మృదంగం

భారతీయ తాళ వాయిద్యము

మృదంగము (సంస్కృతం: Sanskrit: मृदंग, ఆంగ్లం: Mridangam: తమిళం: மிருதங்கம், కన్నడ: :ಮೃದಂಗ, మళయాళం: മൃദംഗം) దక్షిణ భారతదేశానికి చెందిన ఒక తాళ వాయిద్యము. శివుని వాహనమైన నంది మృదంగాన్ని వాయిస్తుంది. ఈ వాయిద్యము ఒక గొట్టపు ఆకారములో ఇరు వైపుల వాయించటానికి చదునుగా ఉంటుంది. ఇది హిందూ సంసృతిలో కచ్చేరీలలో ముఖ్యభాగముగా అన్ని కార్యక్రమములందున ఉపయోగించు ప్రధానమైన పరికరము.

మృదంగం

తయారీ విధానము సవరించు

మేలైన చెట్టు కాండమునుండి పొడవైన భాగమును తీసుకొని దానిలో మధ్యభాగమును తొలగించి డొల్లగా మార్చుతారు. ఎండబెట్టిన చర్మము (తోలు) ను గుండ్రటి రింగులాంటి దానికి చుట్టి బిగిస్తారు. ఆచర్మానికి రింగును అనుసరిస్తూ చిన్న చిన్న రంధ్రములను చేస్తారు. చర్మము బిగించిన రింగులతో దొల్లగా చేయబడిన చెట్టు కాండము యొక్క రెండువైపులను మూసివేసి రింగుప్రక్కగా చేయబడిన రంధ్రములనుండి ఒక సన్నటి తాడు వరుసగా ఎక్కించి తరువాత బిగించడం చేస్తారు. వాయిద్యకారుడు తనకు కావలసిన విధంగా చర్మాన్ని వేడి చేసుకొంటూ తాళ్ళను{పట్టు అనే ప్రక్రియ} బిగించుకొంటూ ధ్వని సరియైన శృతిలో వచ్చేలా సరిచేస్తాడు. కొన్ని సార్లు మృదంగం లోపలివైపుగా తోలు మధ్య కాటుక పూయడం మందంగా మారేందుకు చిన్న తోలు ముక్కలను అతికించడం చేస్తారు.

మృదంగ విద్వాంసులలో ప్రముఖులు సవరించు

బయటి లింకులు సవరించు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మృదంగం&oldid=3155731" నుండి వెలికితీశారు