కె.వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రఖ్యాత రచయిత్రి. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో పల్లా వెంకట రమణ, బంగారమ్మ దంపతులకు ప్రథమ కుమార్తెగా జన్మించారు. 1964లో శ్రీ కళా రామమోహనరావును వివాహమాడారు. వరలక్ష్మి గారి కథలు ప్రధానంగా తను నివసిస్తోన్న మెట్ట ప్రాంతానికి చెందిన స్త్రీల, బడుగు జీవులకు చెందిన కథలు. చదివే వారిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అలాగని ఆమె రచనలు ప్రాంతాలతోనే ఆగిపోలేదు. తను సందర్శించిన ఎన్నో ప్రాంతాలకు చెందిన వారి జీవితాల్ని స్పృశిస్తూ కథలు, కవిత్వం వ్రాసారు. రేడియో నాటికలు, వ్యాసాలు, నవలికలు వ్రాసారు.

కె.వరలక్ష్మి
జననంకె.వరలక్ష్మి
(1948-10-24)1948 అక్టోబరు 24
Indiaజగ్గంపేట , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంజగ్గంపేట ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా
వృత్తిరచయిత్రి
భార్య / భర్తశ్రీ కళా రామమోహనరావు
పిల్లలురవీంద్రఫణిరాజ్, డా॥కె.గీత, శ్రీలలిత
తండ్రిపల్లా వెంకట రమణ
తల్లిపల్లా బంగారమ్మ

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

కె.వరలక్ష్మి బాల్యమంతా, స్కూల్ ఫైనల్ (11వతరగతి) వరకు చదువు జగ్గంపేట లోనే సాగింది. 10 వ తరగతిలో పెళ్ళి జరిగింది. ఆర్థిక స్వాతంత్ర్యం ఏర్పడ్డాక ఇంటర్మీడియేట్ తో మొదలుపెట్టి ఎమ్మే (తెలుగు) వరకు చదివారు. భర్త ఉద్యోగరీత్యా కోనసీమలోని కందికుప్ప, మెట్ట ప్రాంతంలోని కిర్లంపూడి లలో కొంతకాలం జీవించారు.

ఉద్యోగం మార్చు

అబ్బాయికి అయిదేళ్ళొచ్చే వేళకి భర్తగారి ఉద్యోగరీత్యా జగ్గంపేటలో ఉండడం వల్ల ప్రాథమిక స్థాయి పాఠశాల "రవీంద్రా కాన్వెంట్"ను నెలకొల్పి విజయవంతంగా పాతికేళ్లు నడిపేరు. వీరి పిల్లలు ముగ్గురూ వీరి దగ్గరే అదే పాఠశాలలో చదివేరు.

కుటుంబం మార్చు

వీరి అబ్బాయి రవీంద్ర ఫణిరాజ్  పలు అనువాద చిత్రాలు, తెలుగు చిత్రాల నిర్మాత. పెద్దమ్మాయి డా॥కె.గీత ప్రఖ్యాత కవయిత్రి, రచయిత్రి, తెలుగురచయిత.ఆర్గ్ స్థాపకురాలు. చిన్నమ్మాయి శ్రీలలిత కూడా కథా రచయిత్రి.

పురస్కారాలు మార్చు

కవిత్వానికి: శ్రీ శ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కందుకూరి రాజ్యలక్ష్మి మొ.న పురస్కారాలు. కథలకు:

 • సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం
 • చాసో స్ఫూర్తి పురస్కారం
 • విమలాశాంతి పురస్కారం
 • సహృదయ సాహితి పురస్కారం
 • హసన్ ఫాతిమా పురస్కారం
 • రంజని పురస్కారం
 • అజో-విభో పురస్కారం
 • ఆటా కథా పురస్కారం
 • తానా కథా పురస్కారం
 • రంగవల్లి పురస్కారం
 • పులికంటి పురస్కారం
 • ఆర్.ఎస్. కృష్ణ మూర్తి పురస్కారం
 • తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం
 • శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం మొ॥నవి.

కె.వరలక్ష్మి పుస్తకాలు మార్చు

కథల సంపుటులు మార్చు

కవితా సంపుటి మార్చు

ఇతర రచనల వివరాలు మార్చు

అనేక కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు.

మూలాలు మార్చు

 1. "అతడు- నేను". Archived from the original on 2016-06-10. Retrieved 2016-04-29.

బయటి లింకులు మార్చు