ములుగు జిల్లా

తెలంగాణ లోని జిల్లాల్లో ఒకటి

తెలంగాణలో ములుగు కేంద్రంగా ములుగు జిల్లా ఏర్పాటైంది. 2019 ఫిబ్రవరి 16న నారాయణపేట జిల్లాతో పాటు ఈ జిల్లా ఏర్పాటైంది.[1] జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ములుగు రెవెన్యూ డివిజన్‌ను విడదీసి, మొత్తం 9 మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటుచేశారు.[2] జిల్లా జనాభా 2.94 లక్షలు.

జిల్లా లోని మండలాలు సవరించు

 
ములుగు జిల్లా

కొత్త జిల్లాలో మండలాలవారీగా గ్రామాల సంఖ్య ఇలా ఉంది.

గ్రామాల సంఖ్యా వివరాలు
క్ర.సంఖ్య మండలం రెవెన్యూ గ్రామాల

మొత్తం సంఖ్య

అందులో నిర్జన

గ్రామాలు సంఖ్య

నిర్జన గ్రామాలు పోగా

మిగిలిన రెవెన్యూ గ్రామాలు

1 ములుగు మండలం 19 02 17
2 వెంకటాపూర్‌ మండలం 10 01 09
3 గోవిందరావుపేట

మండలం

14 04 10
4 తాడ్వాయి మండలం 73 32 41
6 ఏటూరునాగారం మండలం 39 16 23
6 కన్నాయిగూడెం మండలం 25 07 18
7 మంగపేట మండలం 23 03 20
8 వెంకటాపురం మండలం 72 27 45
9 వాజేడు మండలం 61 20 41
మొత్తం 336 112 224

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (1)

అవార్డులు సవరించు

  • కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2023 సంవత్సరానికి గానూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ప్రదానం చేసిన నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌–2023లో ఉత్తమ జిల్లా పంచాయతీలు విభాగంలో సెకండ్‌ ర్యాంకు అవార్డును (రూ.3కోట్ల నగదు పారితోషం) అందుకుంది.[3]

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 18, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019
  3. "National Panchayat Awards: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు". Sakshi Education. 2023-04-08. Archived from the original on 2023-04-17. Retrieved 2023-04-18.

వెలుపలి లింకులు సవరించు