కొత్తూరు (మాచర్ల)
కొత్తూరు, పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కొత్తూరు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | మాచర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి బోయ వెంకటరావమ్మ |
పిన్ కోడ్ | 522 426 |
ఎస్.టి.డి కోడ్ | 08642 |
గ్రామములో మౌలిక వసతులు
మార్చుఅంగనవాడీ కేంద్రం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చు- మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
ముంబాయి నగరానికి చెందిన తదేకం ఫౌండేషను వారు,2 నెలల క్రితం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ రెండు పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాల రూపకల్పనకు శ్రీకారం చుట్టినారు. వీరు రు. 60,000 విలువచేసే 20 బల్లలను అందజేసినారు. ఈ రెండు పాఠశాలలోనూ ఇద్దరు ఆంగ్ల ఉపాధ్యాయులను నియమించి, రక్షిత మంచినీటి పథకం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ
మార్చు2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బోయ వెంకటరావమ్మ, సర్పంచిగా ఎన్నికైంది
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయటానికై, ఈ గ్రామాన్ని తదేకం ఫౌండేషన్ దత్తత తీసుకొని పనులను ప్రారంభించారు. ముంబాయికి చెందిన తదేకం ఫౌండేషన్ వ్యవస్థాపకులు, శ్రీ మహా అవతార్ బాబాజీ నౌషర్ ఇంజనీర్, ఈ గ్రామాన్ని మ్యాప్ ద్వారా ఎంచుకున్నారు.