మహేశ్వరి అమ్మ (1948 ఫిబ్రవరి 25 - 2022 ఫిబ్రవరి 22) లెజెండరీ మలయాళ నటీమణి. ఆమె కేపీఏసీ లలిత (ఆంగ్లం: K. P. A. C. Lalitha) అనే పేరుతో సుపరిచితం.

కేపీఏసీ లలిత
2019లో కొల్లంలో జరిగిన కేరళ సంగీత అకాడమీ అవార్డు ఫంక్షన్ లో K. P. A. C. లలిత
జననం
మహేశ్వరి అమ్మ

(1948-02-25)1948 ఫిబ్రవరి 25
మరణం2022 ఫిబ్రవరి 22(2022-02-22) (వయసు 73)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1968–2022
జీవిత భాగస్వామి
పిల్లలుసిద్ధార్థ్ భరతన్​ (కుమారుడు), శ్రీకుట్టి భరతన్​ (కుమార్తె )
పురస్కారాలుజాతీయ చలనచిత్ర అవార్డు (1990, 2000)

1947 జనవరి 25న జన్మించిన మహేశ్వరి అమ్మ సినిమాల్లోకి రాకముందు కేరళలో థియేటర్‌ ఆర్టిస్ట్‌గానూ ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్ (కేపీఏసీ)లో చేరిన తర్వాత తన పేరును లలితగా మార్చుకున్నారు. దీంతో సినిమాల్లోకి వెళ్లిన తర్వాత ఆమె పేరు కేపీఏసీ లలితగా మారింది. సినీ కెరీర్‌లో ఆమె మొత్తం 550కి పై చిత్రాల్లో నటించారు. ఉత్తమ సహాయ నటి విభాగంలో రెండు సార్లు జాతీయ అవార్డులతో పాటు నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకుంది. నటిగా గుర్తింపు సంపాదించుకునే కంటే ముందు ఆమె గాయనిగా కూడా రాణించింది.

2022 ఫిబ్రవరి 22న కేరళలోని త్రిపుణితురలో 74 ఏళ్ల వయసులో ఆమె, అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది.[1]

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "ఇండస్ట్రీలో మరో విషాదం.. లెజండరీ నటి కన్నుమూత". Sakshi. 2022-02-23. Retrieved 2022-02-23.