కైరా దత్

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, మోడల్

కైరా దత్ (దేబీ దత్తా) పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, మోడల్. ఎక్కువగా హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ సినిమాలలో నటించింది.[1] 2013 ప్రసిద్ధ కింగ్‌ఫిషర్ క్యాలెండర్ మోడల్‌లలో కైరా ఒకరు.[2]

కైరా దత్
కైరా దత్ (2015)
జననం
దేబీ దత్తా

విద్యాసంస్థసెయింట్ జేవియర్స్ కాలేజ్, ముంబై
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2009 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిసోనమ్ మక్కర్

జననం, విద్య మార్చు

కైరా దత్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో జన్మించింది. లా మార్టినియర్ కలకత్తా నుండి పాఠశాల విద్యను, ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుండి ఉన్నత విద్యను అభ్యసించింది.

కెరీర్ మార్చు

కైరా తొలినాళ్ళో మోడలింగ్ చేస్తూ... కింగ్‌ఫిషర్, మెర్సిడెస్, థమ్స్ అప్, క్లోజ్-అప్, హెచ్‌సిఎల్ ల్యాప్‌టాప్, వైల్డ్ స్టోన్ దేవ్ మొదలైన బ్రాండ్‌లకు సంబంధించిన వ్యాపార ప్రకటనలలో నటించింది.

2009లో వచ్చిన రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో రణబీర్ కపూర్ పక్కన ఒక చిన్నపాత్ర ద్వారా సినిమారంగంలోకి వచ్చింది. 2011లో వచ్చిన మేరే బ్రదర్ కి దుల్హన్ సినిమాలో ఒక ప్రత్యేక పాటలో కనిపించింది. తరువాత 2015లో వచ్చిన క్యాలెండర్ గర్ల్స్ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటించింది.[3]

తెలుగులో రేసు గుర్రం సినిమాలోని "బూచాడే బూచాడే" పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.[4] 2017లో వచ్చిన పైసా వసూల్ సినిమాలో ఏసీపీ కిరణ్మయి పాత్రలో, 2018లో వచ్చిన ఈగో సినిమాలోని ఒక పాటలో నటించింది.

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2009 రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అపర్ణ హిందీ తొలి సినిమా
2010 బాన కథడి తమిళం ప్రత్యేక ప్రదర్శన
2011 ఉదయన్ తమిళం ప్రత్యేక ప్రదర్శన
మంకథ తమిళం ప్రత్యేక ప్రదర్శన
మేరే బ్రదర్ కి దుల్హన్ హిందీ ప్రత్యేక ప్రదర్శన
2012 తాడయ్యరా తాక్క తమిళం ప్రత్యేక ప్రదర్శన
ఎప్పడి మనసుక్కుల్ వంతై తమిళం ప్రత్యేక ప్రదర్శన
2014 రేసుగుర్రం తెలుగు "బూచాడే బూచాడే" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2015 క్యాలెండర్ గర్ల్స్ షారన్ పింటో హిందీ
2016 జుల్ఫికర్ అల్బీనా అహ్మద్ బెంగాలీ
2017 లోన్లీ గ్లర్ హిందీ షార్ట్ ఫిల్మ్
పైసా వసూల్ ఏసీపీ కిరణ్మయి తెలుగు
2018 త్రిఫుల్ ఎక్స్ కైరా / మైరా హిందీ వెబ్ సిరీస్
ఈగో తెలుగు పాటలో ప్రత్యేక పాత్ర

డిస్కోగ్రఫీ మార్చు

సింగిల్స్ మార్చు

క్రమసంఖ్య సింగిల్ లేబుల్ విడుదల తేది
1 పార్టీ యానిమల్స్ టి-సిరీస్ 2016 మే 9[5][6]

మూలాలు మార్చు

  1. ""Imran is hotter than Ranbir : Debi Dutta"". Archived from the original on 26 January 2020. Retrieved 14 March 2017.
  2. "Bhandarkar's 'Calendar Girl' Kyra Dutt was also one of Vijay Mallya's Calendar Girls". Archived from the original on 15 March 2019. Retrieved 12 March 2017.
  3. "Dutt first actress to sign Ekta's nudity clause". Archived from the original on 28 April 2015. Retrieved 3 January 2016.
  4. ""Kyra Dutt | Boochade Boochade Video Song"". Archived from the original on 3 July 2017. Retrieved 14 March 2017.
  5. ""Shake a leg with the 'Party Animals'"". Archived from the original on 26 July 2018. Retrieved 12 May 2016.
  6. "ANIMALS". Archived from the original on 10 May 2016. Retrieved 12 May 2016.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కైరా_దత్&oldid=4068283" నుండి వెలికితీశారు