కె.జి.కన్నబిరాన్

భారతీయ న్యాయవాది

కె.జి.కన్నబిరాన్ (కన్నాభిరాన్ గా సుపరిచితులు) పౌరహక్కుల ఉద్యమనేత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది.ఆయన "పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్" సంస్థకు సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు.

కె.జి.కన్నబిరాన్
K.g.kannabhiran.jpg
జననంనవంబరు 9, 1929
మధురై, తమిళనాడు
మరణండిసెంబరు 30, 2010
హైదరాబాదు,ఇండియా
ఉద్యమంపొర హక్కులనేత, మానవ హక్కుల నేత.

జీవిత విశేషాలుసవరించు

ఆయన నవంబరు 9 1929తమిళనాడు లోని మధురైలో కందడై గోపాలస్వామి అయ్యంగార్, పంకజం దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి వైద్యులు.కన్నబిరాన్ పూర్వీకులు తమిళులు. తరతరాలుగా ఆయన కుటుంబీకులు నెల్లూరులో జీవిస్తున్నారు. కన్నబిరాన్ విద్యాభ్యాసం నెల్లూరులో చేసారు. ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం, న్యాయశాస్త్రాలలో పట్టభద్రులైనారు. ఆయన మద్రాస్ బార్ కౌన్సిల్ లో చేరి 1953 నుండి న్యాయవాద వృత్తిని ఆయన మామయ్య అయిన రాజప్ప అనే వకీలి వద్ద చేపట్టారు.మొదటిరోజుల్లో ఆర్థికమైన ఇబ్బందులు చాలా పడి చివరికి న్యాయవాదిగా హైదరాబాదులో నిలదొక్కుకొన్నారు. 1970ప్రాంతాల్లో హైదరాబాదులో న్యాయవాదులు కొంతమంది కూడి రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధకాండలకు వ్యతిరేకంగా పనిచేయడానికి నక్సలైట్ డిఫెన్స్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసి, దానికి కన్నబిరాన్‌గార్ని అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. వీరందరూ కలిసి పార్వతీపురం, హైదరాబాద్ కుట్రకేసుల్లో డిఫెన్స్ న్యాయవాదులుగా వ్యవహరించసాగారు. అప్పుడు మొదలైన పౌరహక్కుల ఉద్యమం ఈరోజు ఉన్న స్థితికి రావటానికి ముఖ్యుల్లో ఒకరు శ్రీ కన్నబిరాన్. ఎమర్జెన్సీ రోజుల్లో డిటెన్యూలుగా ఉన్నవారి తరపున వాదించటానికి మిగిలిన ఒకే లాయరు శ్రీ కన్నబిరాన్. ఎమర్జెన్సీ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం (AP Civil Liberties Committee, APCLC) కు పదిహేనేళ్ళు అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు అన్ని పౌరహక్కుల సంస్థలతోనూ, కార్యకర్తలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. పి.యు.సి.ఎల్ దేశ స్థాయి కార్యవర్గ సభ్యులు.

పోలీసులు తప్పుడుకేసులు పెట్టినప్పుడు ఆయన ఎంతో చాకచక్యంగా వాటిలోని లొసుగుల్ని బయటపెట్టేవారు. కన్నబిరాన్‌గారి జీవితమంతా రూల్ ఆఫ్ లాని నిష్పాక్షికంగా అమలుచేయటం గురించే. ఒకవేళ ఆ ‘లా’యే న్యాయంగా లేకపోతే దాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో సరిచేయటం గురించే.[1]

న్యాయవాదిగాసవరించు

ఆయన మద్రాసులో న్యాయవాద వృత్తి మొదలుపెట్టి అనతికాలంలో హైదరాబాదుకు మార్చారు.[2]

మానవ హక్కుల నేతగాసవరించు

కన్నబిరాన్ 1960ల ప్రారంభంలో న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేరారు. ఆయన మానవహక్కులు, రాజకీయ ఖైదీల కేసులను వాదించేవారు.ఆయన "పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్" సంస్థకు సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు. ఆయన అనేక ఎన్‌కౌంటర్ కేసులను వాదించారు. వాటిలో నాలుగు కేసులు ముఖ్యమైనవి. వాటిలో శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం, తరిమెల్ల నాగిరెడ్డి, సికింద్రాబాదు, రామ నగర్ కేసులు.[3]

PUCL , APCLC ప్రారంభంసవరించు

ఆయన "పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్" (PUCL) ను రాజకీయ భావజాలలకు భిన్నంగా ప్రారంభించారు. ఆయన పౌర స్వేచ్ఛ, మానవ హక్కులు కోసం వివిధ రాజకీయ పార్టీల నేతలను ఒకే వేదికమీదకు తెచ్చి పోరాడారు. ఆయన పి.యు.సి.ఎల్ లోని జాతీయ ఎగ్జిక్యూటివ్ లలో ఒకరు. ఆయన పి.యు.సి.ఎస్ కు 1995 నుండి 2009 వరకు అధ్యక్షునిగా యున్నారు.[4]

రచనలుసవరించు

ఆయన "ద వేజెస్ ఆఫ్ ఇంపునిటీ-పవర్,జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్" అనే పుస్తకాన్ని ప్రచురించారు.[5]

మరణంసవరించు

ఆయన తన 81వ యేట అనారోగ్యంతో హైదరాబాదులో మరణించారు.[6]

మూలాలుసవరించు

  1. న్యాయంకోసం నిరంతర పోరాటం కన్నబిరాన్ జీవితకథ – 24 గంటలు
  2. Redddy, Ravi (January 15–28, 2011). "Fighter always". Frontline. Chennai: THE HINDU. Retrieved April 3, 2015.
  3. "Defending dissent and democracy". The Hindu. January 15, 2011. Retrieved January 15, 2011.
  4. "PUCL Formed". మూలం నుండి 2015-09-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-07-18. Cite web requires |website= (help)
  5. "Advocacy of human rights". Cite web requires |website= (help)
  6. "Civil rights activist Kannabiran passes away". Cite web requires |website= (help)

ఇతర లింకులుసవరించు