కొక్కిలిగడ్డ రక్షణనిధి

కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కొక్కిలిగడ్డ రక్షణనిధి
కొక్కిలిగడ్డ రక్షణనిధి


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం
ముందు దిరిశం ప‌ద్మ‌జ్యో‌తి
నియోజకవర్గం తిరువూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 అక్టోబర్ 1968
వల్లూరుపాలెం, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ప్రసాదు, సూర్యకాంతమ్మ
జీవిత భాగస్వామి మరియమ్మ

జననం, విద్యాభాస్యం మార్చు

కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలం, వల్లూరుపాలెం గ్రామంలో ప్రసాదు, సూర్యకాంతమ్మ దంపతులకు 1 అక్టోబర్ 1968లో జన్మించాడు. ఆయన 6వ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం మార్చు

కొక్కిలిగడ్డ రక్షణనిధి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వల్లూరుపాలెం సర్పంచిగా 2001 నుండి 2006 వరకు పని చేసి, 2006 నుండి 2011 వరకు పమిడిముక్కల జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన వైఎస్సార్‌ మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోతిరువూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో 10,835 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.