కె.విజయరామారావు

కె. విజయరామారావు ఐ.పి.ఎస్.అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి. అతను సి.బి.ఐ. డైరక్టరుగా పనిచేసాడు.[1]

జీవిత విశేషాలుసవరించు

విజయరామారావు కరీం నగర్ జిల్లాలోని ఏటూరు నాగారంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల‌ దాకా విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది.తాతగారు (అమ్మ నాన్న) కల్యాణరావు స్వాతంత్య్ర సమరయోధుడు. వెంకటగిరిలో చాలా పెద్ద భూస్వామ్య కుటుంబం.వెంకటగిరిలో విద్యాభ్యాసం అయిపోయాక పైచదువులకు మద్రాసు యూనివర్సిటీలో చేరాడు.బి.ఎ. ఆనర్స్‌ పూర్తవగానే 1958 అక్టోబరులో కరీంనగర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో లెక్చరర్‌ ఉద్యోగంలో చేరాడు.విశ్వనాథ సత్యనారాయణ ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండేవాడు.1959 అక్టోబరు నాటికి ఐ.పి.ఎస్‌. ట్రైనీగా శిక్షణ పొంది చిత్తూరు ఏ.ఎస్పీ.గా చేరాడు.1984 ఆగస్టు సంక్షోభం నాటికి ఇతను హైదరాబాద్‌ కమిషనర్‌గా ఉన్నాడు.సి.బి.ఐ. డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు,ముంబై బాంబు పేలుళ్లు.మొదలైన కేసులు దర్యాప్తు నిర్వహించాడు. సర్వీసులో ఉండగానే ఎల్‌.ఎల్‌.బి.పూర్తి చేశాడు.రిటైరైయిన తర్వాత పోలీస్‌ మాన్యువల్‌ రాశాడు. అధికార వికేంద్రీకరణ మీద నమ్మకం ఎక్కువ. తెదేపా పార్టీలో చేరాడు.ఖైరతాబాద్‌ నుంచి శాసన సభ్యుడిగా గెలిచాడు.శాసన సభ్యుడిగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి (రోడ్లూ భవనాల శాఖ) దక్కింది.

రాజకీయ జీవితంసవరించు

అతను 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఖరతా బాద్ నియోజకవర్గం లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్థనరెడ్డి పై విజయం సాధించాడు.[2] 2004 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసినా ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్థనరెడ్డి విజయం సాధించాడు. [3] 2009 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి దానం నాగేందర్ చేతిలో ఓడిపోయాడు.[4]

భావాలుసవరించు

  • ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు ఇతను డిగ్రీ చదువుతున్నాడు. తెలుగువాళ్లు ఎక్కడ చేరినా అదే మాట్లాడుకునేవాళ్లు.ఆయన చనిపోయాక అప్పటి ప్రధాని నెహ్రూ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాడు. అదీ మద్రాసు లేకుండా. 'ఈ ప్రకటనేదో కొన్నిరోజులు ముందు చేసి ఉంటే ఆయన మనకు దక్కేవారు కదా' అని అతను ఎంతో బాధపడ్డసందర్బాలు ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. May 31, CHARU LATA JOSHI; May 31, 1996 ISSUE DATE:; June 1, 1996UPDATED:; Ist, 2013 13:37. "CBI chief K. Vijaya Rama Rao to leave behind legacy as controversial as his remarkable career". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-08-16.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2021-08-16.
  3. "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Retrieved 2021-08-16.
  4. "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Retrieved 2021-08-16.