గన్నవరం (కృష్ణా జిల్లా)
గన్నవరం కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5452 ఇళ్లతో, 20728 జనాభాతో 1230 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 10614, ఆడవారి సంఖ్య 10114. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3750 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 378. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589245[1].పిన్ కోడ్: 521101, ఎస్.టీ.డీ.కోడ్ = 08676.
గన్నవరం (కృష్ణా జిల్లా) | |
— రెవిన్యూ గ్రామం — | |
గన్నవరం విహంగ వీక్షణం | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గన్నవరం |
ప్రభుత్వము | |
- సర్పంచి | నీలం ప్రవీణ్ కుమార్ |
జనాభా (2001) | |
- మొత్తం | 20,728 |
- పురుషులు | 10,234 |
- స్త్రీలు | 10,208 |
- గృహాల సంఖ్య | 4,611 |
పిన్ కోడ్ | 521 101 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
గన్నవరం | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో గన్నవరం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గన్నవరం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | గన్నవరం |
గ్రామాలు | 25 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 80,404 |
- పురుషులు | 40,520 |
- స్త్రీలు | 39,884 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 67.60% |
- పురుషులు | 73.24% |
- స్త్రీలు | 61.90% |
పిన్‌కోడ్ | 521101 |
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
ఇది ఒకప్పుడు విష్ణుకుండినుల కాలంలో "జ్ఞానవరం" అని పిలువబడి ఒక హిందూ ధర్మక్షేత్రంగా వర్ధిల్లింది.[2] ఇంతకు పూర్వం గన్నవరం తాలూకాగా ఉండి తరువాత మండలంగా ఏర్పరచబడింది. జ్ఞానవరం అనే సంస్కృత మూలాలను కొందరు వివరిస్తున్నాను, మరికొందరు గ్రామనామాధ్యయన కర్తలు విభేదిస్తున్నారు. వారి ప్రకారం గ్రామనామాల్లోని వరం అనేది ఒకరి అనుగ్రహంతో పొందే వరం వంటిది కాదు. గన్నవరం అనే పేరు గనివారం అనే దేశీపదం నుంచి పుట్టిందని పేర్కొన్నారు. గనివారం అనే పదానికి చెరువు కింది భూమి అనే అర్థాన్ని ఇస్తోంది.[3]
గ్రామ భౌగోళికంసవరించు
సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు [4]విజయవాడ పట్టణానికి 24 కి.మీ. దూరంలో చెన్నై - కొలకత్తా జాతీయ రహదారి 5 మీద ఉంది. విజయవాడ విమానాశ్రయంగా చెప్పబడే విమానాశ్రయం నిజానికి గన్నవరంలో ఉంది.
సమీప గ్రామాలుసవరించు
బుద్దవరం 3 కి.మీ, అల్లాపురం 3 కి.మీ, కొండపవుల్లూరు 3 కి.మీ, పురుషోత్తపట్నం 3 కి.మీ, కేసరపల్లి 4 కి.మీ
సమీప మండలాలుసవరించు
సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు
గన్నవరంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. విజయవాడ విమానాశ్రయంగా చెప్పబడే విమానాశ్రయం నిజానికి గన్నవరంలో ఉంది. ఈ విమానాశ్రయం సముద్ర మట్టానికి 82 అడుగుల ఎత్తులో ఉంది. రన్‌వే పొడవు 6000 అడుగులు. హైదరాబాదు నుండి, బెంగళూరునుండి విజయవాడకు (గన్నవరానికి) నిత్యం విమానాల రాకపోకలున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రయాణాలు పెరగడం వలన ఈ విమానాశ్రయం వసతులు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానాశ్రయ అభివృద్ధి కోసము 465 యెకరములు భూమి అవసరము ఉంది. అందుకు అజ్జంపూడి, కేసరపల్లి, బుద్దవరం గ్రామముల నుండి కావలసిన భూమిని ప్రభుత్వము వారు సేకరించనున్నారు.
గన్నవరం, మానికొండ, పెనమలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 22 కి.మీ దూరంలో ఉంది.
విద్యా సౌకర్యాలుసవరించు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ పాలీటెక్నిక్ ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల సూరంపల్లిలో ఉంది. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల సూరంపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.
- పశు విశ్వవిద్యాలయము.
- వైద్య కళాశాల.
- ఐటీ పార్క్.
- శ్రీ వేములపల్లి కోదండరామయ్య డిగ్రీ కళాశాల (వి.కె.ఆర్.కళాశాల):- ఈ కళాశాలను 1969 లో దాతలు, గ్రామ పెద్దలు కలిసి ఏర్పాటు చేసారు.
- సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాల.
- ముక్కామల జగదీశ్వరరావు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల (దావాజీగూడెం);- ఈ పాఠశాలలో 2014, అక్టోబరు-30న, ఎన్.టి.ఆర్. ట్రస్ట్ తరపున ఏర్పాటుచేసిన సురక్షిత త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని, శ్రీ పాలడుగు హనుమంతరావు, శ్రీమతి కరుణకుమారి, వారి కుమారుడు వెంకటరామవరప్రసాదు దాతృత్వంతో అందజేసిన రు. 2.5 లక్షలతో నిర్మించారు. [7]
- శ్రీమతి వేములపల్లి అన్నపూర్ణ జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల.
- స్రవంతి ఉన్నత పాఠశాల.
- శ్రీ దత్త శ్రీనివాస ఉన్నత పాఠశాల.
- గ్రంథాలయం:- గన్నవరం మండల పరిషత్తు కార్యాలయంలో, 500 చ.గ.స్థలంలో, 34 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రథమశ్రేణి గ్రంథాలయ భవనానికి, 2016,జనవరి-24వ తేదీ ఆదివారంనాడు శంకుస్థాపన నిర్వహించారు. [12]
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
బ్యాంకులుసవరించు
విజయా బ్యాంక్:- గన్నవరంలో ఆర్.టి.సి.బస్ స్టాండ్ ఎదురుగా, ఈ బ్యాంక్ శాఖను, 2014,డిసెంబరు-18వ తేదీన ప్రారంభించారు. [8]
కోస్టల్ లోకల్ ఏరియా బ్యంక్ లిమిటెడ్. ఫో.నం. 08676/254866.
వైద్య సౌకర్యాలుసవరించు
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల.
వ్యవసాయం, నీటివనరులుసవరించు
పానకాల చెరువు:- గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్.ఎస్.నం. 86 లో ఉన్న ఈ చెరువు, 18.26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. [10]
గన్నవరం పరిపాలనా వివరాలుసవరించు
గన్నవరం పంచాయితీసవరించు
గన్నవరం పంచాయితీ 17.4.1955న 6000 జనాభాతో,7000 రూపాయిల వార్షికాదాయంతో ఏర్పడింది. క్రమంగా ఈ పంచాయితీ జనాభా సుమారు 30,000 అయ్యింది(2001 జనగణన ప్రకారం 20444). పంచాయితి వైశాల్యం 3039.11 చదరపు గజాలు. వార్షికాదాయం 90 లక్షల రూపాయలు.[2]
- 1956-59లో మొదటి సర్పంచ్ జాస్తి వెంకటేశ్వరరావు. 10 వార్డు మెంబర్లుండేవారు.
- తరువాత కాట్రగడ్డ పెదవెంకటరాయుడు సర్పంచిగా (1959-64)ఉన్నపుడు 13మంది వార్డు మెంబర్లు.
- తరువాత మళ్ళీ జాస్తి వెంకటేశ్వరరావు 1964 నుండి 1995వరకు వరుసగా ఎన్నికయ్యాడు.
- 1995 నుండి 2001 వరకు తుల్లిమిల్లి ఝాన్సీ లక్ష్మి - వార్డు మెంబర్లు 19 మంది.
- 2001 నుండి 2006 వరకు - గుడిపాటి తులసీమోహన్ సర్పంచ్‌గా ఉన్నాడు. వార్డు మెంబర్లు 20 మంది.
- 2013 జూలైలో శ్రీ నీలం ప్రవీణ్ కుమార్ గన్నవరం సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ జాస్తి శ్రీధరరావు ఎన్నికైనారు.
గన్నవరం శాసనసభసవరించు
పుచలపల్లి సుందరయ్యసవరించు
గన్నవరం నుంచి శాసనసభకు కమ్యూనిస్టు అగ్ర నేత పుచ్చలపల్లి సుందరయ్య మూడు సార్లు విజయం సాధించారు. మూడు సార్లు గెలిచిన రికార్డు ఇప్పటికీ ఆయనదే. పుచలపల్లి సుందరయ్య గన్నవరం ఎమ్మెలేగా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసారు. రెండు దపాలు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసారు. సీపీఎం అగ్ర నేతగా ఆయన గన్నవరానికి ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టారు.
ఇతరులుసవరించు
ముసునూరు రత్నబోసు రెండు సార్లు.దాసరి బాలవర్ధనరావు రెండు సార్లు,కాకాని వెంకతరత్నం. ఆనందబాయి. గద్దె రామమోహన్. వెలివెల సీతారామయ్య. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఒక్కొక్కసారీ గెలిచారు.
గన్నవరం సమితిసవరించు
కడియాల రాఘవరావు జెడ్.పి. చైర్మన్ గా పనిచేసారు.
దాక్టరు సీ.ఎల్.రాయుడు, అట్లూరి శ్రీమన్నారాయణ గన్నవరం సమితి ప్రెసిడెంటుగా పనిచేశారు.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు
శ్రీ వెంకటేశ్వరశ్వరస్వామివారి ఆలయంసవరించు
శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయంసవరించు
శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీతిరుపతమ్మవారి ఆలయంసవరించు
పాత గన్నవరంలో ఉన్న ఈ ఆలయంలో, 2014, జూలై-27 నుండి నెలరోజులపాటు శ్రావణమాస పూజలు నిర్వహించెదరు. 2014, ఆగష్టు-8వ తేదీ, రెండవ శ్రావణ శుక్రవారం నుండి 10వ తేదీ ఆదివారం (శ్రావణ పౌర్ణమి) వరకు, అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు తిరిగి ఆలయప్రవేశం చేసారు. వేదపండితులు, గోపయ్యస్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారి ప్రతిమలకు పూజలు చేసారు. [5]&[6]
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమికి అమ్మవారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [13]
శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయంసవరించు
ఈ ఆలయం గన్నవరంలోని కోనాయి చెరువు సమీపంలో ఉంది.
శ్రీ సోమలింగేశ్వరస్వామివారి ఆలయంసవరించు
ఈ ఆలయం గన్నవరంలో విమానాశ్రయ సమీపంలో ఉంది.
శ్రీ రామాలయంసవరించు
ఈ ఆలయం స్థానిక కొత్తపేటలో ఉంది.
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ దేవస్థానంసవరించు
ఈ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,ఏప్రిల్-20వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ విగ్రహాలతోపాటు, ఈశ్వరీమత, సిద్ధయ్య, శ్రీ విఘ్నేశ్వరస్వామి, జంటనాగుల విగ్రహల ప్రతిష్ఠ నిర్వహింఎదరు. [9]
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు
శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంసవరించు
స్థానిక మదర్ థెరెస్సా కాలనీలో నెలకొన్న ఈ ఆలయ 21వ వార్షికోత్సవం, 2016,ఏప్రిల్-7వ తేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణచేసి కుంకుమపూజలు చేసారు. ఈ సందర్భంగా లలితాసహస్రనామ పారాయణ, ప్రత్యేకపూజలు చేసారు. ఈ కార్యక్రమానికి భక్తులు గన్నవరం పరిసర ప్రాంతాలనుండి అధికసంఖ్యలో విచ్చేసి, అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [14]
వైద్య సౌకర్యంసవరించు
ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు
గన్నవరంలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక కుటుంబ సంక్షేమ కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.
ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు
గ్రామంలో8 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు 8 మంది, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు 8 మంది, ఐదుగురు నాటు వైద్యులు ఉన్నారు. 8 మందుల దుకాణాలు ఉన్నాయి.
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
పరిశ్రమలుసవరించు
- చక్కెర కర్మాగారం
- బేకన్ ఫ్యాక్టరీ
- ఒక ఐ.టీ.పార్కు నిర్మాణం జరుగుతున్నది.[5]
- ఆంధ్రప్రదేశ్ ఎల్రక్టానిక్ కార్పొరేషన్' సంస్థలో దృశ్య, శ్రవణ విద్యాబోధనకు ఉపకరించే టీవీలు, వీసీపీలు, వీసీఆర్‌లు గన్నవరంలో అసెంబ్లింగ్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఉపకరణాలు రవాణా చేసేవారు.40లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండంతస్థుల (అపెల్) ఆంధ్రప్రదేశ్ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ భవనాన్ని వెటర్నరీ కళాశాల 'లైవ్‌స్టాక్' విభాగానికి అప్పగించారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ ట్రాన్స్‌పోర్టు అకాడమీని (హైదరాబాద్‌కు తరలించారు).ప్రస్తుతం ఆ భవనాల్లో ఆర్టీసీ జోనల్ సిబ్బంది కళాశాలను నిర్వహిస్తున్నారు.
- కలర్ పిక్చర్ ట్యూబ్ కంపెనీ, ఆర్టీసీ బస్ బాడీబిల్డింగ్ పరిశ్రమకు అవసరమైన స్థలాన్ని సేకరించారు.
- విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో జాతీయ రహదారికి ఆనుకున్న 7.3 ఎకరాలలో ఉడా ఐదు కోట్ల వ్యయంతో కన్వెన్షనల్ సెంటర్‌ను నెలకొల్పనున్నది. కన్వెన్షనల్ సెంటర్‌లో వ్యాపార కేంద్రాలతోపాటువైఎస్ స్మారక భవనం, గెస్ట్‌హౌస్, సెమినార్‌హాల్, హోటల్ కూడా ఉంటాయి.
- ప్రస్తుతం విమానాశ్రయం ఎదురుగా ఉన్న 12 ఎకరాల స్థలాన్ని రవాణా శాఖ డ్రైవింగ్ పరీక్షల నిమిత్తం వాడుకుంటున్నది.ఆర్టీఏ కార్యాలయానికి ప్రత్యామ్నాయంగా ఐటీ పార్కు ముఖద్వారం ఎదురుగా ఆర్.ఎస్. నెం. 29/5లోని 5 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని కేటాయించడం జరిగింది.
- ఐటీ పార్కు ప్రారంభమవడంతో విమానాశ్రయానికి రద్దీ పెరుగుతోంది. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూమిని సేకరించి ఇవ్వమని కేంద్ర విమానయానశాఖ ప్రభుత్వాన్ని కోరింది.
ప్రముఖులుసవరించు
- పుచ్చలపల్లి సుందరయ్య గన్నవరం నియోజకవర్గం నుండి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన స్మృత్యర్ధం పుచ్చలపల్లి సుందరయ్య పార్కు నిర్మాణం ప్రాజెక్టును గ్రామ పంచాయితీ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు రూ. 30 లక్షల వ్యయంతో పూర్తి చేసారు.
- తాడేపల్లి శ్రీకంఠశాస్త్రి సంగీత సాహిత్య సుధానిధి, విద్యా ఉపాసకులు, సంగీత విద్వాంసులు. ఆకాశవాణి కళాకారులు. వీరి స్వగ్రామం అవనిగడ్డ అయినా వీరు, గత 15 సంవత్సరాలుగా గన్నవరం బ్రాహ్మణ పరిషత్తు ప్రాంతంలో నివసించారు. వీరు ప్రఖ్యాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి మిత్రులు. వీరు 89 సంవత్సరాల వయస్సులో, 2015,జూన్-23వ తేదీ రాత్రి, గుంటూరులో పరమపదించారు. [11]
- కొమ్మాజోస్యుల ఇందిరాదేవి
తాగు నీరుసవరించు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యంసవరించు
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
గన్నవరం మండలంలో గ్రామాలుసవరించు
- అజ్జంపూడి
- అల్లాపురం
- బహుబలేంద్రునిగూడెం
- బల్లిపర్రు (గన్నవరం)
- బుద్దవరం
- బూతుమిల్లిపాడు
- చిక్కవరం
- చిన్నఅవుటపల్లి
- గన్నవరం
- గొల్లనపల్లి
- గోపవరపుగూడెం
- జక్కులనెక్కాలం
- కేసరపల్లి
- కొండపవుల్లూరు
- మర్లపాలెం
- మాదలవారిగూడెం
- ముదిరాజుపాలెం
- ముస్తాబాద
- మెట్లపల్లి
- పురుషోత్తపట్నం
- రామచంద్రాపురం
- సగ్గురుఆమని
- సవారిగూడెం
- సూరంపల్లి
- తెంపల్లి
- వెదురుపావులూరు
- వీరపనేనిగూడెం
- వెంకటనరసింహాపురం
- వెంకటనరసింహాపురం(u)
- పెద్ద అవుటపల్లి
- దావాజిగూడెం
- దుర్గాపురం
- కొత్తగూడెం(గన్నవరం)
- కట్టుబడిపాలెం(గన్నవరం)
జనాభాసవరించు
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[6]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అజ్జంపూడి | 288 | 1,127 | 571 | 556 |
2. | అల్లాపురం | 484 | 2,015 | 991 | 1,024 |
3. | బహుబలేంద్రునిగూడెం | 468 | 1,839 | 911 | 928 |
4. | బల్లిపర్రు | 180 | 702 | 362 | 340 |
5. | బుద్దవరం | 2,200 | 8,763 | 4,520 | 4,243 |
6. | బూతుమిల్లిపాడు | 56 | 193 | 90 | 103 |
7. | చిక్కవరం | 452 | 1,671 | 856 | 815 |
8. | చిన్నఅవుటపల్లి | 437 | 1,554 | 795 | 759 |
9. | గన్నవరం | 4,611 | 20,442 | 10,234 | 10,208 |
10. | గొల్లనపల్లి | 676 | 2,753 | 1,339 | 1,414 |
11. | గోపవరపుగూడెం | 412 | 1,522 | 787 | 735 |
12. | జక్కులనెక్కాలం | 244 | 798 | 393 | 405 |
13. | కేసరపల్లి | 2,167 | 8,675 | 4,404 | 4,271 |
14. | కొండపవుల్లూరు | 693 | 2,541 | 1,295 | 1,246 |
15. | మెట్లపల్లి | 134 | 554 | 282 | 272 |
16. | పురుషోత్తపట్నం | 574 | 2,094 | 1,040 | 1,054 |
17. | రామచంద్రాపురం | 148 | 668 | 340 | 328 |
18. | సవారిగూడెం | 279 | 1,146 | 579 | 567 |
19. | సూరంపల్లి | 1,810 | 7,285 | 3,708 | 3,577 |
20. | తెంపల్లి | 580 | 2,275 | 1,176 | 1,099 |
21. | వెదురుపావులూరు | 1,817 | 7,518 | 3,704 | 3,814 |
22. | వీరపనేనిగూడెం | 1,142 | 4,261 | 2,139 | 2,122 |
23. | వెంకటనరసింహాపురం | 3 | 8 | 4 | 4 |
మార్కెటింగు, బ్యాంకింగుసవరించు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తుసవరించు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగంసవరించు
గన్నవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 386 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 16 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 1 హెక్టార్లు
- బంజరు భూమి: 206 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 619 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 695 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 131 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలుసవరించు
గన్నవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 12 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 118 హెక్టార్లు
ఉత్పత్తిసవరించు
గన్నవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలుసవరించు
పారిశ్రామిక ఉత్పత్తులుసవరించు
ఇటుకలు, కాగితం ఉత్పత్తులు
మూలాలు, వనరులుసవరించు
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ 2.0 2.1 "గ్రామ పంచాయితీ వెబ్ సైటు". Archived from the original on 2008-06-12. Retrieved 2008-06-06.
- ↑ "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక". Archived from the original on 2014-09-02. Retrieved 2014-03-16.
- ↑ "గన్నవరం". Archived from the original on 19 ఆగస్టు 2017. Retrieved 19 June 2016. Check date values in:
|archive-date=
(help) - ↑ హిందూ దినపత్రికలో వార్త
- ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-03.
Wikimedia Commons has media related to Gannavaram. |
బయటి లింకులుసవరించు
[5] ఈనాడు విజయవాడ; 2014,జులై-28; 4వపేజీ. [6] ఈనాడు విజయవాడ; 2014,ఆగష్టు-11; 4వపేజీ. [7] ఈనాడు విజయవాడ; 2014,అక్టోబరు-31; 5వపేజీ. [8] ఈనాడు విజయవాడ; 2014,డిసెంబరు-19; 10వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,ఏప్రిల్-20; 4వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,మే-10; 5వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015,జూన్-25; 9వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2016,జనవరి-25; 4వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-21; 4వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2015,ఏప్రిల్-8; 4వపేజీ.