సిద్ధిపేట రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

సిద్ధిపేట రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. సిద్ధిపేట జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం సిద్ధిపేట పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవిన్యూ డివిజను సిద్ధిపేట లోకసభ నియోజకవర్గంలోని సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

సిద్ధిపేట రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసిద్ధిపేట

వివరాలుసవరించు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]

పరిపాలనసవరించు

సిద్ధిపేట డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం సిద్ధిపేట రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 సిద్దిపేట పట్టణ మండలం 12 రెవెన్యూ గ్రామాలు
2 సిద్దిపేట గ్రామీణ మండలం 12 రెవెన్యూ గ్రామాలు
3 నంగునూరు మండలం 19 రెవెన్యూ గ్రామాలు
4 చిన్నకోడూర్ మండలం 20 రెవెన్యూ గ్రామాలు
5 తొగుట మండలం 16 రెవెన్యూ గ్రామాలు
6 దౌలతాబాద్ మండలం 20 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
7 మిరుదొడ్డి మండలం 17 రెవెన్యూ గ్రామాలు
8 దుబ్బాక మండలం 26 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
9 చేర్యాల మండలం 14 రెవెన్యూ గ్రామాలు
10 కొమురవెల్లి మంండలం 9 రెవెన్యూ గ్రామాలు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-03.
  3. "Subdivision & Blocks | GOVERNMENT OF TELANGANA, SIDDIPET DISTRICT | India". siddipet.telangana.gov.in. Archived from the original on 2021-02-26. Retrieved 2022-08-03.
  4. Vemula, Prakash (2022-03-15). "List of Revenue Divisions, Mandals in Siddipet District". TeachersBadi. Archived from the original on 2020-09-25. Retrieved 2022-08-03.
  5. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-03.