కె.చెంగలరాయ రెడ్డి

కె.చెంగలరాయ రెడ్డి (1902 -1976) భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రాజకీయ నాయకుడు, అతను భారత రాజ్యాంగ సభలో సభ్యుడు, మైసూర్ రాష్ట్ర (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం) మొదటి ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందాడు.

క్యాసంబల్లి చెంగలరాయ రెడ్డి
3వ మధ్యప్రదేశ్ గవర్నరు
In office
ఫిబ్రవరి 10, 1966 – మార్చి 7, 1971
ముఖ్యమంత్రిద్వారకా ప్రసాద్ మిశ్రా
గోవింద నారాయణ్ సింగ్
నరేష్ చంద్ర సింగ్
శ్యామ చరణ శుక్లా
అంతకు ముందు వారుపి.వి.దీక్షిత్ (ఆపద్ధర్మ)
తరువాత వారుసత్య నారాయణ సిన్హా
In office
1965 ఫిబ్రవరి 11 – 1966 ఫిబ్రవరి 2
ముఖ్యమంత్రిద్వారకా ప్రసాద్ మిశ్రా
అంతకు ముందు వారుహరి వినాయక్ పటస్కార్
తరువాత వారుపి.వి.దీక్షిత్ (ఆపద్దర్మ)
కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి
In office
1961 ఏప్రిల్ 5 – 1963 జూలై 19
ప్రధాన మంత్రిజవాహర్ లాల్ నెహ్రూ
అంతకు ముందు వారులాల్ బహాదుర్ శాస్త్రి
తరువాత వారుమనూభాయి షా
మొదటి మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి
In office
1947 అక్టోబరు 25 – 1952 మార్చి 30
అంతకు ముందు వారుకార్యాలయ ఏర్పాటు
తరువాత వారుకెంగల్ హనుమంతయ్య
వ్యక్తిగత వివరాలు
జననం(1902-05-04)1902 మే 4
క్యాసంబల్లి, కోలార్ జిల్లా, మైసూరు రాజ్యం, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం క్యాసంబిల్లి, కోలార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం)
మరణం1976 ఫిబ్రవరి 27(1976-02-27) (వయసు 73)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్

జీవిత పరిచయం

మార్చు

కె.సి.రెడ్డి 1902 మే 4న కర్ణాటక (మైసూర్) రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో వొక్కలిగ కుటుంబంలో జన్మించాడు.[1][2][3] అతను చిన్నతనం నుండి విప్లవకారుడు, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక నిరసనల కార్యక్రమాలలో పాల్గొన్నాడు.[4][5]

న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తరువాత, రెడ్డి ఇతర రాజకీయ కార్యకర్తలతో కలిసి 1930లో ప్రజా పక్ష (పీపుల్స్ పార్టీ)ని స్థాపించాడు.[6] మైసూర్ సంస్థానంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఈ పార్టీ లక్ష్యం. ప్రధానంగా రైతుల సమస్యలను ఎత్తి చూపడంతో ఆ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో మద్దతు లభించింది. ఆ సంస్థలో 1935 నుండి 1937 వరకు పనిచేసాడు.[7] 1934లో ప్రజామిత్ర మండలితో కలిసి 'ప్రజా సంయుక్త పక్ష' సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత,[8] అతను మైసూర్ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ జరిగిన "మైసూర్ చలో " ఉద్యమంలో ప్రధాన నాయకునిగా పనిచేసాడు. 1947 అక్టోబరు 25న రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు.[9] అతను 1952 మార్చి 30 వరకు ముఖ్యమంత్రి పదవిలో పనిచేశాడు.

తరువాత, ఈ సంస్థ భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేయబడి, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంది. అతను 1937-38, 1946-47 మధ్య రెండుసార్లు మైసూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 1946లో అతను కర్నాటక రాష్ట్రం (మైసూర్) నుండి భారత రాజ్యాంగ సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అతను మైసూర్ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ జరిగిన "మైసూర్ చలో " ఉద్యమంలో ప్రధాన నాయకునిగా పనిచేసాడు. 1947 అక్టోబరు 25న రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. అతను 1952 మార్చి 30 వరకు ముఖ్యమంత్రి పదవిలో పనిచేశాడు.

అతను 1952లో మైసూర్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. తదనంతరం, అతను 1952 నుండి 1957 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. 1957, 1962 పార్లమెంటు ఎన్నికలలో కోలార్ పార్లమెంట్ స్థానం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో, అతను కేంద్ర గృహనిర్మాణ, సరఫరా మంత్రిగా (1957-61) & వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా (1961-63) కూడా పనిచేశాడు.

1963-64 వరకు, రెడ్డి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడిగా ఎన్నికయ్యాడు. తరువాత, అతను 1965 నుండి 1971 వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేశాడు.[10] 1976 ఫిబ్రవరి 27న మరణించాడు.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అతను మైసూర్ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ జరిగిన "మైసూర్ చలో " ఉద్యమంలో ప్రధాన నాయకునిగా పనిచేసాడు. 1947 అక్టోబరు 25న రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. అతను 1952 మార్చి 30 వరకు ముఖ్యమంత్రి పదవిలో పనిచేశాడు.

2002లో రెడ్డి జన్మ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి, కర్ణాటక అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసించబడింది.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అతను మైసూర్ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ జరిగిన "మైసూర్ చలో " ఉద్యమంలో ప్రధాన నాయకునిగా పనిచేసాడు. 1947 అక్టోబరు 25న రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. అతను 1952 మార్చి 30 వరకు ముఖ్యమంత్రి పదవిలో పనిచేశాడు.[11]

మూలాలు

మార్చు
  1. KC Reddy's 117th birth anniversary: Karnataka celebrates first chief minister.
  2. Shankaragouda; Hanamantagouda Patil (2002). Community Dominance and Political Modernisation: The Lingayats. Mittal Publications. p. 353. ISBN 9788170998679. There are three chief ministers from Vokkaliga community (Sarvashri K.C. Reddy, K. Hanumathaiah and Kadidal Maniappa) between 1947 and 1956 in the Mysore state. The Vokkaligas dominated the politics of Mysore state during this period.
  3. G. Narayana Reddy (1986). Rural Elite and Community Work: A Socio Political Perspective. Chugh Publications. p. 80. ISBN 9788185076034. Till 1956, most of the rural Mysore was dominated by Vokkaligas and the three Chief Ministers (K.C. Reddy, Hanumathaiah and Kodidal Manjappa) were also Vokkaligas.
  4. "K.C. Reddy | Chief Minister of Karnataka | Personalities". Karnataka.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-05-07. Retrieved 2018-08-04.
  5. "K. Chengalaraya Reddy – The Pioneer Politician". reddysociety.com. Archived from the original on 6 June 2017. Retrieved 4 August 2018.
  6. "History of Freedom Movement −7: The Mysore Congress". Ithihas.
  7. Community dominance and political modernisation: the Lingayats – Shankaragouda Hanamantagouda Patil – Google Books
  8. "Chapter I1 Trajectories of Development: History and Spatiality" (PDF).
  9. "Freedom fighters get together for 'Mysore chalo' anniversary". The Hindu. 25 October 2006. Archived from the original on 14 June 2013.
  10. "Former Governors of Madhya Pradesh – Shri Kyasamballi Chengalrao Reddy". Raj Bhavan Bhopal Official Website. Archived from the original on 19 July 2011. Retrieved 5 July 2011.
  11. "CM hails K.C.Reddy's contribution to State". The Hindu. 6 May 2002. Archived from the original on 16 December 2013.