కొమురవెల్లి మండలం (సిద్దిపేట జిల్లా)

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం


కొమురవెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1]

కొమురవెల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°55′45″N 78°53′48″E / 17.929125°N 78.896561°E / 17.929125; 78.896561
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం కొమురవెల్లి
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 75 km² (29 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 18,031
 - పురుషులు 8,983
 - స్త్రీలు 9,048
పిన్‌కోడ్ 506355

ఇది సమీప పట్టణమైన సిద్ధిపేట నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. కొమురవెల్లి, ఈ మండలానికి కేంద్రం.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

లోగడ కొమురవెల్లి గ్రామం మెదక్ జిల్లా, సిద్దిపేట రెవెన్యూ డివిజను పరిధిలోని చేర్యాల మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కొమురవెల్లి గ్రామాన్ని (1+08) తొమ్మిది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా సిద్ధిపేట జిల్లా,సిద్ధిపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 75 చ.కి.మీ. కాగా, జనాభా 18,031. జనాభాలో పురుషులు 8,983 కాగా, స్త్రీల సంఖ్య 9,048. మండలంలో 4,068 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కిష్టంపేట్
  2. మర్రిముస్త్యాల
  3. గౌరాయపల్లి
  4. కొమురవెల్లి
  5. రాంసాగర్
  6. ఐనాపూర్
  7. తపస్పల్లి
  8. గురవన్నపేట్
  9. పోసన్‌పల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 240, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు