కొడంగల్

వికారాబాదు జిల్లా, కొడంగల్ మండలానికి కేంద్రం
(కోడంగల్ నుండి దారిమార్పు చెందింది)

కొడంగల్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, కొడంగల్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది సమీప పట్టణమైన తాండూర్ నుండి 18 కి. మీ. దూరంలో కర్ణాటక సరిహద్దులో ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్ రాష్ట్ర రహదారి ఈ పట్టణం నుంచే వెళ్తుంది. హైదరాబాదు నుంచి నైరుతి వైపున100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ఉత్తరాన రంగారెడ్డి జిల్లా సరిహద్దును కల్గిఉంది. తాండూర్ పట్టణం ఇక్కడి నుంచి 17 కిలో మీటర్ల దూరాన ఉంది.గతంలో ఈ గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో వుండేది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[2]

కోడంగల్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటంలో కోడంగల్ మండల స్థానం
మహబూబ్ నగర్ జిల్లా పటంలో కోడంగల్ మండల స్థానం
కోడంగల్ is located in తెలంగాణ
కోడంగల్
కోడంగల్
తెలంగాణ పటంలో కోడంగల్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°06′25″N 77°37′37″E / 17.107°N 77.627°E / 17.107; 77.627
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం కోడంగల్
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,673
 - పురుషులు 26,545
 - స్త్రీలు 27,128
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.15%
 - పురుషులు 58.77%
 - స్త్రీలు 33.34%
పిన్‌కోడ్ 509338

గణాంకాలుసవరించు

గ్రామ జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3052 ఇళ్లతో, 14294 జనాభాతో 3602 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7051, ఆడవారి సంఖ్య 7243. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1832 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 447. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574905[3].

చరిత్రసవరించు

పూర్వం ఈ ప్రాంతము కర్ణాటక రాష్ట్రములోని గుల్బర్గా జిల్లాలో భాగంగా ఉండేది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణలో భాగమైనాయి. అప్పటినుంచి ఈ ప్రాంతము మహబూబ్ నగర్ జిల్లాలో తాలుకాగా కొనసాగింది. 1986లో మండలాల వ్యవస్థ ప్రకారం ఇది ప్రత్యేకంగా మండలంగా ఏర్పడి కొనసాగుతోంది.

కొడంగల్ నామంసవరించు

కోతులు అధికంగా ఉండుట వలన ఈ పట్టణానికి కొడంగల్ పేరు వచ్చినదని పూర్వికుల అభిప్రాయముంది. ఇక్కడి స్థానికులు కోతులను కొడంగి అని పిలుస్తారు. కొడంగి పేరు మీదుగా కొడంగల్ పేరు వచ్చినట్లు స్థానికులు నమ్ముతారు. కొడంగల్ నామం రావడానికి కచ్చితమైన ఆధారం లేనప్పటికినీ ఒక బలమైన విశ్వాసం మాత్రం ఇక్కడి ప్రజలలో ఉంది. ఈ పీరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. కన్నడ భాషలో నల్ల బండలను కర్రఖల్లు అంటారు. ఇక్కడ నల్ల బండలు బాగా లభిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని కర్రఖల్లు అని పిలిచేవారని అది కాస్త కొడంగల్ గా మారిందని కూడా చెబుతారు,

గ్రామ పంచాయతిసవరించు

కొడంగల్ గ్రామ పాలన గ్రామ పంచాయతి (మేజర్)చే నిర్వహించబడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని 23 మేజర్ గ్రామ పంచాయతీలలో ఇది ఒకటి. 1964లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ఇది మేజర్ గ్రామ పంచాయతిగా ఏర్పడింది. అంతకు పూర్వం ఇది పురపాలకసంఘంగా కొనసాగిననూ తగినంత జనాభా లేనందున గ్రామ పంచాయతీగా ప్రకటించారు. దివంగత నందారం వెంకటయ్య ఈ గ్రామ పంచాయతీకి తొలి సర్పంచుగా పనిచేశాడు. తదనంతరం ఇతడు రెండు సార్లు కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. కోడంగల్ నియోజకవర్గం నుండి 5 సార్లు విజయం సాధించిన గురునాథ్ రెడ్డి కొడంగల్ పురపాలక సంఘం ఉన్న సమయంలో కౌన్సిలర్‌గా పనిచేశాడు.

వ్యవసాయం, నీటిపారుదలసవరించు

మండలంలో అత్యధికంగా పండించే పంటలు కందులు, వరి, జొన్నలు, పెసర్లు. మండలం మొత్తంలో 5 చిన్ననీటిపారుదల వ్యవస్థల కింద 804 హెక్టార్ల భూమి సాగు అవుతుంది. మండలంలో సాధారణ వర్షపాతం 729 మిమీ [4] 2007-08లో అత్యధికంగా 1297 మిమీ వర్షపాతం కురిసింది.

దర్శనీయ స్థలాలుసవరించు

కోడంగల్ పట్టణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది. పట్టణం నడిబొడ్డున కల ఈ దేవాలయంనకు ప్రతి సంవత్సరం జాతర కూడా జర్గుతుంది. మండలంలోనే కాకుండా 15 మండలాలు కల నారాయణపేట డివిజన్‌లోనే ఈ దేవస్థానం పేరుగాంచింది. ఏటా నిర్వహించే జాతర సమయంలో పరిసర ప్రాంతాలనుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా, కర్ణాటకలోని పలు ప్రాంతాలనుంచి ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కొడంగల్ పట్టణంలో నాలుగువందల సంవత్సరాల పూర్వపు మసీదు కూడా ఉంది.[5] ఇది సమీప పట్టణమైన తాండూర్ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల మహబూబ్ నగర్లో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ మహబూబ్ నగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల తాండూర్లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మహబూబ్ నగర్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

కొడంగల్లో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు

గ్రామంలో 10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఏడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యంసవరించు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార సౌకర్యాలుసవరించు

కొడంగల్లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలుసవరించు

 
కోడంగల్ బస్ స్టేషను

కోడంగల్‌కు రైలు సౌకర్యం లేకున్ననూ రోడ్డు సౌకర్యం బాగుగా ఉంది. హైదరాబాదు-బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారి కోడంగల్ గుండా వెళుతుంది. అంతేకాకుండా మహబూబ్ నగర్ - తాండూరు రహదారి కూడా ఈ కూడలి గుండానే వెళుతుంది. కోడంగల్‌కు సమీపంలోని రైల్వేస్టేషను తాండూరు రైల్వేస్టేషను.

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

కొడంగల్లో భూ వినియోగం కింది విధంగా ఉంది.

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 172 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 22 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 131 హెక్టార్లు
 • బంజరు భూమి: 2311 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 956 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 3180 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 87 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

కొడంగల్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 87 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

కొడంగల్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

కంది, వరి, ప్రత్తి

బ్యాంకులుసవరించు

ఇతర వివరాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 248, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019
 2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 4 April 2021. CS1 maint: discouraged parameter (link)
 3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 4. Handbook of Statistics, Mahabubnagar Dist, 2009
 5. The Imperial Gazetteer of India: Karāchi to Kotāyam By Great Britain. Commonwealth Office

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొడంగల్&oldid=3164909" నుండి వెలికితీశారు