మహబూబాబాదు రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

మహబూబాబాదు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. మహబూబాబాదు జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం మహబూబాబాద్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం, మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

మహబూబాబాదు రెవెన్యూ డివిజను
మహబూబాబాదు రైల్వే స్టేషన్
మహబూబాబాదు రైల్వే స్టేషన్
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామహబూబాబాదు

వివరాలు

మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

మార్చు

మహబూబాబాదు డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం మహబూబాబాదు రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 మహబూబాబాద్ మండలం 20 రెవెన్యూ గ్రామాలు
2 కురవి మండలం 20 రెవెన్యూ గ్రామాలు
3 కేసముద్రం మండలం 17 రెవెన్యూ గ్రామాలు
4 డోర్నకల్ మండలం 13 రెవెన్యూ గ్రామాలు
5 గూడూరు మండలం 27 రెవెన్యూ గ్రామాలు
6 కొత్తగూడ మండలం 47 రెవెన్యూ గ్రామాలు (9 నిర్జన గ్రామాలు)
7 గంగారం మండలం 22 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
8 బయ్యారం మండలం 17 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-06-08.
  3. "RDO'S & MUNICIPAL COMMISSIONERS | District Mahabubabad, Government of Telangana | India". www.mahabubabad.telangana.gov.in. Archived from the original on 2022-01-27. Retrieved 2022-06-15.
  4. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-06-15.