వల్లూరు పాలెం, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 163., ఎస్.టి.డి.కోడ్= 08676.

వల్లూరు పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
వల్లూరు పాలెం is located in Andhra Pradesh
వల్లూరు పాలెం
వల్లూరు పాలెం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°22′18″N 80°46′12″E / 16.371569°N 80.769936°E / 16.371569; 80.769936
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ మాదల రంగారావు
పిన్ కోడ్ 521163
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది. ఈ గ్రామం విజయవాడకు 35 కి.మీ. దూరంలో ఉంది. దగ్గరలోని పట్టణం కంకిపాడు.

సమీప గ్రామాలుసవరించు

తెనాలి, విజయవాడ, మంగళగిరి, గుడివాడ

సమీప మండలాలుసవరించు

వుయ్యూరు, కొల్లిపర, కంకిపాడు, పమిడిముక్కల, కంకిపాడు, వల్లూరుపాలెం V

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

ఈ గ్రామానికి రావాలంటే విజయవాడ బందరు రోడ్డులో 209 నం. బస్సు ఎక్కవలెను. రైల్వేస్టేషన్: విజయవాడ 28 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

  1. ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు వ్రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులై, 100% ఫలితాలు సాధించారు. [1]
  2. ఈ పాఠశాలలో ప్రస్తుతం 261 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. [2]
  3. ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న చిరుగురి నవీన్ రాజ్ అను విద్యార్థి రూపొందించిన, "నీటిలో ఘన వ్యర్ధాల నిర్వహణ" అను నమూనా ప్రాజెక్టు, రాష్ట్రస్థాయి వైఙానిక ప్రదర్శనకు ఎంపికైనది. 2015, సెప్టెంబరు-7 నుండి 9వ తేదీ వరకు, విజయవాడలోని డాన్-బాస్కో పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా వైఙానిక ప్రదర్శన (ఇన్స్ పైర్-2015) లో, ఈ నమూనా ప్రాజెక్టు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. [5]
  4. ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన తోటకూర ప్రశాంతి అను విద్యార్థిని, పదవ తరగతి వార్షిక పరీక్షలలో 9.7 జి.పి.ఏ సాధించడమేగాక, మండలంలోనే ప్రథమంగా నిలిచింది. ఈమెకు 2017, జులై-17న నిర్వహించిన రెండవ విడత కౌన్సిలింగ్‌లో ఐ.ఐ.ఐ.టిలో ప్రవేశంం లభించింది. [8]

మండల పరిషత్తు పాఠశాలసవరించు

శ్రీ పి.ఇమ్మానియేలుసవరించు

ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ పి.ఇమ్మానియేలు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. 2015, సెప్టెంబరు-5న గురుపూజోత్సవంనాడు, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించు కార్యక్రమంలో, వీరీ పురస్కారాన్ని అందుకుంటారు. 25 సంవత్సరాలుగా ఉపధ్యాయ వృత్తిలో ఉన్న వీరు, వేసవిలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణా తరగతుకు నిర్వహించడం, పాఠాశాలలో వార్షికోత్సవాలు నిర్వహించడం, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం, దాతల సహకారంతో పాఠశాలలోని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి సేవాకార్యక్రమాలు నిర్వహించినందుకు వీరికి ఈ పురస్కారం లభించింది. [4] విశాఖపట్నంలోని మదర్ థెరెస్సా సోషల్ వెల్ఫేర్ అర్గనైజేషన్, వీరిని "గురుబ్రహ్మ" రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక చేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, 11-అక్టోబరు,2015న అందజేసెదరు. [6]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామంలో రాజకీయాలుసవరించు

2006లో జరిగిన ఎంపిటిసి ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్థి చింతలపూడి గవాస్కర్ రాజు (దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబూరావు కుమారుడు) ఎంపిటిసి ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థి చెన్నుపాటి శ్రీనివాసరావుపై గెలిచారు. (చూడండి:www.apsec.gov.in:8080/apsec/REPORTS/PR2006/MPTC%20RESULTS/Krishna%20VIIIA.xls ).

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ మాదల రంగారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

ఈ గ్రామంలో జరిగే "గొంతేనమ్మ పండుగ" (కుంతీదేవి ఉత్సవాలు) కన్నుల పండుగగా ఉంటుంది. ఈ ఉత్సవం అంబేడ్కర్ నగర్ నుండి మొదలుపెట్టి ఊరు మొత్తం తిరుగుతుంది. గ్రామ దేవత 'పోతురాజు'. ఈ గ్రామంలో క్రైస్తవులు అధికంగా వున్నప్పటికీ హిందువులు కూడా అధిక సంఖ్యలో వున్నారు, ముస్లింలు తక్కువ మొత్తంలో ఉన్నారు. సుమారు 6 చర్చ్ లు (ఆర్ సి యం, సి బి యం, సెవెన్త్ డే అడ్వెంటిష్ట్, బైబిల్ మిషన్ ...),5 హిందూ దేవాలయాలు, ఒక మసీదు ఉన్నాయి. ముఖ్య పండుగలు: క్రిస్మస్, సంక్రాంతి, గొంతేనమ్మ పండుగ, గుడ్ ఫ్రైడే, దసరా.

శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయంసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

ఈ గ్రామ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాధారమైనది. కానీ విద్యావంతులైన వారు ఎక్కువమంది వుండటం వలన రాను రాను ఇది మారుతున్నది.

గ్రామ ప్రముఖులుసవరించు

  • చెన్నుపాటి జగదీశ్ ఆస్ట్రేలియాలో నానో టెక్నాలజీలో చేసిన పరిశోధనలకు, ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆ దేశ అత్యున్నత పురస్కారమైన, ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం ప్రదానం చేసి సత్కరించింది. [7]

గ్రామ విశేషాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు అమరావతి; 2015, మే-22; 38వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, జూలై-14; 38వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-27; 24వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-5; 25వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-11; 23వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-10; 24వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2016, ఫిబ్రవరి-1; 24వపేజీ. [8] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, జూలై-10&18; 1వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Vallurupalem". Archived from the original on 21 ఫిబ్రవరి 2019. Retrieved 18 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)