అరవింద్ కేజ్రివాల్

(కేజ్రీవాల్ నుండి దారిమార్పు చెందింది)

అరవింద్ కేజ్రివాల్ భారతీయ సామాజికవేత్త, రాజకీయ నాయకుడు. హర్యానాలో జన్మించిన కేజ్రివాల్ ఐఐటి ఖరగపూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు. మొదట భారతీయ రెవెన్యూ సర్వీసులో కొంతకాలం పనిచేశారు. జన లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం, సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటంతో ఇతను దేశవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత సంపాదించారు. సమాచార హక్కు చట్టం తీసుకురావటం, పేదవారి స్తోమత పెంచడానికి చేసిన కృషికి 2006 లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది. 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలైన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల విజయంతో ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా పదవి చేబట్టారు. కేజ్రివాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు.[2]

అరవింద్ కేజ్రివాల్
అరవింద్ కేజ్రివాల్


8వ ఢిల్లీ ముఖ్యమంత్రి
పదవీ కాలం
రెండవ పర్యాయం
పదవీ కాలం
2014 ఫిబ్రవరి 15 – 2024 సెప్టెంబరు 17[1]
ముందు రాష్ట్రపతి పాలన

7వ ఢిల్లీ ముఖ్యమంత్రి
పదవీ కాలం
మొదటి పర్యాయం
పదవీ కాలం
2013 డిసెంబరు 28 – 2014 ఫిబ్రవరి 14
ముందు షీలా దీక్షిత్

పదవీ కాలం
రెండవ పర్యాయం
పదవీ కాలం
2014 ఫిబ్రవరి 14 – ప్రస్తుతం
నియోజకవర్గం న్యూ ఢిల్లీ

పదవీ కాలం
మొదటి పర్యాయం
పదవీ కాలం
2013 డిసెంబరు – 2015 ఫిబ్రవరి
ముందు షీలా దీక్షిత్
నియోజకవర్గం న్యూ ఢిల్లీ

వ్యక్తిగత వివరాలు

జననం (1968-08-16) 1968 ఆగస్టు 16 (వయసు 56)
హిసార్, హర్యానా
జీవిత భాగస్వామి సునీత కేజ్రివాల్
సంతానం 2
నివాసం ఢిల్లీ, భారతదేశం
పూర్వ విద్యార్థి ఐఐటి, ఖరగ్‌పూర్

బాల్యం

మార్చు

అరవింద్ కేజ్రీవాల్ (1968 ఆగస్టు 16) హర్యానాలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. గోబింద్ రామ్ కేజ్రివాల్ ను గీతా దేవికి పుట్టిన ముగ్గురు సంతానంలో ఇతను పెద్ద వాడు. ఐ.ఐ.టీ. ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు.

ఉద్యోగం

మార్చు

ఇంజనీరింగ్ పూర్తవగానే టాటా స్టీల్ కంపెనీలో, 1989లో జేరాడు. 1992లో మానేసాడు. అప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. డిల్లీలోని ఆదాయపు పన్ను కార్యాలయంలో జాయింట్ కమీషనర్ ఉద్యోగంలో చేరారు.

సామాజిక పోరాటాలు

మార్చు

పరివర్తన్

మార్చు

1999 డిసెంబరులో కేజ్రివాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే, పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి ఢిల్లీలోని ప్రజలకు పన్నులు, విద్యుత్తు, ఆహార పంపిణి విషయాల గురించి అవగాహన కలిగించడంలో సహాయం చేశారు. కేజ్రివాల్ "మార్పు చిన్న చిన్న విషయాలతో ప్రారంభం అవుతుంది "అని నమ్మేవాడు. 2008 లో ఈ సంస్థ ఢిల్లీ నకిలీ రేషను కార్డు స్కాంను బట్ట బయలు చేసింది.

సమచార హక్కు చట్టం

మార్చు

సమచార హక్కు చట్టం వినియోగించి ఢిల్లీ లోని ప్రభుత్వ సంస్థలలో అవినీతిని వెలికితీశారు.

జన లోక్‌పాల్ బిల్లు

మార్చు

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి జన లోకపాల్ బిల్లు కోసం పోరాడారు.

రాజకీయ జీవితం

మార్చు

2012 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

మార్చు

2012 నవంబరు 26న ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని ఢిల్లీలో స్థాపించారు. 2013 డిసెంబరు 4 న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పై 25, 864 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.[3]జన్ లోక్‌పాల్ బిల్లు ఢిల్లీ శాసనసభలో ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ 49 రోజుల తన ప్రభుత్వాన్ని రద్దుచేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.[4]

2014 పార్లమెంటు ఎన్నికలు

మార్చు

2014 పార్లమెంటు ఎన్నికలలో వారణాసి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పై అరవింద్ కేజ్రివాల్ పోటిపడ్డాడు.[5].అయితే ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడి చేతిలో 3, 71, 784 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.[6][7]

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

మార్చు

2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుండి నడిపించారు. 70 స్థానాలలో 67 స్థానాలు పొంది అనూహ్య విజయం సాధించడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు. కేజ్రివాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 31, 583 వోట్ల ఆధిక్యంతో గెలిచారు.

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

మార్చు

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో 62స్థానాలు గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ పై 14227 ఓట్ల తేడాతో కేజ్రివాల్ గెలుపొందారు.[8]

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం

మార్చు

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2024 మార్చి 21న అరెస్టు చేసింది.[9][10] దానితో భారతదేశంలో అరెస్టయిన మొట్టమొదటి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయ్యాడు.[11] 2024 మే 10న, ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్‌ను 2024 జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.[12][13] 2024 జూన్ 2న బెయిల్ గడువు ముగిసిన తర్వాత కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోయారు. 2024 సెప్టెంబరు 13న, కొన్ని షరతులతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ, కేసుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోంది.[14] 2024 సెప్టెంబరు 15న, అతను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని భావించి, 2024 సెప్టెంబరు 17న అధికారికంగా పదవిని వదులుకున్నాడు.[15]

రచనలు

మార్చు

2012 లో స్వరాజ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు.

బిరుదులు

మార్చు

బయటి లింకులు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (17 September 2024). "సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా". Archived from the original on 17 September 2024. Retrieved 17 September 2024.
  2. "ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్". Archived from the original on 2013-12-30. Retrieved 2013-12-29.
  3. "Lok Sabha polls next on agenda, says Kejriwal". 8 December 2013 – via www.thehindu.com.
  4. "కేజ్రీ..రాజీనామా | Arvind Kejriwal quits as Delhi CM after Jan Lokpal fiasco | Sakshi".
  5. http://www.sakshi.com/news/national/i-will-defeat-narendra-modi-never-join-bjp-arvind-kejriwal-118549
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-18. Retrieved 2014-05-16.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-18. Retrieved 2014-05-19.
  8. "Delhi Assembly Elections 2020: Congress loses deposit on 63 seats". India Today (in ఇంగ్లీష్). 2020-02-11. Retrieved 2024-07-21.
  9. Anand, Jatin (24 March 2024). "Congress's Kejriwal dilemma deepens as it balances ties with AAP – friends in Delhi, foes in Punjab". The Indian Express. Retrieved 24 March 2024.
  10. "Rahul Gandhi rolls dice on same subject in diverse ways: Smriti Irani on his "double standards" on excise policy scam". The Economic Times. ANI. 23 March 2024. Retrieved 23 March 2024.
  11. "Arvind Kejriwal is first sitting chief minister to be arrested". Hindustan Times. 21 March 2024. Retrieved 23 March 2024.
  12. Dayal, Sakshi (12 May 2024). "India's opposition jubilant as Modi critic Kejriwal gets bail to campaign in elections". The Reuters. Retrieved 12 May 2024.{{cite news}}: CS1 maint: url-status (link)
  13. "Arvind Kejriwal hearing LIVE Updates: All eyes on Supreme Court over Delhi CM's bail plea". Hindustan Times. 10 May 2024. Retrieved 10 May 2024.
  14. Sharda, Kanu (13 September 2024). "Dos and don'ts for Arvind Kejriwal as Supreme Court grants him bail". India Today. Retrieved 13 September 2024.
  15. Bhanj, Jaideep Deo (15 September 2024). "Arvind Kejriwal to resign as Delhi CM, vows to return only with people's support". The Hindu. ISSN 0971-751X. Retrieved 15 September 2024.
  16. "CNN-IBN Indian of the Year". Archived from the original on 14 అక్టోబరు 2011. Retrieved 25 August 2011.
  17. "Indian of the Year: Big winners". New Delhi: IBNLive.in.com. Jun 20, 2007. Archived from the original on 2013-10-17. Retrieved September 24, 2013.
  18. "Distinguished Alumnus of IIT Kharagpur". Retrieved 22 August 2011.
  19. "Association for India's Development". Archived from the original on 25 ఏప్రిల్ 2012. Retrieved 1 November 2011.
  20. "ET Awards: The top 10 of 2010". The Economic Times. 7 October 2010. Retrieved 30 June 2013.
  21. "NDTV Indian of the Year 2011". NDTV. 18 October 2011. Retrieved 30 June 2013.
  22. "సిఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ అఫ్ ది ఇయర్". cnn-ibn. 20 December 2013. Archived from the original on 8 నవంబరు 2014.
  23. "Indian Politician Arvind Kejriwal Wins TIME 100 Readers' Poll". టైమ్స్. April 23, 2014.