కొబ్బరి

(కొబ్బరికాయ నుండి దారిమార్పు చెందింది)

కొబ్బరి ఒక ముఖ్యమైన పాము కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera) . కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు.[1][2]

కొబ్బరి
Cocos nucifera - Köhler–s Medizinal-Pflanzen-187.jpg
Coconut Palm (Cocos nucifera)
Secure
Scientific classification
Kingdom
Division
Class
Order
Family
Genus
కోకాస్
Species
కో. న్యూసిఫెరా
Binomial name
కోకాస్ న్యూసిఫెరా
విశాఖపట్నం లో కొబ్బరి చెట్లు
కొబ్బరికాయ

వివరాలుసవరించు

కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ, ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాలపాటు జీవించి వుంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెలనెలా చిగురిస్తూ, పూతపూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం - స్వర్గానికి చెందిన చెట్టు అంటారు. ఇది మనకు కావలసిన ఆహారాన్నీ, పానీయాన్నీ, తలదాచుకునే చోటునీ, జీవితానికి కావలసిన ఇతర నిత్యావసర వస్తువులనూ ప్రసాదిస్తుంది. ఉష్ణ ప్రాంతంలో నివసించేవారికి ఇదొక శుభకరమైన చెట్టు. పూజలలో, పెళ్ళిళ్ళలో, ఇతర ఉత్సవాల సమయంలో దీనిని వాడడం జరుగుతుంది.

శాస్త్రీయ విశ్లేషణసవరించు

కొబ్బరికాయలో నీరు, కండ ఉంటాయి. నీరు, కండ, గట్టితనంగల నారతో కప్పబడి ఉంటుంది. కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. దీనికి ఔషధగుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్‌గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతారు. ఈ నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్‌తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు ఉంటాయి. ఆ కారణంగా దీన్ని నెల శిశువు కూడా ఇవ్వవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కొబ్బరి [3]

కొబ్బరి - ఆరోగ్యంసవరించు

ఇందులో ఎలెక్ట్రోలిటిక్ ఉన్నందువల్ల తక్కువ మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు, జలోదరానికీ, మూత్ర విసర్జన ధారాలంగా జరిగేందుకూ, డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, దిగ్భ్రాంతి కలిగినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను వాడవచ్చు. అతిసారం, చీము రక్తం భేదులు, శూల వల్ల కలిగే పేగుల మంటను చల్లార్చడానికి దీనిని వాడవచ్చును. హైపర్ అసిడిటి ఉన్నప్పుడు కూడా దీన్ని వాడవచ్చును. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని ఆపుచేస్తుంది. కలరా వ్యాధికి ఇది మంచి విరుగుడు. కారణం అతిసారం భేదుల వల్ల, వాంతుల వల్ల శరీరంలో తగ్గిపోయిన పొటాషియాన్ని శరీరానికి సరఫరా చేయగలగడమే. మూత్ర విసర్జనను ఎక్కువ చేయగలగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్ధాలను బయటకు గెంటడం వల్ల అంటురోగాల వల్ల కలిగే జ్వరాలకు ఇది వాడబడుతుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు అందులో ఉన్న నీరు జెల్లీలాగా తయారవుతుంది. దీనిని "స్పూన్ కోకోనట్" అంటారు. రుచికరంగా ఉంటూ ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో నూనె, పిండిపదార్ధాలు, మాంసకృత్తుల వల పేగులలో కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఆ కారణంగా ఇది మెరుగైన మాంసకృత్తులతో కూడిన ఆహారంగా భావించబడుతోంది. అంతేకాదు ఇది శరీరంలో ఎలాంటి విషంతో కూడిన వస్తువును చేరనివ్వదు. ఇందులో ఉన్న మెత్తటి కండను గాయాలకు రాయవచ్చును. ఈ కండకు గాయాలను మాపే ఔషధ గుణం ఉంది.

బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేదిమందుగా, క్రిమినాశనిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొబ్బరిని తురిమి కూరలకూ, చట్నీలకూ, తీపిపదార్ధాల తయారీకీ వాడతారు. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్టెరాల్ ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు

కొబ్బరిసవరించు

 
కొబ్బరి చెట్టు

ప్రాచీన కాలంలో విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి . నేటి ఆధునిక మేధావి వర్గం కొబ్బరి అనేక ఆరోగ్య సమస్యలకి సమాదానమంటావుంది . సాంకేతికముగా కొబ్బరిని కోకోస్ న్యుసిఫేరా (CocosNeucifera) అంటారు . నుసిఫెర అంటే పొత్తుతో కూడుకున్నదని అర్ధము (Nutbearing) ప్రపంచములో మూడవ వంతు జనాభా వాళ్ల ఆహారములోను, ఆర్థిక సంపత్తులోను, ప్రతి పూజా-పవిత్ర కార్యక్రమములోను చాల భాగము కొబ్బరితోనే ముడిపడి ఉన్నది . కొబ్బరికాయను అందరూ శుభప్రధముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ, కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే . వారి ఆరోగ్యమూ, సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి . కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు . కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది . ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది . కొబ్బరిచెట్టులో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది . అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు . మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని .అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే) ప్రతీ సంవత్సరము సెప్టెంబరు రెండు న జరుపుతారు .

 
కుంభమేళా వద్ద కొబ్బరికాయలు
 
కొబ్బరి,అల్లం చట్నీలు

కొబ్బరి నీరుసవరించు

ఏ ఋతువులో అయిన తాగదగినవి కొబ్బరి నీరు . లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు, చెక్కెర పరమితం గాను ఉండును . కొబ్బరి బొండం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని (Dehydration) కరక్ట్ చేస్తుంది .

వైద్య పరంగాసవరించు

 
మామిడి, కొబ్బరి రోటి పచ్చడి

జీర్ణకోశ బాధలతో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము, విరేచనాలు అయినపుడు (diarrhoea) ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది, (Oral re-hydration), పొటాసియం గుండె జబ్బులకు మంచిది, వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది, వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరినీతిని లేపనం గావాడాలి . కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి,, ముత్రసంభందమైన జబ్బులలోను, కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది . మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది.

కొబ్బరి పాలుసవరించు

పచ్చికొబ్బరిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు, పాలు మంత్ర జలంలా పనిచేస్తాయి. దీనిలో విటమిన్ ఎ, బి, సి, రైబోఫ్లెవిన్, ఐరన్, కాలసియం, ఫాస్పరస్, పిండిపదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొబ్బరి కాయ ముదిరిపోయాక లోపల పువ్వు వస్తుంది. అది గర్భాశయానికి మేలు చేస్తుంది. బాలింతలు అధిక రక్తస్రావముతో ఇబ్బంది పడుతుంటే కొబ్బరి పువ్వు జ్యూస్‌ను తాగితే సత్వర ఉపశమనం కలుగుతుంది. నిత్యం కొబ్బరి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు. శరీరానికి చల్లదనం లభిస్తుంది. గొంతు మంట, నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరిపాలు తాగితే తగ్గుతుంది.

కొబ్బరి నూనెసవరించు

 
కొబ్బరి

కొబ్బరి నూనెలో యాబై శాతం లారిక్ ఆసిడ్ ఉంటుంది. దీన్ని వంటల్లో అధికంగా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కొవ్వు శాతము పెరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నూనెలో విటమిన్ 'ఇ ' అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కోమలంగా తయారు చేస్తుంది. రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు మంచిది. థైరాయిడ్ సమస్యలూ ఉండవు. పొడి చర్మము ఉన్నవారు పచ్చికొబ్బరి తింటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది, కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకణాలు, మురికి తొలగిపోతాయి. మేను ప్రకాశవంతముగా మెరుస్తుంది. ఇది జుట్టుకు మేలు చేస్తుంది. కొబ్బరి పాలు తలకు పట్టిస్తే, కేశాలు కాంతి వంతముగా తయారౌతాయి.

లక్షణాలుసవరించు

  • శాఖారహిత కాండంతో పెరిగే వృక్షం.
  • పొడవుగా దీర్ఘవృత్తాకారంలో పొడిగించిన కొనతో ఉన్న అనేకమైన పత్రకాలు గల సరళ పిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
  • సంయుక్త స్పాడిక్స్ పుష్పవిన్యాసాక్ష పీఠభాగంలో అమరిన ఆకుపచ్చరంగు స్త్రీ పుష్పాలు, కొనభాగంలో అమరిన మీగడరంగు పురుష పుష్పాలు.
  • పీచు వంటి మధ్య ఫలకవచం ఉన్న టెంకగల ఫలాలు.

ఉపయోగాలుసవరించు

ఆహారపదార్ధంసవరించు

 
లేత కొబ్బరి బొండం పానీయం.
  • కొబ్బరి నీరు మంచి పానీయం. ముదురు కొబ్బరిలో కంటే లేత కొబ్బరి బొండంలో ఎక్కువగా నీరు ఉంటాయి. దీనిలోని లవణాలు వేసవికాలంగా చల్లగా దాహం తీరుస్తాయి.
  • కొబ్బరి పుష్పవిన్యాసాల చివరి భాగాన్ని కాబేజీ లాగా వంటలలో ఉపయోగిస్తారు. వీటి మూలం నుండి కల్లు తీస్తారు.

ఇతరమైనవిసవరించు

వ్యక్తిగత ఉపయోగాలుసవరించు

కొబ్బరి నూనె పొడి చర్మంతో సహాయం, ఒక చర్మం మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తారు. జుట్టు వాడినప్పుడు ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడానికి ఒక అధ్యయనంలో చూపబడింది.

విద్యుత్ లైటింగ్ ఆవిష్కరించడానికి ముందు, కొబ్బరి నూనె ప్రధాన చమురు భారతదేశంలో ప్రకాశం కోసం ఉపయోగిస్తారు. నూనె కొచ్చిన్ ఎగుమతి అయింది.

కొబ్బరి నూనె, సబ్బు తయారీలో ముఖ్యమైన ముడి పదార్ధం. కొబ్బరి నూనెతో చేసిన సబ్బు ఇతర నూనెలతో చేసిన సబ్బు కంటే ఎక్కువ నీరు నిలుపుకుంటుంది. అందువలన తయారీదారు దిగుబడి పెరుగుతుంది. అయితే, కష్టం ఉంటుంది. ఇది కఠిన జలం (క్షార జలం) లో మరింత సులభంగా నురుగు ఇస్తూ ఇతర సబ్బుల కంటే ఉప్పు నీటిలో మరింత కరుగుతుంది.

సంస్కృతిసవరించు

  • హిందువుల సంస్కృతి, సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు. దీనిని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు.
  • భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి.

మూలాలుసవరించు

  1. ఈనాడు (2020-09-02). "మనసు పెడితే.. మనమే మేటి!". www.eenadu.net. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.
  2. నమస్తే తెలంగాణ (2020-09-02). "కొబ్బరి ఆరోగ్యసిరి". ntnews. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-07. Retrieved 2009-07-02.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొబ్బరి&oldid=3032962" నుండి వెలికితీశారు