కొత్తకొండ విఠలేశ్వరాలయం

తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలంలోని కొత్

కొత్తకొండ విఠలేశ్వరాలయం (బర్రె గుడి), తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ[1] గ్రామంలో ఉన్న పురాతన దేవాలయం. పశుసంపదను కాపాడే దేవుడిగా విఠలేశ్వరస్వామి ఇక్కడ కొలువైవున్నాడు.

కొత్తకొండ విఠలేశ్వరాలయం
కొత్తకొండ విఠలేశ్వరాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హన్మకొండ
ప్రదేశం:కొత్తకొండ
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:విఠలేశ్వరస్వామి
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

చరిత్ర

మార్చు

ఇక్కడి దేవుడు గోవులను సంరక్షించే దేవుడిగా ప్రజలు భావిస్తారు. పూర్వకాలంలో చుట్టూ అడవి, గుట్టల మధ్యఉన్న ఈ దేవాలయ సమీపంలోనే స్థానిక యాదవులు ఆవులు, బర్రెలు, గొర్రెలు మేపుకునేవారు. అందుకోసమే ఈ దేవాలయానికి ‘బర్రె గుడి’ అని పేరు వచ్చింది.

అయితే, ఇక్కడి విఠోబా సాంప్రదాయం, ప్రధాన ఆలయ పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక వాదనలు ఉన్నాయి. 13వ శతాబ్దానికి ముందే విఠలేశ్వరస్వామి గ్రామ దేవుడిగా పూజలందుకున్నాడని చరిత్రకారులు చెబుతున్నారు. రిచర్డ్‌ మాక్స్‌వెల్‌ ఈటన్‌ రాసిన ‘ఎ సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ దక్కన్‌’ అనే పుస్తకం ఆధారంగా ఆరవ శతాబ్దానికే విఠోబాను గ్రామదైవంగా ఆరాధించారని తెలుస్తోంది.[2]

నిర్మాణం

మార్చు

కాకతీయుల కాలంలో 13వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయం. దేవాలయ ప్రధాన ద్వారానికి రెండువైపులా హనుమంతుడు, గరుత్మంతుడి విగ్రహాలు ఉన్నాయి. దేవాలయంలోని శివుడి పానపట్టంపై మూల విరాట్టు, ఆ కింది భాగంలో రకుమాయి (రుక్మిణీదేవి) కొలువైవున్నారు. ఈ దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీదేవి దేవాలయం కూడ ఉందికానీ, అక్కడ అమ్మవారి విగ్రహం లేదు. ప్రధాన దేవాలయంలోని విఠలేశ్వరుడి విగ్రహ నడుంకు కట్టిన గుడ్డ, సన్నని పట్టీ, నడుం చుట్టూ మేఖల ఉంది. అయితే విగ్రహం నాలుగు చేతులలో, రెండు చేతులు ధ్వంసమయ్యాయి.

ఇతర వివరాలు

మార్చు

శిథిలావస్థకు చేరుకున్న ఈ దేవాలయాన్ని పరిరక్షించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్ణయించడంతో సర్పంచ్‌తోపాటు పాలకవర్గ సభ్యులు ఆలయ సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్ది, చుట్టూ కంచెను నిర్మించి, పూల మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటుచేయడంతోపాటు దేవాలయానికి మరమ్మతులు చేపట్టారు.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ ఆదివారం సంచిక (17 April 2021). "'బర్రె గుడి'..విఠలేశ్వరాలయం". Namasthe Telangana. Archived from the original on 2021-04-18. Retrieved 16 November 2021.

వెలుపలి లంకెలు

మార్చు