నరసింహన్ రవికిరణ్ (జ.12 ఫిబ్రవరి 1967) ఒక భారతీయ గోటు వాద్యకారుడు, గాత్ర విద్వాంసుడు, స్వరకర్త, సంగీత ప్రాసంగికుడు. ఇతడు "మెల్‌హార్మొనీ" అనే క్రొత్త కాన్సెప్టును సృష్టించాడు. గోటువాద్య కళాకారుడు చిత్రవీణ నరసింహన్ ఇతని తండ్రి.[1] కర్ణాటక సంగీత విద్యాంసుడు నారాయణ అయ్యంగార్ ఇతని తాత.

ఎన్.రవికిరణ్
వ్యక్తిగత సమాచారం
జననం (1967-02-12) 1967 ఫిబ్రవరి 12 (వయసు 57)
మైసూరు, భారతదేశం
సంగీత శైలిభారత శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, వరల్డ్ మ్యూజిక్, మెల్‌హార్మనీ
వృత్తివాద్య కళాకారుడు, గాత్ర విద్వాంసుడు, స్వరకర్త
వాయిద్యాలుచిత్రవీణ
క్రియాశీల కాలం1969 – ప్రస్తుతం

ప్రారంభ జీవితం

మార్చు

రవికిరణ్ మైసూరు నగరంలో జన్మించాడు. ఇతడు రెండేళ్ళ వయసులో 1969 ఏప్రిల్, ఆగష్టు నెలలలో బెంగళూరులో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పండిట్ రవిశంకర్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, టి.ఆర్.మహాలింగం[2] వంటి మహామహుల సమక్షంలో మొదటిసారి తన ప్రతిభను ప్రదర్శించాడు.[3] ఇతడు కర్ణాటక సంగీతానికి చెందిన 325 రాగాలను, 175 తాళాలను గుర్తించగలిగాడు.[4] 1969 డిసెంబరులో మద్రాసు సంగీత అకాడమీ వారి 43వ వార్షిక సంగీతోత్సవాలలో ఈ బాలమేధావి తన ప్రతిభను ప్రదర్శించాడు.[5] అకాడమీ ఇతడికి స్కాలర్‌షిప్పును ప్రకటించింది.[6] తరువాత ఇతడు బొంబాయిలోని షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్, కొయంబత్తూరులోని త్యాగరాజ సభ మొదలైన చోట్ల కూడా తన ప్రదర్శనలిచ్చాడు.[7]పండిట్ రవిశంకర్ ఇతడి ప్రదర్శనను చూసి "మీరు భగవంతుడు ఉన్నాడని నమ్మకపోతే ఒకసారి రవికిరణ్‌ను చూడండి. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు." అని వ్యాఖ్యానించాడు.[8]

తన తండ్రి చిత్రవీణ నరసింహన్ శిక్షణలో ఇతడు తన ఐదేళ్ళ ప్రాయంలో 1972లో కోయంబత్తూరులో తొలిసారిగా గాత్ర సంగీత ప్రదర్శన చేశాడు. ఇతనికి 10 సంవత్సరాల వయసు వచ్చే లోపు ఇతడు మద్రాసు, బెంగళూరు, మైసూరు వంటి నగరాలలో కచేరీలు చేశాడు. ఇతని కచేరీలు రెండున్నర గంటలకు పైగా వ్యవధిని కలిగి ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించి భారతీయ పత్రికలలో ప్రశంసలు వెల్లువెత్తింది.

వృత్తి

మార్చు

ఇతడు పిన్న వయసులోనే గోటువాద్య కళాకారుడిగా తన సత్తాను నిరూపించుకున్నాడు.[9][10][11] 1985 జూలైలో ఇతడు చెన్నైలో 24 గంటల నిర్విరామ కచేరీ నిర్వహించాడు.[12] ఆకాశవాణి, దూరదర్శన్‌లు తమ నిబంధనలను సడలించి ఇతడికి 12వ యేటనే కచేరీలు చేయడానికి అనుమతినిచ్చాయి. ఇతడిని ఫ్రాన్సు (1985),[13] స్విట్జర్లాండు (1987), జర్మనీ (1992), బ్రెజిల్ (2012), పోలండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, యుగోస్లేవియా (1997) దేశాలలో జరిగిన సంగీతోత్సవాలలో పాల్గొనడానికి ఆహ్వానించారు. ఇతడు చికాగో వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్,[14] థియేటర్ డి లా విల్లె పారిస్,[15] యూరోపాలియా ఫెస్టివల్, బెల్జియమ్,[16] మిలీనియం ఫెస్టివల్, మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్, బుడాపెస్ట్[17] వంటి అనేక ప్రపంచస్థాయి కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు.

1986-96ల మధ్య ఇతడు టి.బృంద వద్ద శిక్షణ పొందాడు.[18] ఇతడు యువతలో శాస్త్రీయ సంగీత విలువలు పునరుద్ధరించడానికి కృషి చేశాడు.[19]ఇతడు అనేక సోలో ప్రదర్శనలు, కంజీర/ఘటం/మృదంగం మొదలైన వాద్యాలు, గోటు వాద్యంతో జుగల్బందీ కార్యక్రమాలు, పియానో, కీబోర్డు, గిటారు ఇతర వాద్యాలతో భాగస్వామ్య కచేరీలు, అనేక గాత్ర కచేరీలకు పక్కవాద్య సహకారాలు ఇచ్చాడు.[20]

ఇతడు గాత్ర విద్వాంసుడిగా దేశ, విదేశాలలో అనేక కచేరీలు చేశాడు. వాటిలో క్లీవ్‌లాండ్ ఫెస్టివల్, చికాగో వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వంటివి ఉన్నాయి. ఇతడు పాడిన పాటలతో "జీనియస్ ఎట్ వర్క్" అనే ఆల్బం తీసుకువచ్చాడు. ఇతడు గోటువాద్యంలో అనేక సాంకేతికపరమైన మార్పులు తెచ్చాడు.[21]

రవికిరణ్ పాశ్చాత్య సంగీత సింఫనీలకు, ఆర్కెస్ట్రాలకు, స్ట్రింగ్ చతుష్కాలకు సంగీత సహకారాన్నందించాడు. తాజ్ మహల్,[22] లారీ కొరియెల్, మార్టిన్ సింప్సన్, జార్జ్ బ్రూక్స్, సైమన్ ఫిలిప్స్, రోనాల్డ్ వాన్ కాంపెన్‌హౌట్ వంటి ప్రపంచస్థాయి కళాకారులకు, బి.బి.సి.ఫిల్‌హార్మోనిక్,[23] విస్కాన్‌సిన్, గోట్టింగ్‌జెన్ క్వింటెట్, అపోలో ఛేంబర్ ప్లేయర్స్, [24]మిడిల్‌టన్ కమ్యూనిటీ సింఫనీ,[25] శాక్రిమెంటో సింఫనీ[26] మొదలైన ఆర్కెస్ట్రాలకు తోడ్పాటు నందించాడు.

సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టి.బృంద, గిరిజాదేవి, పండిట్ బిర్జూ మహరాజ్,[27] మంగళంపల్లి బాలమురళీకృష్ణ,[28] విశ్వమోహన్ భట్, ఎన్.రమణి, ఆర్.కె.శ్రీకంఠన్, కిషన్ మహారాజ్, నేదునూరి కృష్ణమూర్తి, మాండొలిన్ శ్రీనివాస్[29] మొదలైన భారతీయ విద్వాంసులకు ఇతడు వాద్యసహకారాన్ని అందించాడు.


స్వరకల్పన

మార్చు

ఇతడు 800కు పైగా శాస్త్రీయ, సమకాలీన రచనలకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇతడు స్వరపరచిన భారత శాస్త్రీయ రచనలలో వర్ణాలు, కృతులు, జావళులు, తిల్లానాలు, పదాలు ఉన్నాయి. కర్ణాటక సంగీతంలోని 35 తాళాలకు ప్రతి తాళంలోను ఒక కృతికి,[30] 72 మేళ రాగమాలికా గీతానికి స్వరకల్పన చేశాడు.[31]

ఇతడు "వీతవనం",[32]చూడామణి,[33][34]కేశవప్రియ, వైష్ణవి, సామప్రియ, శివమనోహరి, అంధకారిణి[33] వంటి కొత్త రాగాలను సృష్టించాడు. [35] ఇతడు అనేక మంది అళ్వారుల,[36] వేదాంతదేశికుల,[37] పురందరదాస, డి.వి.గుండప్ప, మరికొందరు సమకాలీనుల కృతులకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇతడు జనవరి 2016లో చెన్నైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తమిళ్ స్టడీస్‌లో 1330 తిరుక్కురల్ శ్లోకాలకు 3రోజుల, 16 గంటల వ్యవధిలో సంగీతాన్ని సమకూర్చి రికార్డును సృష్టించాడు.[38][39]

ఇంకా ఇతడు లక్ష్మీప్రాభవం,[40] సావిత్రి,[41] వినాయకవైభవం,[42] రామాయణ - బాలకాండం, యుద్ధకాండం,[43] మహాభారత (కర్ణశపథం, గోతోపదేశం), త్రిమూర్తులు,[44] [45] పంచక్రియ, పాంచాలి శపథం మొదలైన సంగీత నృత్య రూపకాలను వ్రాసి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాడు.


రచనలు

మార్చు

రవికిరణ్ కర్ణాటక సంగీతంపై అనేక గ్రంథాలను రచించాడు. వాటిలో కొన్ని:

ఇవి కాక ఇతడు వివిధ పత్రికలలో అనేక వ్యాసాలు రచించాడు.[51][52][53][54][28]

పురస్కారాలు

మార్చు

ఇతడు ఎన్నో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందాడు. వీటిలో కొన్ని: అంతర్జాతీయ పురస్కారాలు

 • ది మిలీనియం ఫెస్టివల్ అవార్డ్- 2000[55]
 • ది న్యూ యేజ్ వాయిస్ ఫైనలిస్ట్ అవార్డ్ - 2001[55]

జాతీయ & రాష్ట్రస్థాయి పురస్కారాలు

కళా సంబంధ పురస్కారాలు

 • నాద సుధార్ణవ – 1980[59]
 • కృష్ణ గాన సభ వారిచే సంగీత చూడామణి[60]
 • ఇండియా ఫైన్ ఆర్ట్స్, ఆస్టిన్ వారిచే వాద్యరత్నాకర
 • కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ వారిచే ఇసై పెరోలి
 • పార్థసారథి స్వామి సభ, చెన్నై వారిచే సంగీత కళాసారథి -2013 [61]
 • దయానంద ఆశ్రమం వారిచే జీవన సాఫల్య పురస్కారం.[62]
 • ఫెడరేషన్ ఆఫ్ సభాస్, చెన్నై వారిచే చిత్రవీణ కళాప్రవీణ[63]
 • మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి - 2017[64][65]

వివాదాలు

మార్చు

#మీటూ ఉద్యమంలో భాగంగా తన శిష్యురాళ్ళతో, తోటి కళాకారిణులతో ఇతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి.[66] రవికిరణ్ తనపై వచ్చిన ఆరోపణలను ఇండియా టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోను, తన ఫేస్‌బుక్ అకౌంటులోను ఖండించాడు.[67][68]ఈ ఆరోపణల పర్యవసానంగా మద్రాసు సంగీత అకాడమీ 2018 డిసెంబరులో జరిగిన సంగీతోత్సవాలలో ఆరోపణలు ఎదుర్కొన్న 6గురు కళాకారులతో పాటు ఇతడి సంగీత కచేరీలను కూడా రద్దు చేసింది.[69][70][71] 2018 అక్టోబరులో ఫెడరేషన్ ఆఫ్ సిటీ సభాస్, చెన్నై వారు ఏర్పాటు చేసిన కమిటీ ముందు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎవరూ ఈ కళాకారులపై ఫిర్యాదు చేయక పోవడంతో వీరిపై చేయబడిన ఆరోపణలు వీగిపోయాయి.[72]

మూలాలు

మార్చు
 1. Deccan Herald, Bangalore 10 Dec 1979
 2. Ananda Vikatan Weekly, Madras (Aug 1969)
 3. The Hindu, Bangalore (22 August 1969) "Prodigy in Carnatic Music"
 4. Haviland, Charles (6 August 2003). "Family revive Indian tradition". One-Minute World News. BBC News. Retrieved 10 November 2020.
 5. "The XLIIIrd Madras Music Conference: Official report". The Music Academy Journal. 49 (4): 38. 1970.
 6. "There's no stopping him". Deccan Herald (in ఇంగ్లీష్). 2018-03-31. Retrieved 2018-12-26.
 7. Times of India, Bombay, 4 April 1971 "Ravi – the Raga Reckoner"
 8. Rajagopalan, N. (1992). Another Garland: Biographies of Carnatic Composers and Musicians. p. 253.
 9. Ramanan, Sumana RamananSumana; Nov 23, Mumbai Mirror | Updated; 2016; Ist, 13:48. "An inveterate innovator with a silken voice". Mumbai Mirror. Retrieved 2018-12-26. {{cite web}}: |last3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
 10. Nathan, Archana (2015-02-12). "If the flute sings, it must be Ramani". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-26.
 11. Indian Express 1 Aug, 1982 "Child Genius"
 12. The Hindu 28 July 1985 "A performance to cherish"
 13. Times of India, Bombay, 4 Sept 1987
 14. "Chicago – Chicago : News : Politics : Things To Do : Sports". Chicago Sun-Times. Archived from the original on 26 ఫిబ్రవరి 2015.
 15. "Archived copy". Archived from the original on 26 February 2015. Retrieved 25 February 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 16. "Chitravina Ravikiran & Roland Van Campenhout". www.europalia.eu (in ఇంగ్లీష్). Archived from the original on 26 February 2015. Retrieved 2018-12-26.
 17. "2009-Hungary-Trafo". raga.hu. Archived from the original on 2018-09-12. Retrieved 2018-12-26.
 18. Ramesh, M. (2016-12-22). "Call of the Titans". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-26.
 19. "Livemint Lounge 15 Dec 2017". 15 December 2017.
 20. "Key notes of 'Piano Man'". Deccan Herald (in ఇంగ్లీష్). 2015-12-12. Retrieved 2018-12-26.
 21. Shankar, Uday (2011-12-17). "Challenges of internal diversity in the Carnatic genre". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-26.
 22. Sydney Morning Herald 2 July 1995
 23. Desi Talk, New York 3 March 2000 "Ravikiran to compose for BBC Philharmonic"
 24. Zinn, Joshua (2017-10-03). "Local Ensemble Celebrates 10 Years With Concert Inspired By Indian Classical Music". Houston Public Media (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-12-26.
 25. Middleton Times Tribune, USA 9 Nov 2017
 26. KrithikaRajagopal, Chitravina N Ravikiran with Sacramento Symphony Orchestra, retrieved 2018-12-26
 27. Vanitha Suresh, Chitravina N Ravikiran & Pt Birju Maharaj - "Breathless" Collaboration Part 1, retrieved 2018-12-26
 28. 28.0 28.1 Ravikiran, Chitravina N. (2016-11-24). "A phenomenon beyond parallel". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-26.
 29. Saravanan Balasubramanian, Jugalbandhi by Shri. N. Ravikiran and Shri. U.Shrinivas., retrieved 2018-12-26
 30. "Chitraveena N. Ravikiran at Tattvaloka". 30 December 2008.
 31. Sangeeta Rasika (2013-10-24), Chitravina N Ravikiran's brilliant 72-Mela Ragamalika Geetam, retrieved 2017-04-19
 32. "Now, a raga named after Beethoven". The Hindu. 29 January 2019 – via www.thehindu.com.
 33. 33.0 33.1 Deccan Herald, Creator of Ragas" 7 May 2006
 34. Indian Express 23 Dec, 1979
 35. "New Indian classical raga named after legendary German composer Ludwig Van Beethoven - Trending & Viral News". www.timesnownews.com.
 36. Audio CD Ranganathaya Namaha
 37. "Archived copy". Archived from the original on 27 April 2017. Retrieved 26 April 2017.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 38. The Hindu, 14 Jan 2016
 39. Vijayalakshmi, B. (2016-01-14). "Tamil Nadu: Eminent musician Ravikiran to create world record". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2018-12-26.
 40. The Plain Dealer, Cleveland, 1 April 1997
 41. The Melbourne Age, April 1998
 42. The Hindu Friday Review - 22 Dec, 2000 - Operatic presentation of Vinayaka
 43. "Cleveland Thyagaraja Festival". www.aradhana.org. Retrieved 2018-12-26.
 44. "Reinventing the joy of music". www.thehansindia.com. 11 September 2016. Retrieved 2018-12-26.
 45. Nadadhur, Srivathsan (2016-09-09). "Thought behind the art". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-26.
 46. Ganesh & Co, Madras, India
 47. Garland Encyclopedia of World Music, Indian Subcontinent, P 1010
 48. The International Foundation for Carnatic Music http://ifcm.ravikiranmusic.com
 49. 49.0 49.1 The International Foundation for Carnatic Music
 50. Sarva Shiksha Abhyan, Government of India
 51. The Hindu 18 Dec 2010 "Culture – essential or extra fitting?"
 52. The Hindu 13 Dec 2012 "A tribute to Sitar legend Ravi Shankar"
 53. Deccan Chronicle 4 Dec, 2012 "Gen XT Reality Check
 54. Deccan Chronicle 6 July 2013 "The CID (Content, Intent, Delivery) Mantra"
 55. 55.0 55.1 "Artistesdetails". underscorerecords.com.
 56. Khanna, Shailaja (2018-06-19). "My aim is to take chitravina around globe". The Asian Age. Retrieved 2019-01-25.
 57. "Chitravina N. Ravikiran: The Crown Prince of Carnatic Music". www.pertout.com.
 58. "There's no stopping him". Deccan Herald (in ఇంగ్లీష్). 2018-03-31. Retrieved 2019-01-25.
 59. Ravikiran, Chitravina N. (2016-11-24). "A phenomenon beyond parallel". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-25.
 60. "REVIVAL : Indian Spring Concert by Chitravina Ravikiran". atuva.student.virginia.edu.
 61. The Indian Express, 18 Dec, 2013
 62. "Music". Arsha Vidya Gurukulam (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-12-26.
 63. "Chitravina Ravikiran honoured". The Hindu (in Indian English). Special Correspondent. 2017-07-31. ISSN 0971-751X. Retrieved 2019-01-25.{{cite news}}: CS1 maint: others (link)
 64. Kolappan, B. (2017-07-16). "Sangita Kalanidhi award for Chitraveena maestro Ravikiran". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-26.
 65. Staff Reporter (2018-01-02). "Music helps in bringing peace: Indira Banerjee". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-25.
 66. "'Carnatic musician Ravikiran sexually harassed me': Two former students say 'Me Too'". The News Minute. 2018-10-27. Retrieved 2018-12-01.
 67. "#MeToo: I have been abused and wrongfully accused, says Chitravina Ravikiran - Times of India". The Times of India. Retrieved 2018-12-01.
 68. "Chitravina N Ravikiran issues another detailed denial of #MeToo allegation after Margazhi ouster - Firstpost". www.firstpost.com. Retrieved 2018-12-01.
 69. "'Me Too' allegations: Madras Music Academy drops 7 artistes from Margazhi season". The News Minute. 2018-10-25. Retrieved 2018-12-01.
 70. "#MeToo in Carnatic music: Madras Music Academy's N Murali on addressing sexual harassment allegations against artists - Firstpost". www.firstpost.com. Retrieved 2018-12-01.
 71. Kolappan, B. (2018-10-25). "Music Academy debars seven musicians this season, post #MeToo". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-01.
 72. "#Metoo in Carnatic may not shadow this Margazhi". Deccan Chronicle (in ఇంగ్లీష్). 3 April 2019.

బయటి లింకులు

మార్చు