కొడంగల్ మండలం
కొడంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] కోడంగల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన తాండూర్ నుండి 18 కి. మీ. దూరంలో కర్ణాటక సరిహద్దులో ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్ రాష్ట్ర రహదారి ఈ పట్టణం నుంచే వెళ్తుంది. హైదరాబాదు నుంచి నైరుతి వైపున 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ఉత్తరాన రంగారెడ్డి జిల్లా సరిహద్దును కల్గిఉంది. తాండూర్ పట్టణం ఇక్కడి నుంచి 17 కిలో మీటర్ల దూరాన ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నారాయణపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
కోడంగల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, కోడంగల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°06′25″N 77°37′37″E / 17.107°N 77.627°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | కోడంగల్ |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 53,673 |
- పురుషులు | 26,545 |
- స్త్రీలు | 27,128 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.15% |
- పురుషులు | 58.77% |
- స్త్రీలు | 33.34% |
పిన్‌కోడ్ | 509338 |
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 249 చ.కి.మీ. కాగా, జనాభా 53,673. జనాభాలో పురుషులు 26,545 కాగా, స్త్రీల సంఖ్య 27,128. మండలంలో 10,981 గృహాలున్నాయి.[3]
భౌగోళికం
మార్చుఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో వాయవ్యం వైపున ఉంది. ఈ మండలానికి ఉత్తరాన రంగారెడ్డి జిల్లా, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రము, తూర్పున బొంరాస్‌పేట మండలం, దక్షిణమున దౌలతాబాదు మండలాలు ఉన్నాయి. కోడంగల్ 17° 6' ఉత్తర అక్షాంశము, 77° 37' తూర్పు రేఖాంశం మీదుగా ఉంది.
గణాంక వివరాలు
మార్చుమండల జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 53542. ఇందులో పురుషుల సంఖ్య 26550, స్త్రీల సంఖ్య 26992. అక్షరాస్యుల సంఖ్య 25669.[4]
మండలంలోని విద్యాసంస్థలు
మార్చుకోడంగల్లో 1969-70లో స్థాపించబడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. 2008-09 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం నూతనంగా డిగ్రీకళాశాలకు అనుమతి ఇచ్చింది. నారాయణ పేట రెవెన్యూ డివిజన్‌లోనే ఇది మొట్టమొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఇదివరకు జూనియర్ కళాశాల పూర్తయిన విద్యార్థులు డిగ్రీ అభ్యసన కొరకు రంగారెడ్డి జిల్లా తాండూరుకు వెళ్ళవలసి ఉండేది.
- మండలంలోని ప్రాథమిక పాఠశాలలు: 46.
- మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలు: 15.
- మండలంలోని ఉన్నత పాఠశాలలు: 11.
పశుసంపద
మార్చు2007 నాటి పశుగణన ప్రకారం మండలంలో 13వేల గొర్రెలు, 11 వేల మేకలు, 2400 పందులు, 1700 కుక్కలు, 25వేల కోళ్ళు, 5700 దున్నపోతులు ఉన్నాయి.
దుద్యాల మండలం కలిసిన హస్నాబాద్ గ్రామం
మార్చుకొడంగల్ మండలం లోని హస్నాబాద్ రెవెన్యూ గ్రామం వికారాబాద్ జిల్లాలో 2022 జూలై 22న కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలంలో విలీనం చేయబడింది.[5]
రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Andhra Pradesh, Published by Director of Census Operations AP, Page No 125
- ↑ telugu, NT News (2022-07-24). "ప్రత్యేక మండలంగా దుద్యాల". www.ntnews.com. Retrieved 2023-08-15.
- ↑ "ఇక నుంచి దుద్యాల మండలం |". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)