కొత్తగూడ మండలం
కొత్తగూడ మండలం. తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈమండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నర్సంఫేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 47 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 9 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం కొత్తగూడ.
కొత్తగూడ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కొత్తగూడ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°54′48″N 80°03′17″E / 17.913409°N 80.054626°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబాబాదు జిల్లా |
మండల కేంద్రం | కొత్తగూడ (మహబూబాబాద్ జిల్లా) |
గ్రామాలు | 38 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 542 km² (209.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 39,576 |
- పురుషులు | 19,721 |
- స్త్రీలు | 19,855 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.74% |
- పురుషులు | 64.85% |
- స్త్రీలు | 40.70% |
పిన్కోడ్ | {{{pincode}}} |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 39,576 - పురుషులు 19,721 - స్త్రీలు 19,855.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 542 చ.కి.మీ. కాగా, జనాభా 28,796. జనాభాలో పురుషులు 14,434 కాగా, స్త్రీల సంఖ్య 14,362. మండలంలో 7,521 గృహాలున్నాయి.[3]
వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.
మార్చులోగడ కొత్తగూడ మండలం, వరంగల్ జిల్లా, నర్సంపేట రెవెన్యూ డివిజనుకు చెందిన మండలం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో (1+46) నలబైఏడు గ్రామాలుతో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- తిమ్మాపూర్
- కోనాపూర్
- అంకన్నగూడెం
- రంగప్పగూడెం
- ఎదుళ్ళపల్లి
- ఎర్రవరం
- జంగవానిగూడ
- కుందనపల్లి
- ఊటాయి
- సాదిరెడ్డిపల్లి
- ఎంచగూడ
- ముర్రాయిగూడెం
- గుండం
- మొకళ్ళపల్లి
- పొగళ్ళపల్లి
- నీలంపల్లి
- గోవిందాపూర్
- మైలారం
- కొత్తపల్లి
- కొత్తగూడ
- పెగడపల్లి
- గుండ్రపల్లి
- దుర్గారం
- కార్నెగండి
- దొరవారివేంపల్లి
- బోటవానిగూడ
- ముస్మి
- వెల్బెల్లి
- రౌతుగూడెం
- పోలారం
- బక్కచింతలపాడు
- కిష్టాపూర్
- గోపాల్పూర్
- గుంజేడు
- తాటివారివెంపల్లి
- ఏశ్వరగూడెం
- బాతులపల్లి
- కర్లాయి
గమనిక:నిర్జన గ్రామాలు తొమ్మది పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.