కేసముద్రం మండలం

తెలంగాణ, మహబూబాబాదు జిల్లా లోని మండలం
(కేసముద్రం మండలం (మహబూబాబాదు జిల్లా) నుండి దారిమార్పు చెందింది)

కేసముద్రం మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం కే.సముద్రం

కేసముద్రం
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కేసముద్రం స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కేసముద్రం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°41′26″N 79°51′44″E / 17.690474°N 79.862251°E / 17.690474; 79.862251
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం కేసముద్రం
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 214 km² (82.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 66,041
 - పురుషులు 32,973
 - స్త్రీలు 33,068
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.12%
 - పురుషులు 58.53%
 - స్త్రీలు 35.48%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 66,041 - పురుషులు 32,973 - స్త్రీలు 33,068.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 214 చ.కి.మీ. కాగా, జనాభా 66,041. జనాభాలో పురుషులు 32,973 కాగా, స్త్రీల సంఖ్య 33,068. మండలంలో 16,650 గృహాలున్నాయి.[3]

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.సవరించు

లోగడ కేసముద్రం వరంగల్ జిల్లాకు చెందిన మండలం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో (1+16) పద్హేడు గ్రామాలుతో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

పేరు వెనుక చరిత్రసవరించు

కేసముద్రం అనే పేరు "కేసరి+ముద్రం" అను పదాల నుండి వచ్చింది. కేసరి అనగా సింహం, ముద్రం అనగ పాద ముద్ర అని అర్ధం.కేశవుని ముద్ర నుంచి కేసముద్రం అనే పదం వచ్చిందనేది మరో వాదన.

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. కోరుకొండపల్లి
  2. ఇంటికన్నె
  3. కాట్రపల్లి
  4. అర్పనపల్లి
  5. ఉప్పరపల్లి
  6. కేసముద్రం
  7. మహమూద్‌పట్నం
  8. ఇనుగుర్తి
  9. కోమటిపల్లి
  10. కాల్వల
  11. ధడనసరి
  12. పెనుగొండ
  13. బెరివాడ
  14. రంగాపురం
  15. తాళ్ళపూసపల్లి
  16. అన్నారం

ఎటువంటి డేటా లేని గ్రామాలుసవరించు

ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఇది రెవెన్యూ గ్రామం, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.

  • నారాయణపూర్ (H/O చిన ముప్పారం)

మూలాలుసవరించు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులుసవరించు