కొమ్మినేని శ్రీనివాసరావు

కొమ్మినేని శ్రీనివాసరావు (జ. 1956 ఆగస్టు 26) KSR గా సుపరిచితులు. ఈయన తెలుగు జర్నలిష్టు, రచయిత, దూరదర్శన్ వ్యాఖ్యాత. ఈయన ప్రస్తుతం సాక్షిలో పనిచేస్తున్నాడు.[1] టెలివిజన్ లో ప్రముఖ షో అయిన "లైవ్ షో విత్ కె.s.ఆర్"ను నిర్వహిస్తున్నాడు.

కొమ్మినేని శ్రీనివాసరావు
Kommineni Srinivasa Rao.jpg
కొమ్మినేని శ్రీనివాసరావు
జననంకొమ్మినేని శ్రీనివాసరావు
(1956-08-26) 1956 ఆగస్టు 26 (వయస్సు: 63  సంవత్సరాలు)
గన్నవరం, ఆంధ్రప్రదేశ్
వృత్తిపాత్రికేయుడు
రచయిత
టాక్ షో అతిధేయుడు
క్రియాశీలక సంవత్సరాలు1978 to ప్రస్తుతం
భార్య / భర్తకొమ్మినేని రాజ్యలక్ష్మీ
తల్లిదండ్రులుకొమ్మినేని రామరావు, కొమ్మినేని జయలక్ష్మీ

ప్రారంభ జీవితంసవరించు

కొమ్మినేని శ్రీనివాసరావు గన్నవరం,కృష్ణా జిల్లా,ఆంధ్రప్రదేశ్లో కొమ్మినేని రామారావు , కొమ్మినేని జయలక్ష్మిలకు జన్మించాడు. అతనికి కృష్ణబాబు (గన్నవరంలో పాఠశాల నిర్వహిస్తున్నారు) , లక్ష్మీనారాయణ (ఈనాడులో పాత్రికేయుడు) అను ఇద్దరు సోదరులు గలరు.

విద్యసవరించు

అతను గన్నవరం లో పాఠశాల, కళాశాల విద్యలనభ్యసించాడు. అతను కృష్ణా జిల్లా గన్నవరం జిల్లా పరిషాత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత అతను ఎం.కాం ను చదివాడు.

జీవిత విశేషాలుసవరించు

అతను సుమారు 33 సంవత్సరాలు వివిధ వార్తా పత్రికలలో, టీవీ చానెళ్ళలో విలేకరిగా పనిచేశాడు.

ఈనాడు పత్రిక [1978-2002]సవరించు

1978లో అతను ఈనాడు లో చేరాడు. ఈనాడు లో చేరక ముందు అతను అనేక పత్రికలలో అనేక వ్యాసాలను రాసాడు. అతను విజయవాడ, తిరుపతి తరువాత హైదరబాదులలో పనిచేసాడు. అతను పత్రికలలో వివిధ భాద్యతలను నిర్వర్తించాడు. సబ్ ఎడిటరుగా, రిపోర్టరుగా, ఛీఫ్ రిపోర్టరుగా వివిధ స్థానాలలో తన సేవలనందించాడు. 1986లో జరిగిన గోదావరి జిల్లాలలో జరిగిన వరద భీభత్సం, 1990లో లాథూరులో జరిగిన భయంకరమైన భూకంపం, 1992లో తిరుపతిలో జరిగిన ఎ.ఐ.సి.సి కార్యక్రమం, తెలుగుదేశంపార్టీ మహానాడు వంటి వాటిలో అతను పాత్రికేయునిగా ముఖ్య భూమిక పోషించాడు. అతను ఢిల్లీలో ఈనాడు బ్యూరో ఛీఫ్ గా పనిచేసాడు. పార్లమెంటు పై టెర్రరిస్టుల దాడి జరిగినపుడు ఆ సంఘటనను వార్తాంశంగా చిత్రీకరించాడు. బిల్ గేట్స్ హైదరాబాదు వచ్చినపుడు ఆ వార్త ప్రచురణద్వారా గుర్తింపు పొందాడు.

ఆంధ్ర జ్యోతి [2002-2006]సవరించు

అతను 2002లో ఆంధ్రజ్యోతి లో చేరాడు. నాలుగున్నరేళ్ళు ఆంధ్రజ్యోతి పత్రికకు భ్యూరో చీఫ్ గా భాద్యతలను చేపట్టాడు.

TV5సవరించు

ఆధ్రజ్యోతిలో పనిచేసిన తరువాత అతను ఎన్.టి.వి లో చేరాడు. ఆ మేనేజిమెంటుతో వచ్చిన విభేదాల వలన కొద్దినెలలలోనే ఆ ఛానెల్ నుండి తప్పుకున్నాడు. తరువాత టి.వి.5 టెలివిజన్ ఛానెల్ లో పొలిటికల్ ఎడిటరుగా చేరి ఆ ఛానెల్‌కు సంపాదకునిగా కూడా పనిచేసాడు. అతను "న్యూస్ స్కాన్" అనే కార్యక్రమాన్ని రూపొందించాడు. దీని ఫలితంగా అతనికి విశేష గుర్తింపు వచ్చింది. అనేక మంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఆ ఛానెల్ లో రెడున్నరేళ్ళు పనిచేసి తరువాత ఎన్.టి.విలో ప్రధాన సంపాదకునిగా పనిచేసాడు.

NTVసవరించు

అతను ప్రస్తుతం సాక్షిలో పనిచేస్తున్నాడు. అతను "లైవ్ షో విత్ కె.ఎస్.ఆర్" కార్యక్రమాన్ని రూపొందించాడు.

రచనలుసవరించు

 • కె.ఎస్.ఆర్ ఈ క్రింది పుస్తకాలను రచించాడు[2].
 • రాష్ట్రంలో రాజకీయం
 • ఆంధ్ర టు అమెరికా
 • తెలుగు తీర్పు - 1999
 • తెలుగు తీర్పు -2004
 • తెలుగు ప్రజాతీర్పు - 2009
 • తాజాకలం
 • శాసనసభ చర్చల సరళి - 1956 నుండి 1960
 • శాసన సభ చర్చల సరళి - 1960 - 1971
 • రాజకీయ చదరంగంలో రాష్ట్రం

వ్యక్తిగత జీవితంసవరించు

అతను 1982లో రాజ్యలక్ష్మీని వివాహమాడాడు. ఆమె ఎ.పి సీడ్స్ లో అధికారిణి.

పురస్కారాలుసవరించు

 • ఎన్.జి.రంగా మెమోరియల్ అవార్డు.
 • రాజారెడ్డి మెమోరియల్ అవార్డు.

మూలాలుసవరించు

 1. http://en.wikipedia.org/wiki/NTV_%28India%29
 2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-05-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-08-24. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు