కొత్త భావయ్య
కొత్త భావయ్య చౌదరి (1897 - 1973) : రచయిత,చారిత్రక పరిశోధకుడు. కమ్మవారి చరిత్ర గ్రంథ కర్త. విద్యాదాత.
కొత్త భావయ్య చౌదరి | |
---|---|
జననం | జూన్ 2, 1897 గుంటూరు మండలం, సంగం జాగర్లమూడి |
మరణం | 1973 |
ప్రసిద్ధి | చారిత్రక పరిశోధకుడు |
Notes కమ్మవారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము వ్రాశాడు |
జననం,విద్య
మార్చుతీరాంధ్ర దేశము, గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి లో శివలింగయ్య రాజమ్మ దంపతులకు జూన్ 2, 1897లో జన్మించాడు. విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో కృతార్ధులై శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుండి యోగ్యతా పత్రము పొందాడు. స్వయం కృషితో పరిశోధనా పటిమను, పాండిత్యాన్ని సంపాదించాడు. ఒక రోడ్డు ప్రమాదంలో దెబ్బతిని చేస్తున్న సర్వేయరు ఉద్యోగం మానుకొని చరిత్ర పరిశోధన చేపట్టారు.
స్వగ్రామమైన సంగం జాగర్లమూడి సర్పంచ్ గా గ్రామాభ్యుదయానికి పాటు పడ్డాడు. పలు పాఠశాలలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు.
చారిత్రిక పరిశోధన
మార్చువీరి పరిశోధనా రచనలలో ముఖ్యమైనది కమ్మవారి చరిత్ర. ఆంధ్ర, కర్ణాటక, తమిళ దేశములందు దొరికిన అనేక శాసనములు, సంస్కృతాంధ్ర కావ్యములు, తాళపత్ర గ్రంథములు, కైఫీయతులు మున్నగు పలు మూలాలు పరిశోధించి, ఎన్నో వ్యయప్రయాసలను లెక్కించక నిరంతర దీక్షతో 12 సంవత్సరములు కృషి చేసి కమ్మవారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము (1939-1942)లో వ్రాసాడు[1]. 1954లో మూడు సంపుటములలోని సమాచారము క్లుప్తముగా ఆంగ్లములోనికి అనువదించబడింది.[2].
మద్రాసులో మకాముపెట్టి అచటి ప్రాచ్య లిఖిత పుస్తకాలయము, విశ్వవిద్యాలయము, శాసన పరిశోధన కార్యాలయములలో విషయ సేకరణ చేశాడు. సంస్థానాధీశులను, జమీందారులను, పండితులను సంప్రదించి, ఎన్నో ఉపేక్షలను లెక్కించక తలచిన కార్యము సాధించాడు.
రచనలు
మార్చుభావయ్య విరచితమైన 30 పైగా రాసిన పుస్తకములలో కొన్ని:
మరణం
మార్చుకవి పండితులు, చారిత్రిక పరిశోధకులు కొత్త భావయ్య చౌదరి గారు 23.7.1973 న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ కమ్మవారి చరిత్రము, కొత్త భావయ్య చౌదరి, 1939
- ↑ A Brief History of the Kammas, Kotta Bhavaiah Choudary, Published by K. Bhavaiah Choudary, 1954, Sangam Jagarlamudi, Andhra Pradesh
- ↑ ఆర్కీవు.కాంలో ఆంధ్ర రాజులు పుస్తక ప్రతి.