కె.వి.ప్రసాద్ (మృదంగ విద్వాంసుడు)
కె.వి.ప్రసాద్ కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ మృదంగ వాద్య కళాకారుడు.
కె.వి.ప్రసాద్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | ఎర్నాకుళం , కేరళ, భారతదేశం | 1968 మే 4
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | మృదంగ వాద్య కళాకారుడు |
వాయిద్యాలు | మృదంగం |
విశేషాలు
మార్చుఇతడు 1968, మే 4వ తేదీన కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో జన్మించాడు.[1] మృదంగ విద్యను ఇతడు తన ఆరు సంవత్సరాల[2] వయసు నుండే ఎర్నాకులం నారాయణ అయ్యర్, పరస్సల రవి, టి.కె.మూర్తిల వద్ద అభ్యసించాడు. ఇతడు తంజావూరు బాణీలో మృదంగ వాద్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇతడు మృదంగంతో పాటు చెంద, ఎదక్క, తబలా, కాంగో డ్రమ్స్ మొదలైనవి వాయించగలడు. కర్ణాటక గాత్ర సంగీతంలో కూడా ఇతడికి ప్రవేశం ఉంది. ఇతడు కేరళ విశ్వవిద్యాలయం నుండి సైన్సు పట్టభద్రుడు.
ఇతడు ఆకాశవాణి ఏ - టాప్ గ్రేడు కళాకారుడు. ఇతడు అనేక మంది అగ్రశ్రేణి సంగీత విద్వాంసులకు మృదంగ సహకారం అందించి వారితో కలిసి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కచేరీలు చేశాడు. వారిలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, చిట్టిబాబు, కె.వి.నారాయణస్వామి, నేదునూరి కృష్ణమూర్తి, తేతకూడి హరిహర వినాయకరం, టి.ఎన్.శేషగోపాలన్, కె. జె. ఏసుదాసు, ఉప్పలపు శ్రీనివాస్, ఎన్.రవికిరణ్, కదిరి గోపాలనాథ్ మొదలైన వారున్నారు. కర్ణాటక సంగీత రంగంలోనే కాక ఇతడు తెలుగు, తమిళ, మలయాళ సినిమా దర్శకులతో కూడా కలిసి పనిచేశాడు. ఇతడు అనేక రికార్డులను విడుదల చేశాడు.
సత్కారాలు, గుర్తింపులు
మార్చు1974లో ఇతడు ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన మృదంగ పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు. కేరళ సంగీత నాటక అకాడమీ నుండి వరుసగా మూడు పర్యాయాలు అవార్డును గెలుచుకున్నాడు.[3] 2000లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతడికి కళైమామణి పురస్కారాన్ని ప్రకటించింది. చెన్నైలోని త్యాగబ్రహ్మ గానసభ ఇతడిని "వాణీ కళాసుధాకర" బిరుదుతో సన్మానించింది. 2001లో కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. 2012లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
మూలాలు
మార్చు- ↑ web master. "K. V. Prasad". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 19 March 2021.[permanent dead link]
- ↑ web master. "K V Prasad". Chennaiyil Thiruvaiyaru. Lakshman Sruthi Musicals Pvt. Ltd. Retrieved 19 March 2021.[permanent dead link]
- ↑ web master. "Vidwan.K V PRASAD". Sraavyam. Sraavyam Associates. Archived from the original on 18 ఫిబ్రవరి 2021. Retrieved 19 March 2021.