మహేశ్వరి అమ్మ మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కేపీఏసీ లలితగా గుర్తింపు పొందిన నటి. కేరళ రాష్ట్రంలోని అలప్పుజాలోని కేరళ పిపుల్స్ ఆర్ట్స్ క్లబ్‌ (కేపీఏసీ)లో నటిగా లలిత పేరుతో నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించి ‘కుట్టుకుడుంబం’ సినిమా ద్వారా మలయాళ సినీరంగంలోకి అడుగుపెట్టి 550పైగా సినిమాల్లో నటించింది. ఆమె కేరళ సంగీత నాటక అకాడమీకి చైర్​పర్సన్​గా పని చేసింది. లలిత 1999లో 'అమరమ్‌', 2000లో 'శాంతం' సినిమాల్లో నటనకుగాను ఉత్తమ సహాయ నటి విభాగంలో రెండు జాతీయ అవార్డులు, 4 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకుంది.

కే.పీ.ఏ.సీ లలిత
జననం
మహేశ్వరి అమ్మ

(1948-02-25)1948 ఫిబ్రవరి 25
కాయంకుళం, కేరళ, భారతదేశం
మరణం2022 ఫిబ్రవరి 22(2022-02-22) (వయసు 73)
త్రిపుణితుర, ఎర్నాకుళం, కేరళ, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1968–2022
జీవిత భాగస్వామిభరతన్
పిల్లలుశ్రీకుట్టి (కూతురు), సిద్ధార్థ్ భరతన్ (కుమారుడు)
పురస్కారాలుజాతీయ అవార్డులు (1990, 2000)

కుటుంబం మార్చు

కేపీఏసీ లలిత 1978లో దర్శకుడు భరతన్‌ తో వివాహం జరగగా, ఆయన 1998లో చనిపోయాడు. వారికి ఓ కూతురు శ్రీకుట్టి, ఓ కుమారుడు సిద్ధార్థ్ భరతన్ ఉన్నారు. సిద్ధార్థ్ నటుడు, దర్శకుడిగా మలయాళ సినీ రంగంలో గుర్తింపు పొందాడు.

నటించిన పలు సినిమాల జాబితా మార్చు

  • భీష్మపర్వం (2022)
  • హోమ్ (2021)
  • మోహన్ కుమార్ ఫాన్స్ (2021)
  • బ్లాక్ కాఫీ (2021)
  • వరనే ఆవశ్యమును (2020)
  • ఉల్టా లక్ష్మియమ్మ (2019)
  • ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా (2019)
  • కల్కి (2019)
  • శుభరాత్రి (2019)
  • విజయ్ సుపేరుమ్ పౌర్ణమియుమ్ (2019)
  • మికహేల్ (2019)
  • స్థానం (2018)
  • నాన్ ప్రకాషన్ (2018)
  • నాన్సెన్స్ (2018)
  • తీట్ట రాపై (2018)
  • అరవిందంటే అతిధికల్ (2018)
  • అంకుల్ (2018)
  • మోహన్ లాల్ (2018)
  • ఆమి (2018)
  • ఓరు కేపీఏసీ కాలమ్ (2017)
  • ఎలియమ్మచియుడే ఆధ్యతే క్రిస్మస్ (2017)
  • హదీయ (2017)
  • ఆడమ్ జోన్ (2017)
  • క్లయింట్ ఓనమ్మ (2017)
  • వర్ణ్యతిల్ ఆశాంక (2017)
  • సండే హాలిడే (2017)
  • దేవయాణం (2017)
  • కాట్రు వెళియిదై (తమిళ సినిమా) (2017)
  • ఫుక్రి (2017)
  • బెస్ట్ యాక్టర్ (2010)
  • ఎల్సామ్మ ఎన్నా ఆంకుట్టి (2010)
  • ప్లస్ టు (2010)
  • పెంపట్టణం (2010)
  • కాదా తుదరున్ను (2010)
  • పాపపై అప్పచ్చ (2010)
  • ప్రమని (2010)
  • ద్రోణ 2010 (2010)
  • ఏప్రిల్ ఫూల్ (2010)
  • పుణ్యం అహం (2010)
  • ఓరు స్మాల్ ఫామిలీ (2010)
  • ఎలెక్ట్రా (2010)
  • కాందహార్ (2010)
  • సఖి (2000)
  • మతిలకల్ (1990)
  • పారంకైమాల (1981)
  • తాకార(1980)
  • సింహాసనం (1979)
  • శ్రీదేవి (1977)
  • చీనావాలా
  • ఉదయం (1973)
  • భద్రాదీపం (1973)
  • వీందుం ప్రభాతం (1973)
  • ధర్మయుద్ధం (1973)
  • పద్మవ్యూహం (1973)
  • పనితీరాథ వీడు (1973)
  • తీర్థయాత్ర (1972)
  • ఆభిజాత్యం (1971)
  • ఒతేనేంటే మకన్ (1970)
  • నింగలెన్నే కమ్యూనిస్టక్కి (1970)
  • కుట్టుకుడుంబం (1969)

అవార్డులు మార్చు

జాతీయ అవార్డులు మార్చు

  • ఉత్తమ సహాయ నటి – అమరం (1990)[1]
  • ఉత్తమ సహాయ నటి – శాంతమ్ (2000)

కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు మార్చు

  • రెండవ ఉత్తమ నటి – నీల పొన్మాన్, ఒన్నమ్ లెల్లె (1975)
  • రెండవ ఉత్తమ నటి – ఆరవం (1978)
  • రెండవ ఉత్తమ నటి – అమరం (1990)
  • రెండవ ఉత్తమ నటి – కడింజూల్ కళ్యాణం, గాడ్ ఫాదర్, సందేశం (1991)

ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ మార్చు

  • ఉత్తమ సహాయ నటి – శాంతమ్ (2000)
  • ఉత్తమ సహాయ నటి – తనియే, నస్రాణి, ఆకాశం (2007)
  • ఉత్తమ సహాయ నటి – స్నేహవీడు (2011)

ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మార్చు

  • ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2009)

ఇతర అవార్డులు మార్చు

  • ప్రేమ్‌జీ అవార్డు  (2007)[2]
  • తొప్పిల్ భాసి ప్రతిభా అవార్డు (2009)
  • ఉత్తమ అత్యుత్తమ ప్రదర్శనలకు వార్షిక మలయాళం మూవీ అవార్డు (దుబాయ్) (2009)[3]
  • భరత్ మురళి అవార్డు (2010)[4]
  • బహదూర్ అవార్డు (2011)[5]
  • కంబిస్సేరి కరుణాకరన్ అవార్డు (2011)[6]
  • తొప్పిల్ భాసి ప్రతిభా అవార్డు (2012)
  • ఎం.టి చంద్రసేనన్ అవార్డు (2013)
  • ఆత్మకథ "కథ తుదరం" (రచయిత)కి సాహిత్యానికి చెరుకాడ్ అవార్డు (2013)
  • కేరళ సంగీత నాటక అకాడమీ ద్వారా కళారత్న ఫెలోషిప్ (2014)
  • సంగం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2014)
  • వనితాలోకం అవార్డు (2014)
  • పార్ట్-ఓనో ఫిల్మ్స్- సమాధరణం -'ప్రశస్తిపత్రం' (2015)
  • సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2015)
  • వనిత ఫిల్మ్ అవార్డు – జీవితకాల సాఫల్యం (2015)
  • టిసిఆర్ భరత్ పి.జె ఆంటోని స్మారక అభినయ ప్రతిభా అవార్డు (2015)
  • ఐఫా అవార్డులు ఐఫా ఉత్సవం - సహాయక పాత్రలో ప్రదర్శన (స్త్రీ) - నామినేట్ చేయబడింది (2015)
  • పరబ్రహ్మ చైతన్య అవార్డు (2016)
  • పికె రోజీ అవార్డు (2016)
  • దేవరాజన్ మాస్టర్ అవార్డు (2016)
  • గుడ్ నైట్ ఫిల్మ్ అండ్ బిజినెస్ అవార్డ్స్ (2017)

మరణం మార్చు

కే.పీ.ఏ.సీ లలిత కాలేయం సంబంధ సమస్యలతో అనారోగ్యం బారిన పడి కేరళలోని త్రిపుణితురలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆరోగ్యం విషమించడంతో 2022 ఫిబ్రవరి 22న మరణించింది.[7][8][9][10][11]

మూలాలు మార్చు

  1. "Directorate of Film Festival" (PDF). Iffi.nic.in. Archived from the original (PDF) on 26 March 2012. Retrieved 18 November 2015.
  2. "KPAC Lalitha won the Premji Award". Mallufilmworld.blogspot.com. Retrieved 18 November 2015.
  3. "Annual Malayalam Movie Awards(AMMA) Announced". Archived from the original on 15 December 2010. Retrieved 11 August 2011.
  4. "KPAC Lalitha gets Bharat Murali Award – Filmibeat". Entertainment.oneindia.in. 9 August 2010. Archived from the original on 23 అక్టోబరు 2012. Retrieved 18 November 2015.
  5. "Latest Malayalam Movies". Archived from the original on 18 July 2011. Retrieved 11 August 2011.
  6. "KPAC Lalitha Bags Kambiserry Karunakaran Award". Moovyshoovy.com. Archived from the original on 16 September 2011. Retrieved 18 November 2015.
  7. Eenadu (24 February 2022). "నటి కేపీఏసీ లలిత కన్నుమూత". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  8. 10TV (23 February 2022). "కేపీఏసీ ల‌లిత : ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత." (in telugu). Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. Andhra Jyothy (23 February 2022). "ప్రముఖ నటి మృతి.. నాటకాల ‌నుంచి 550 పైగా సినిమాల్లో." Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  10. Sakshi (23 February 2022). "ఇండస్ట్రీలో మరో విషాదం.. లెజండరీ నటి కన్నుమూత". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  11. NTV (23 February 2022). "KPAC Lalitha : ఇండస్ట్రీలో మరో విషాదం… సీనియర్ నటి కన్నుమూత". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.