కొట్టు సత్యనారాయణ

జననం, విద్యాభాస్యం

మార్చు

కొట్టు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో 1955లో జన్మించాడు. ఆయన పెంటపాడు లోని డి. ఆర్. జి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి 1994, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పసల కనకసుందరం రావు పై 24933 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన పీసీసీ సభ్యునిగా, మెంబర్‌ ఆఫ్‌ ఎస్యూరెన్స్‌ కమిటీ ఏపీ లెజిస్లేటివ్, మెంబర్‌ ఆఫ్‌ హౌస్‌ కమిటీ ఇరిగ్యులారిటీస్‌ ఆఫ్‌ మిల్క్‌డైరీస్‌ సభ్యునిగా పని చేశాడు. సత్యనారాయణ 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[1] కొట్టు సత్యనారాయణ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఈలి వెంకట మధుసూధనరావు (ఈలి నాని) పై 16466 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3]

సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ పేరు ఓట్లు మెజారిటీ
1994 తాడేపల్లిగూడెం కనక సుందరరావు తెలుగుదేశం పార్టీ 57994 కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 50061 7933
1999 తాడేపల్లిగూడెం యర్రా నారాయణస్వామి తెలుగుదేశం పార్టీ 60666 కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 50175 . 10491.
2004 తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 72477 పసల కనక సుందరరావు తెలుగుదేశం పార్టీ 47544 24933
2009 తాడేపల్లిగూడెం ఎలి వెంకట మధుసూదనరావు ప్రజారాజ్యం పార్టీ 48747 కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 45727 3020
2014 తాడేపల్లిగూడెం పైడికొండల మాణిక్యాల రావు భారతీయ జనతా పార్టీ 73339 తోట పూర్ణ గోపాల సత్యనారాయణ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 59266 14073
కొట్టు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి 17209
2019 తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 70741 ఎలి వెంకట మధుసూదనరావు తెలుగుదేశం పార్టీ 54275 16466
బోలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ 36197
2024[4] తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ 116443 కొట్టు సత్యనారాయణ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 53951 62492

మూలాలు

మార్చు
  1. Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  2. Sakshi (2019). "తాడేపల్లిగూడెం నియోజకవర్గం విజేత 2019 ఎన్నికలు". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  3. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results". Retrieved 4 June 2024.