కొండబోలు బసవ పున్నయ్య
కొండబోలు బసవ పున్నయ్య ప్రముఖ వైద్యులు, విద్యాదాత, అనేక ధార్మిక సంస్థలకు ముఖ్యంగా పుస్తక సంస్థలకు పలు రకాలుగా విరాళాలు ఇస్తూ పోషిస్తున్నారు.
జననం, విద్య
మార్చుకొండబోలు బసవ పున్నయ్య గారు గుంటూరు జిల్లా చుండూరు మండలం వేట పాలెం గ్రామంలో రాజారావు, వరలక్ష్మమ్మ దంపతలకు 1933 మే 6 న జన్మించారు. ప్రాథమిక విద్య చేబ్రోలు, గూడవల్లి లోనూ,, గుంటూరులో చదివారు. గుంటూరు వైద్య కళాశాల నుండి వైద్య విద్యలో పట్టబద్రుడైనాడు. వీరి ధర్మ పత్ని శ్రీమతి వెంకట సుబ్బమ్మ. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె.
పదవులు
మార్చుసామాజిక సేవలో
మార్చు- గుంటూరులో 70 పడకల ఆసుపత్రి నడిపారు, దాని ద్వారా పేదలకు సేవలు చేసారు.
- గుంటూరు అరండల్ పేటలో ఉన్న కమ్మ జన విద్యార్థి వసతి గృహానికి విశేషమైన సేవలు చేసారు.
- గుంటూరు అన్నమయ్య గ్రంథాలయానికి పుస్తకాలా కొరకు లక్ష రూపాయలు విరాళం అందించారు. దీనితో పాటు పలు గ్రంథాలయాలకు విరాళాలు ఇచ్చారు
- హిందూ శ్మశాన వాటికల పునరుద్దరణకు సేవలందిస్తున్నారు.
- భారతీయ మాసపత్రికను ప్రోత్సహిస్తున్నారు.
- వృద్దుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు.
- పేద బాల బాలికల కొరకు వసతి గృహం నిర్వహిస్తున్నారు.
నడిపిస్తున్న సంస్థలు
మార్చు- చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాల
- కొండబోలు లక్ష్మీప్రసాద్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు. జనశిక్షణ సంస్థ
- తుమ్మల కళాపీఠం
- జె.కె.సి.ఆర్.వి.అర్
- మాదల శకుంతల నర్సింగ్ కళాశాల
పురస్కారాలు
మార్చు- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[1][2]
మూలాలు, బయటి లింకులు
మార్చు- కమ్మజన సేవా సమితి -పదేళ్ల ప్రగతి సంచిక నుండి
మూలాలు
మార్చు- ↑ 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
- ↑ "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-17.