కొడైకెనాల్ చరిత్ర

కొడైకెనాల్,  తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం.[1] కొడైకెనాల్ ప్రాంతంలో పూర్వం పళనీ గిరిజన ప్రజలు ఉండేవారు. పళని కొండలు గురించీ, ఈ ప్రాంతం గురించీ క్రీస్తు పూర్వం రాసిన ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో ప్రస్తావన ఉంది.[2]

కొడైకెనాల్ బజార్ రోడ్డు, (అన్నా సలై), 1910

భారతదేశంలో వేడి తట్టుకోలేని ఇతర దేశస్థులు ఈ ప్రాంతానికి వచ్చి ఉoడటానికి ఇష్టపడేవారు.[3] 1845లో అమెరికా మిషనరీలు కొడైకెనాల్ ను హిల్ స్టేషన్ గా అభివృద్ధి చేశారు.

20వ శతాబ్దంలో ఈ ప్రాంతం అందాలు నచ్చిన కొంతమంది ధనవంతులైన భారతీయులు కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. కొడైకెనాల్ ను "హిల్ స్టేషన్లలో యువరాణి" అని పిలిచేవారు. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ అంతా పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. ఇక్కడికి దేశ, విదేశాల నుంచీ పర్యాటకులు వస్తూంటారు.[4]

శబ్ద విశిష్టత మార్చు

తమిళ పదం కొడైకెనాల్ కి కొండపైన ఉన్న అడవి అని అర్ధం. పళని కొండల్లో 7,000 అడుగుల ఎత్తున దక్షిణ భాగాన ఉంది ఈ ప్రదేశం.[5]

ఈ పదాన్ని మొదట ఎవరు వాడారో సరైన ఆధారాలు లేవు. కానీ తమిళ భాషలో దాదాపు 5 అర్ధాలు ఉన్నాయి. రెండు తమిళ పదాలు కొడై, కనాల్ అనే రెండు పదాల నుంచీ వచ్చింది ఈ పదం. కెనాల్ అనే పదానికి కొండ ప్రాంతంలో ఉండే చెక్క అనీ, పెద్ద అడవి అనీ అర్ధాలున్నాయి.[5]

కొడి పదానికి వల్లి అని అర్ధం ఉంది.[5] కొండ ప్రాంతపు గిరిజన తెగకు రాజు కుమార్తె వల్లి. రాజ దంపతులు కొండ దేవతను కోరుకోగా, అప్పుడే పుట్టిన ఆడపిల్ల కనిపించింది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తిల కుమార్తె అయిన ఆమె వీరికి ఆ అడవిలో దొరికింది. దైవ ప్రసాదంగా భావించి, ఆమెను పెంచుకోవడం ప్రారంభించారు వారు. తీగలలో దొరికింది కాబట్టీ వల్లీ అని పేరు పెట్టారు ఆమెకు. కురింజి తెగకు రాకుమార్తెగా పెరిగింది వల్లీదేవి. ఆమెను కుమారస్వామి ప్రేమించి, అన్నగారు వినాయకుని సహాయంతో వివాహం చేసుకున్నారు. వీరి ప్రణయ కథను సంగం సాహిత్యంలో వివరించారు. అందులోనే కొడైకెనాల్ ప్రస్తావన ఉంది. ఈ ఆధారాలను బట్టీ కొడైకెనాల్ అంటే వల్లీదేవి యొక్క అడవి ఉన్న ప్రాంతం అని అర్ధం వస్తుంది.

ప్రస్తుతం పర్యాటకులు దీనిని ముద్దుగా "స్విట్జర్ ల్యాండ్ ఆఫ్ ది ఈస్ట్", "దక్షిణ ఎమరల్డ్స్ సెట్", "కొండలలోని చల్లని స్వర్గం", "వేసవి స్వర్గం" అనీ పిలిస్తారు.[6]

ప్రాచీన కాలం మార్చు

 
రాజా రవి వర్మ గీసిన మురుగన్  చిత్రం

క్రీస్తు పూర్వమే ఈ ప్రాంతంలో ప్రజలు నివసించేవారు అని చారిత్రక ఆధారాలున్నాయి. చేరా సామ్రాజ్య సమయానికి చెందిన గుట్టలు, కుండలు దొరకడంతో కొడైకెనాల్ లో ప్రాచీన కాలం నుంచీ పళనీ గిరిజన ప్రజలు నివసించేవారని నిర్ధారణ అయింది. షెంబగనుర్ మ్యూజియంలో ఈ గిరిజన ప్రజల వస్తువులు ఇప్పటికీ భద్రపరచి ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. city definition: Town#India
  2. Mitchell Nora, Indian Hill Station: Kodaikanal, University of Chicago, Dept. of Geography, Kodaikanal Sangam, p97, 1972 Original from the University of California Digitized Jan 28, 2008
  3. Mitchell Nora, Indian Hill Station: Kodaikanal, University of Chicago, Dept. of Geography, ch 2, Rational for Tropical Hill Stations, pp13-15, 1972.
  4. Tamil Nadu Tourism Development Corporation and Department of Tourism, Kodaikanal Princess of Hill Stations[permanent dead link]
  5. 5.0 5.1 5.2 Fabricius, Johann Philipp.
  6. Kodaikanal Department Of Municipal Administration And Water Supply, The meanings of the name Kodaikanal Archived 2010-03-16 at the Wayback Machine, 2005