కొడుకు పుట్టాల (నాటిక)

తెలుగు నాటిక

కొడుకు పుట్టాల 1970లో గణేష్ పాత్రో రాసిన సాంఘీక నాటిక.[1] పద్నాలుగు భారతీయ భాషల్లోకి అనువాదమై ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారమైన ఈ నాటికతో గణేష్ పాత్రోకు భారతదేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.[2] తెలుగు నాటకరంగంలో ఒక మలుపు తెచ్చిన నాటికగా పేర్కొనబడి, నటుడు ప్రభాకరరెడ్డి నిర్మాతగా, లక్ష్మీదీపక్‌ దర్శకుడిగా, కృష్ణంరాజు హీరోగా నాకూ స్వతంత్రం వచ్చింది పేరుతో సినిమా కూడా రూపొందించబడింది.[3]

కొడుకు పుట్టాల
కృతికర్త: గణేష్ పాత్రో
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటిక
ప్రచురణ: అరుణా పబ్లిషింగ్ హౌజ్, ఏలూరు రోడ్డు, విజయవాడ
విడుదల:
గణేశ్ పాత్రో

కథా నేపథ్యం

మార్చు

కుటుంబ నియంత్రణ ఆవశ్యకత నేపథ్యంలో రాయబడిన నాటిక.

పాత్రలు

మార్చు
  • గంగులు (ఇంటి పెద్ద, జబ్బు మనిషి)
  • కొర్లమ్మ (గంగులు కూతురు)
  • సిమ్మాద్రి (కొర్లమ్మ భర్త)
  • పకీరుగాడు (గంగులు కొడుకు)
  • శరభయ్య తాత (పొరుగువాడు, వృద్ధుడు, ఏకాకి)

ఇతర వివరాలు

మార్చు
  1. ఈ నాటిక ఆంధ్రజ్యోతి నాటిక రచన పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.[4][5]
  2. భీమునిపట్నం సముద్రానికి, పోర్టు బంగళాకు, బెస్తలకు, అస్వస్థులకు ఈ నాటకం అంకితం చేయబడింది.
  3. కుప్పిలి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ఈ నాటిక తొలి ప్రదర్శనతోపాటు అనేక ప్రదర్శనలు జరుపుకుంది. ఇదే నాటక ప్రదర్శన రోజు గుండెపోటుతో మరణించాడు.[6]
  4. జి.ఎస్.ఆర్. మూర్తి, రాజేశ్వరరావు బృందాలు విరివిగా ప్రదర్శించాయి.
  5. ఈ నాటిక ప్రదర్శన చూసిన గుమ్మడి వెంకటేశ్వరరావు గణేష్ పాత్రోను సినిమారంగంకు పరిచయం చేయగా, రాజబాబు పుట్టినరోజు నాటిక ప్రదర్శించినపుడు ప్రభాకర్ రెడ్డి మొదటి అవకాశం ఇచ్చాడు.[7]
  6. విశాఖపట్టణంకి చెందిన బహురూప నటసమాఖ్య సంస్థ నుండి కుప్పిలి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ఎస్.కె. మిశ్రో/కుప్పిలి వెంకటేశ్వరరావు (గంగులు), పి. కృష్ణచైతన్య/కె.విఎస్.డి. ప్రసాద్ (పకీరు), వి.ఎస్.ఎన్. మూర్తి/జి. జగన్నాధరావు (సిమ్మాద్రి), కుప్పిలి వెంకటేశ్వరరావు/గణేష్ పాత్రో (శరభయ్య), కె. విజయలక్ష్మి (కొర్లమ్మ) నటీనటులుగా ఈ నాటిక ప్రదర్శనలు ఇచ్చారు.

మాలాలు

మార్చు
  1. సాక్షి, ఫీచర్స్ (6 January 2015). "మాటల వంతెనపై నడచి వెళ్లినవాడు". రామతీర్థ. Archived from the original on 16 December 2015. Retrieved 28 February 2020.
  2. ప్రజాశక్తి, మూవీ (21 June 2015). "మాటల సవ్యసాచి". www.prajasakti.com. Archived from the original on 25 June 2015. Retrieved 28 February 2020.
  3. తెలుగు వెలుగు, వెండితెర వెన్నెల. "భాషలేనిది... బంధమున్నది". www.teluguvelugu.in. ఓలేటి శ్రీనివాసభాను. Archived from the original on 28 February 2020. Retrieved 28 February 2020.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (6 January 2015). "'పాత్రో'చిత సంభాషణల స్రష్ట!". www.andhrajyothy.com. ఎస్‌.కె. మిశ్రో. Archived from the original on 28 February 2020. Retrieved 28 February 2020.
  5. కొడుకు పుట్టాల (నాటిక), గణేష్ పాత్రో, అరుణా పబ్లిషింగ్ హౌజ్ విజయవాడ, పుట. 6
  6. కొడుకు పుట్టాల (నాటిక), గణేష్ పాత్రో, అరుణా పబ్లిషింగ్ హౌజ్ విజయవాడ, పుట. 7
  7. కొడుకు పుట్టాల (నాటిక), గణేష్ పాత్రో, అరుణా పబ్లిషింగ్ హౌజ్ విజయవాడ, పుట. 10