కె. మీనాక్షి నాయుడు

కొంక మీనాక్షి నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆదోని నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు.[1]

కె. మీనాక్షి నాయుడు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 1999
1999 - 2004
2009 - 2014
నియోజకవర్గం ఆదోని నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 21 అక్టోబర్ 1951
చిన్నహొత్తూరు, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు ఆంజనేయ, నాగమ్మ
జీవిత భాగస్వామి సులోచనమ్మ
సంతానం భూపాల్ చౌదరి, మురళీధర్ & ఒక కుమార్తె

జననం, విద్యాభాస్యం

మార్చు

కె. మీనాక్షి నాయుడు 21 అక్టోబర్ 1951న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఆస్పరి మండలం, చిన్నహొత్తూరు గ్రామంలో కొంక ఆంజనేయ, నాగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బిఏ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

కె. మీనాక్షి నాయుడు 1975లో ఆదోని మార్కెట్ కమిటీ డైరక్టర్‌గా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1977లో ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుండి పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికై, 1983లో తెలుగుదేశం పార్టీలో చేరాడు.

సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ
2019 ఆదోని వై. సాయి ప్రసాద్‌ రెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి కె. మీనాక్షి నాయుడు తె.దే.పా
2014 ఆదోని వై. సాయి ప్రసాద్‌ రెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి కె. మీనాక్షి నాయుడు తె.దే.పా
2009 ఆదోని కె. మీనాక్షి నాయుడు తె.దే.పా వై. సాయి ప్రసాద్‌ రెడ్డి కాంగ్రెస్
1999 ఆదోని కె. మీనాక్షి నాయుడు తె.దే.పా కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్
1994 ఆదోని కె. మీనాక్షి నాయుడు తె.దే.పా రాయచోటి రామయ్య కాంగ్రెస్
1989 ఆదోని రాయచోటి రామయ్య కాంగ్రెస్ కె. మీనాక్షి నాయుడు తె.దే.పా

మూలాలు

మార్చు
  1. Sakshi (1 April 2019). "ఆదోని పై పట్టెవరిది !". Archived from the original on 20 జనవరి 2022. Retrieved 20 January 2022.