హరికుమార్ కృష్ణమూర్తి (కె. హరి కుమార్) కేరళకు చెందిన నవలా, స్క్రీన్ ప్లే రచయిత. 2013లో ఇతని మొదటి పుస్తకంవెన్ స్ట్రేంజర్స్ మీట్ ప్రచురించబడింది.[1] తరువాత దట్ ఫ్రీక్వెంట్ విజిటర్ (2015), ఎ గేమ్ ఆఫ్ గాడ్స్ (2016), ది అదర్ సైడ్ ఆఫ్ హర్ (2018) వంటివి రాశాడు. ఈ (మలయాళం సినిమా), హిందీ భాషలో సైకలాజికల్ హారర్ వెబ్ సిరీస్ భ్రమ్ (వెబ్ సిరీస్) కు కథ, స్క్రీన్ ప్లే రాశాడు.[2] భారతదేశంలోని అగ్ర హారర్ రచయితలలో ఒకరిగా గుర్తించబడ్డాడు.[3] 2019లో వచ్చిన ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ అనే పుస్తకంలో 50 భయానక చిన్న కథలను వ్రాసాడు.[4]

కె. హరి కుమార్
పుట్టిన తేదీ, స్థలం1989, జనవరి 3
త్రిపుణితుర, కేరళ
వృత్తినవలా, స్క్రీన్ ప్లే రచయిత
రచనా రంగంహారర్, థ్రిల్లర్, డ్రామా, సైకలాజికల్ థ్రిల్లర్
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు2013–ప్రస్తుతం

జననం, విద్య

మార్చు

హరికుమార్ కృష్ణమూర్తి 1989, జనవరి 3న కేరళలోని త్రిపుణితురలో[5] జన్మించాడు. హర్యానాలోని గుర్గావ్‌లో పెరిగాడు. డిఏవి పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్ తీయడం మొదలుపెట్టాడు. 2010లో అనారోగ్యం పాలైన హరికుమార్ సృష్టి పబ్లిషర్స్ ద్వారా 2013లో ప్రచురించబడిన తన మొదటి పుస్తకం[6] వెన్ స్ట్రేంజర్స్ మీట్ రాశాడు. రెండవ పుస్తకం దట్ ఫ్రీక్వెంట్ విజిటర్ 2015లో ప్రచురించబడింది.[7] ది అదర్ సైడ్ ఆఫ్ హర్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ 2018లో ప్రచురించబడింది.[8] కల్కీ కోచ్లిన్, సంజయ్ సూరి, ఈజాజ్ ఖాన్, భూమికా చావ్లా, ఓంకార్ కపూర్, రాజేంద్రనాథ్ జుట్షి, హర్ష్ వశిష్‌లు నటించిన హిందీ భాషా వెబ్-సిరీస్ బ్రహ్మ్‌కు ఇది ప్రేరణ.

సినీనిర్మాత సంగీత్ శివన్ మార్గదర్శకత్వంలో, హరి కుమార్ ఈ అనే మలయాళం సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఈ మలయాళ సినిమాలో నటి గౌతమి రీఎంట్రీ ఇచ్చింది.[9]

పుస్తకాలు

మార్చు
సంవత్సరం శీర్షిక ప్రచురణకర్త ఐ.ఎస్.బి.ఎన్. ఇతర వివరాలు
2013 వెన్ స్ట్రేంజర్స్ మీట్ [10] సృష్టి పబ్లిషర్స్ 978-9380349930 నవల
2015 దట్ ఫ్రీక్వెంట్ విజిటర్ సృష్టి పబ్లిషర్స్ 978-9382665304 నవల
2018 ది అదర్ సైడ్ ఆఫ్ హర్ సృష్టి పబ్లిషర్స్ 978-9387022416 నవల, ప్రేరణ పొందిన వెబ్-సిరీస్ బ్రహ్మ
2019 ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ హార్పర్‌కాలిన్స్ 978-9353573553 భారతదేశంలోని నిజమైన హాంటెడ్ ప్రదేశాల ఆధారంగా యాభై భయానక చిన్న కథల సేకరణ

సినిమాలు

మార్చు

సినిమా

మార్చు
సంవత్సరం సినిమా స్క్రీన్ ప్లే కథ మాటలు నటుడు పాత్ర
2017 [11] Yes Yes కాదు Yes మిస్టర్ మీనన్ గా[12]

టెలివిజన్

మార్చు
సంవత్సరం సినిమా స్క్రీన్ ప్లే కథ మాటలు నటుడు పాత్ర ఛానల్
2019 బ్రహ్మ్[13] Yes Yes Yes Yes జర్నలిస్ట్ జీ5

మూలాలు

మార్చు
  1. "An Extrasensory Tale". Archived from the original on 2016-08-18. Retrieved 2023-07-18.
  2. "Carnival Motion Pictures Worldwide releasing E". www.topmovierankings.com (in ఇంగ్లీష్). Archived from the original on 5 February 2017. Retrieved 2023-07-18.
  3. "Top 7 Indian Horror Authors to be Read | DESIblitz". DESIblitz. 10 July 2017. Retrieved 2023-07-18.
  4. "India's Most Haunted". HarperCollinsPublishers India. Retrieved 2019-09-26.
  5. "Storyteller at heart | Deccan Chronicle". archives.deccanchronicle.com. Archived from the original on 5 October 2016. Retrieved 2023-07-18.
  6. "For the people". The Hindu. 2 August 2013. ISSN 0971-751X. Retrieved 2023-07-18.
  7. "An Extrasensory Tale". Archived from the original on 2016-08-18. Retrieved 2023-07-18.
  8. "Kalki Koechlin To Play A Novelist Suffering From PTSD in ZEE5 Original Web Series Bhram". Zee TV. 17 July 2019. Archived from the original on 2019-07-17. Retrieved 2023-07-18.
  9. "Gautami Tadimalla is returning for E- Sangeeth Sivan,Kukku S". www.topmovierankings.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-11. Retrieved 2023-07-18.
  10. "The Deccan Chronicle". Archived from the original on 5 October 2016.
  11. "Telugu actress Nithya Naresh to debut in M-Town with the film, E – Times of India". The Times of India. Retrieved 2023-07-18.
  12. E: The Movie (2017), retrieved 2023-07-18
  13. Desk, India com Entertainment (17 July 2019). "Kalki to Play a Novelist With Post-Traumatic Stress Disorder in Psychological Thriller Bhram". India.com (in ఇంగ్లీష్). Retrieved 2023-07-18.