కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో ధర్మవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019- ప్రస్తుతం
నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 13 అక్టోబర్ 1980
ధర్మవరం , అనంతపురం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి (మాజీ ఎమ్మెల్యే) , కేతిరెడ్డి కళావతమ్మ
జీవిత భాగస్వామి కేతిరెడ్డి సుప్రియ
సంతానం కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి
నివాసం ఇంటి.నెం : 15/84 , స్టేట్ బ్యాంకు కాలనీ , ధర్మవరం

జననం, విద్యాభాస్యం మార్చు

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 13 అక్టోబర్ 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనంతపురం జిల్లా , ధర్మవరం లో కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి (మాజీ ఎమ్మెల్యే) , కళావతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తమిళనాడులోని భారతీయార్ యూనివర్సిటీ నుండి 2001లో బీటెక్‌ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2006లో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి మరణానంతరం ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ పై 19172 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 23 ఆగస్ట్ 2013న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ చేతిలో 14211 ఓట్ల తేడాతో ఓటమిపాలై, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి టిడిపి అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ పై 15,286 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం మార్చు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం నియోజకవర్గం పరిధిలో ‘గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం’ అనే కార్యక్రమంలో చేపట్టి నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలకు తెలుసుకొని సత్వరమే పరిష్కరిస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం ఎంపిక చేసిన గ్రామాల్లో, వార్డుల్లో సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్, గ్రామ సచివాలయం సిబ్బందితో కలిసి ఆయన పర్యటిస్తున్నాడు. ఆయనే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని రేషన్ కార్డు దగ్గర నుంచి రోడ్డు పనులు, చెత్త తరలింపు వంటి సమస్యలను అక్కడకక్కడే పరిష్కరిస్తున్నాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "Dharmavaram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
  2. Sakshi (16 February 2021). "ఊర్మిళ జీవితంలో 'గుడ్‌ మార్నింగ్‌'". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.