కె.కనకరత్నమ్మ

(కె. కనకరత్నం నుండి దారిమార్పు చెందింది)

కాకమాను కనకరత్నమ్మ[1], ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్రానికి చెందిన మహిళా రాజకీయనాయకురాలు. ఈమె తొలిసారి 1957లో నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రేసు అభ్యర్థిగా పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైంది. ఆ తర్వాత 1962లో హసనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీచేసి, స్వతంత్ర అభ్యర్థి సి.హెచ్.వాసుదేవరెడ్డి చేతిలో ఓడిపోయింది. ఈమె హనుమకొండ నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై కొన్నాళ్ళు శాసనమండలి సభ్యురాలిగా కూడా పనిచేసింది.

వరంగల్ జిల్లా నుండి ప్రముఖ రాజకీయనాయకురాలిగా, 1969 నుండి 1972 వరకు జరిగిన మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నది. ఆ కాలంలో, ఈమె కాంగ్రేసు పార్టీని వీడి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌లో చేరింది. 1970లో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌ అభ్యర్థిగా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైంది.[2]

మూలాలు

మార్చు
  1. Andra Pradesh Legislative Assembly Debates: 24-11-1959. 24 November 1959. p. x. Retrieved 30 July 2024.
  2. Times of India Directory and Yearbook. Times of India. 1970. p. 334. Retrieved 31 July 2024.