కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు, 16వ పార్లమెంటు సభ్యులు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.[1] వీరి తాతగారైన కొండా వెంకట రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా పేరు పెట్టారు.

కొండ విశ్వేశ్వర్ రెడ్డి
కొండా విశ్వేశ్వర్ రెడ్డి


పార్లమెంట్ సభ్యులు (లోక్ సభ)
పదవీ కాలము
2014 - Incumbent
ముందు జైపాల్ రెడ్డి
నియోజకవర్గము చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-02-26) 26 ఫిబ్రవరి 1960 (వయస్సు 61)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి సంగీత రెడ్డి
అపోలో హస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ
వెబ్‌సైటు కొండ విశ్వేశ్వర్ రెడ్డి

డెక్కన్ క్రానికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం లోని రాజకీయనాయకులలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధనికుడు (528 కోట్లు).[2]

జననంసవరించు

విశ్వేశ్వర్ రెడ్డి 1960, ఫిబ్రవరి 26న కొండా మాధవరెడ్డి (ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి), జయలత దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్లో జన్మించారు. విశ్వేశ్వర్ రెడ్డి తాత కొండా వెంకట రంగారెడ్డి తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. రంగారెడ్డి పేరుమీదుగా తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టారు.

విద్యాభ్యాసం - ఉద్యోగంసవరించు

న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్.జే, ఎసెక్స్ కౌంటీ కాలేజ్ నెవార్క్ లలో అధ్యాపకులుగా పనిచేశారు.

వివాహంసవరించు

వీరు అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కుమార్తె సంగీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు.[3] వీరికి ముగ్గురు కుమారులు (ఆనందిత్, విశ్వజిత్, విరాజ్).

వృత్తి జీవితంసవరించు

విశ్వేశ్వర్ రెడ్డి సాఫ్ట్వేర్ వ్యవస్థాపకులు. కోట రీసెర్చ్ & సొల్యూషన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపించారు. అనేక ఐ.పి.ఆర్. యొక్క క్రియేషన్స్ లో పాల్గొన్నారు. జనరల్ ఎలక్ట్రిక్ లో చీఫ్ ఎగ్జిక్యైటీవ్ ఆఫీసర్ గా, జి.ఇ ఎం.ఎస్.ఐ.టి, హెచ్.సి.ఐ.టి. ల యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు.

రాజకీయ జీవితంసవరించు

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో 75,000 ఓట్లకు పైగా తేడాతో చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

మూలాలుసవరించు

  1. "Constituencywise-All Candidates". Retrieved 17 May 2014.
  2. "Vishweshwar Reddy is richest in Telangana with Rs 528 cr"
  3. "Sangita Reddy"

ఇవ్వి కూడా చూడండిసవరించు

కె.వి.రంగారెడ్డికొండా మాధవరెడ్డి