announces retirement". The freelibrary.
  9. |url=newspaper=Hindustan times|date=2012-09-17|url-status=dead|archive-url=rshan-passes-away/Article1-930584.aspx|newspaper=Hindustan times|date=2012-09-17|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120917175748/http://www.hindustantimes.com/India-news/Maharashtra/Swadeshi-man-Sudarshan-passes-away/Article1-930584.aspx%7Carchive-date%3D17 September 2012}}
  10. "K. Sudarshan dead". TDNpost. 2012-09-15. Archived from the original on 2013-01-04. Retrieved 2017-12-15.