కళారత్న పురస్కారాలు - 2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు వివిధ కళలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే కళారత్న (హంస) పురస్కారం. 2017 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 39 మందిని కళారత్న పురస్కారానికి ఎంపికచేసింది.[1][2][3] 2017, మార్చి 29న ఉగాది పండుగ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో పురస్కార గ్రహీతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా రూ.50 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి ప్రభుత్వం సన్మానించింది.[4]

కళారత్న
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పకళ, చిత్రలేఖనం, జానపద , గిరిజన కళలు.
వ్యవస్థాపిత 1999
మొదటి బహూకరణ 1999
క్రితం బహూకరణ 2017
మొత్తం బహూకరణలు 39
బహూకరించేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నగదు బహుమతి ₹ 50,000

పురస్కార గ్రహీతలు

మార్చు
క్రమసంఖ్య పేరు రంగం జిల్లా పేరు
1 గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు విశాఖపట్నం జిల్లా
2 సతీష్‌ రెడ్డి సైన్స్‌ నెల్లూరు జిల్లా
3 పొత్తూరి వెంకటేశ్వరరావు జర్నలిజం గుంటూరు జిల్లా
4 గరికపాటి నరసింహారావు అవధానం తూర్పుగోదావరి జిల్లా
5 సాయికృష్ణ యాచంద్ర అవధానం నెల్లూరు జిల్లా
6 వంగపండు ప్రసాదరావు జానపదం విశాఖపట్నం జిల్లా
7 ఎ.ఎన్‌. జగన్నాథశర్మ సాహిత్యం విజయనగరం జిల్లా
8 వేమూరి వెంకట విశ్వనాథ్‌ సంగీతం కృష్ణా జిల్లా
9 చెరుకూరి వీరయ్య ఇంజనీరింగ్‌ కృష్ణా జిల్లా
10 బల్లెం రోశయ్య ఇంజనీరింగ్‌ కృష్ణా జిల్లా
11 సీహెచ్‌. అనంత శ్రీరామ్‌ పాటల రచయిత పశ్చిమగోదావరి జిల్లా
12 ఉమా చౌదరి హరికథ గుంటూరు జిల్లా
13 మహంకాళి సూర్యనారాయణశాస్త్రీ కూచిపూడి గుంటూరు జిల్లా
14 డాక్టర్‌ శారదా రామకృష్ణ ఆంధ్ర నాట్యం కృష్ణా జిల్లా
15 చిత్తూరు రేవంతి రత్నాస్వామి గానం హైదరాబాద్‌
16 కళిషా అండ్‌ సుభాని నాదస్వరం ప్రకాశం జిల్లా
17 సింగమనేని నారాయణ సాహిత్యం అనంతపురం జిల్లా
18 పి. సత్యవతి సాహిత్యం కృష్ణా జిల్లా
19 కె. సంజీవరావు కవిత్వం యానాం
20 గంగాధరశాస్త్రి సంగీతం కృష్ణా జిల్లా
21 మానేపల్లి రుషికేశవరావు సాహిత్యం కృష్ణా జిల్లా
22 ఎం. శ్రీనివాసరావు చిత్రలేఖనం గుంటూరు జిల్లా
23 ఎస్‌.ఎం. పీరన్‌ శిల్పకళ ప్రకాశం జిల్లా
24 జయన్న చిత్రలేఖనం కడప జిల్లా
25 కడలి సురేష్‌ చిత్రలేఖనం పశ్చిమగోదావరి జిల్లా
26 అక్కల శ్రీరాం శిల్పకళ గుంటూరు జిల్లా
27 నేతి పరమేశ్వరశర్మ తెలుగు నాటకం గుంటూరు జిల్లా
28 పల్లేటి లక్ష్మి కులశేఖర్‌ తెలుగు నాటకం గుంటూరు జిల్లా
29 డాక్టర్‌ ఉమామహేశ్వరి హరికథ మచిలీపట్నం
30 ఎ. మురళీకృష్ణ వ్యాఖ్యాత ప్రకాశం జిల్లా
31 తుమ్మపూడి కోటేశ్వరరావు సాహిత్యం గుంటూరు జిల్లా
32 టి.ఎస్. రావు సామాజిక సేవ‌ కృష్ణా జిల్లా
33 మన్నెం వెంకటరాయుడు సామాజిక సేవ గుంటూరు జిల్లా
34 శివప్రసాద్‌ రెడ్డి హస్తకళలు కర్నూలు జిల్లా
35 మీగడ రామలింగస్వామి తెలుగు నాటకం శ్రీకాకుళం జిల్లా
36 పొట్లూరి హరికృష్ణ తెలుగు అనంతపురం జిల్లా
37 కొండపోలు బసవపున్నయ్య సామాజిక సేవ గుంటూరు జిల్లా
38 రాధాకృష్ణరాజు సామాజిక సేవ‌ ప్రవాసాంధ్ర కర్ణాటక
39 నాయుడు గోపి తెలుగు నాటకం గుంటూరు జిల్లా

మూలాలు

మార్చు
  1. "39 మందికి 'కళారత్న'". m.andhrajyothy.com. 2017-03-29. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.
  2. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  3. "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-17.
  4. "ప్రముఖులకు ఉగాది పురస్కారాలు". Sakshi. 2017-03-29. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.