కొన్‌స్కొవొలా
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
కొన్‌స్కొవొలా (Końskowola) పోలాండ్ ఆగ్నేయ భాగాన ఉన్న ఒక గ్రామం. ఇది కురో వద్ద పులావి, లుబ్లిన్‌ల మధ్య కురౌకా నది ఒడ్డున ఉంది. 2004 గణన ప్రకారం ఈ గ్రామపు జనాభా 2188.
ఈ గ్రామం 14 వ శతాబ్దములో స్థాపించబడింది. అప్పుడు దీని నామం విటౌస్కా వోలా. తర్వాత కొనిన్‌స్కావోలాగా మార్పు చెంది ప్రస్తుత నామం కొన్‌స్కావోలా 19 వ శతాబ్దంలో స్థిరపడింది. 1795లో పోలాండ్ మూడవ విభజన అనంతరం దీన్ని ఆస్ట్రియా ఆక్రమించింది. 1809లో ఇది డచ్ వార్సాలో భాగమైంది. 1815లో ఇది పోలాండ్‌లో భాగమైంది. 1870లో సంభవించిన జనవరి ఉద్యమం వల్ల అధికార పత్రాలన్నీ నాశనమయ్యాయి. 1905లో జరిగిన రష్యా విప్లవం సమయంలో ఉద్యమాలు, సమ్మెలు జర్గాయి. 1918నుంచి మళ్ళీ ఇది పోలాండ్ లో భాగమైంది. రెండో ప్రపంచ యుద్ధంలో 1939, సెప్టెంబర్ 15న జర్మనీ సేనలు ఈ గ్రామాన్ని ఆక్రమించాయి. 1944లో జర్మన్లు ఈ గ్రామాన్ని కాల్చివేయాలని కూడా ప్రయత్నించారు.