వై. సాయి ప్రసాద్ రెడ్డి

(వై. సాయి ప్రసాద్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆదోని నియోజకవర్గం 2004, 2014, 2019 ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

వై. సాయి ప్రసాద్‌ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2024
ముందు కె. మీనాక్షి నాయుడు
తరువాత పి.వి.పార్థసారథి
నియోజకవర్గం ఆదోని నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 23 మార్చి 1963
రాంపురం గ్రామం, మంత్రాలయం మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి, లలితమ్మ [1]
జీవిత భాగస్వామి శైలజ
బంధువులు వై.శివరామి రెడ్డి (అన్న), వై. బాలనాగిరెడ్డి (తమ్ముడు) , ఎల్లారెడ్డి వెంకట్రామిరెడ్డి (తమ్ముడు) [2]
సంతానం జయమనోజ్‌ కుమార్‌రెడ్డి, గౌతమి
నివాసం ఆదోని

జననం, విద్యాభాస్యం

మార్చు

వై. సాయి ప్రసాద్‌ రెడ్డి 1963 మార్చి 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం, రాంపురం గ్రామంలో ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి (మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ), లలితమ్మ (మంత్రాలయం మండలం రాంపురం గ్రామ సర్పంచ్‌) దంపతులకు జన్మించాడు. ఆయన ఇంటర్‌మీడియట్‌ వరకు చదివాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

వై. సాయి ప్రసాద్‌ రెడ్డి 1989లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కౌతాళం మండల టీడీపీ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2002లో టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. వై. సాయి ప్రసాద్‌ రెడ్డి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదోని నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జి .కృష్ణమ్మా పై 24741 ఓట్ల మోజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

వై. సాయి ప్రసాద్‌ రెడ్డి 2009లో ఓటమి పాలయ్యాడు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసీ తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కె. మీనాక్షి నాయుడు పై 16831 ఓట్ల మోజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు. వై. సాయి ప్రసాద్‌ రెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసీ తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కె. మీనాక్షి నాయుడు పై 12,319 ఓట్ల మోజార్టీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[4]

మూలాలు

మార్చు
  1. Sakshi (6 November 2019). "ఆ తల్లి కడుపున నలుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. V6 Velugu (27 May 2019). "అరుదైన రికార్డ్..ఒకే సారి ముగ్గురు అన్నదమ్ములు అసెంబ్లీకి" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  4. Sakshi (2019). "Adoni Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.